ETV Bharat / offbeat

పక్కా హైద్రాబాదీ​ గ్రీన్​ చికెన్​ కర్రీ - ఇలా వండితే టేస్ట్ వేరే లెవల్​ అంతే! - Green Chicken Curry

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 17, 2024, 4:21 PM IST

Hyderabadi Green Chicken Curry : చికెన్​తో ఎప్పుడూ ఒకేలా కాకుండా రకరకాల రెసిపీలు చేసుకుని తింటే.. ఆ రుచిని మరింతగా ఆస్వాదించవచ్చు. అందుకే.. ఈ సండే కోసం హైదరాబాద్​ స్టైల్​ "గ్రీన్​ చికెన్​ కర్రీ" రెసిపీ తెచ్చాం. ఓ సారి టేస్ట్​ చూసి చెప్పండి ఎలా ఉందో!

Green Chicken Curry
Hyderabadi Green Chicken Curry (ETV Bharat)

How To Make Green Chicken Curry : నాన్ వెజ్ ప్రియులు.. ఇంట్లో చికెన్​ కర్రీ చేశారంటే ఎగిరి గంతేస్తారు. వారంలో కనీసం రెండుమూడు రోజులు చికెన్ తినేవారు చాలా మందే! అయితే.. ఇంట్లో ఎప్పుడూ ఒకేలా చికెన్​ కర్రీ వండితే అంతగా టేస్ట్ దొరకదు. మీకు కూడా ఇలానే అనిపిస్తోందా ? అయితే.. హైదరాబాద్​ స్టైల్లో అద్దిరిపోయే ఒక చికెన్​ రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నాం. అదే "గ్రీన్​ చికెన్​ కర్రీ". ఒక్కసారి ఈ కోడికూర తిన్నారంటే.. ఇంట్లో వాళ్లందరూ ఫిదా అయిపోతారు. అంత బాగుంటుంది దీని టేస్ట్​. చాలా త్వరగా.. ఎంతో రుచికరంగా గ్రీన్​ చికెన్​ కర్రీని ఇంట్లో ఎలా వండాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • చికెన్ - అరకిలో
  • నూనె- 3 టేబుల్​స్పూన్లు
  • పెరుగు -పావు కప్పు
  • పసుపు -టీస్పూన్
  • అల్లం ముక్కలు - 2
  • వెల్లుల్లి రెబ్బలు-10
  • జీడిపప్పులు-10
  • మిరియాల పొడి- అరటీస్పూన్
  • గరంమసాలా-అరటీస్పూన్
  • కారం - టీ స్పూన్​
  • కొత్తిమీర- కప్పు
  • పుదీనా- కప్పు
  • నిమ్మరసం- కొద్దిగా
  • పచ్చిమిర్చిలు- 12
  • ఉల్లిపాయలు-2
  • దాల్చిన చెక్క- చిన్నది
  • బిర్యానీ ఆకు-1
  • యాలకులు-4
  • లవంగాలు-3
  • ఉప్పు-రుచికి సరిపడా

తయారీ విధానం :

  • ముందుగా చికెన్​ బాగా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్​లోకి అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చిలు, కొత్తిమీర, పుదీనా, పెరుగు, జీడిపప్పులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే మీరు కొన్ని నీళ్లు కూడా పోసుకోవచ్చు.
  • గ్రైండ్​ చేసుకున్న మిశ్రమాన్ని చికెన్​ గిన్నెలో వేసి బాగా మిక్స్​ చేయాలి. ఇందులో కొద్దిగా నిమ్మరసం, పసుపు, ఉప్పు వేసుకుని మరొసారి కలుపుకోవాలి. దీనిని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్​ పెట్టి ఆయిల్​ వేయాలి. ఇందులోకి బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, షాజీరా వేసుకుని కలుపుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసే రంగు మారేదాకా ఫ్రై చేసుకోవాలి.
  • తర్వాత మారినేట్​ చేసుకున్ని చికెన్​ వేసి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు గరంమసాలా, మిరియాల పొడి, కొన్ని నీళ్లు వేసుకుని కలుపుకోవాలి.
  • కొద్దిసేపటి తర్వాత మీ రుచికి సరిపడా విధంగా ఉప్పు వేసుకుని, కొద్దిగా కారం వేసుకుని మూత పెట్టాలి.
  • సన్నని మంటమీద చికెన్​ బాగా ఉడికించుకోవాలి. చివర్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకుని చికెన్​ సర్వ్​ చేసుకుంటే టేస్ట్ అద్దిరిపోతుంది.
  • ఈ గ్రీన్​ చికెన్​ కర్రీ వేడివేడి అన్నంలోకి, చపాతీల్లోకి సూపర్​ టేస్టీగా ఉంటుంది.
  • నచ్చితే మీరు కూడా కాస్త కొత్తగా ఈ గ్రీన్​ చికెన్​ కర్రీ చేసేయండి!

ఇవి కూడా చదవండి :

"అమృత్​ సరి" చికెన్ రెసిపీ - ఈ పంజాబీ స్టైల్​ ​కర్రీ తిన్నారంటే "భల్లే భల్లే" అనాల్సిందే!

ఘాటు తక్కువ, ఘుమాయింపు ఎక్కువ - "రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్" - ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.