ETV Bharat / offbeat

గోంగూరతో చికెన్ కర్రీ మాత్రమే కాదు బిర్యానీ చేయవచ్చు - ఇలా ప్రిపేర్​ చేయండి - టేస్ట్​ సూపర్​! - How to Make Gongura Chicken Biryani - HOW TO MAKE GONGURA CHICKEN BIRYANI

How to Make Gongura Chicken Biryani: మీకు బిర్యానీ అంటే చాలా ఇష్టమా? అయితే.. ఎప్పుడూ తినే రొటీన్ చికెన్​ బిర్యానీ కాకుండా.. ఈసారి వెరైటీగా గోంగూర చికెన్ బిర్యానీ ట్రై చేయండి. ఒక్కసారి టేస్ట్​ చేయండి.. అద్దిరిపోతుందంటే నమ్మండి! ఇక లేట్​ లేకుండా ఈ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

how to make gongura chicken biryani
How to Make Gongura Chicken Biryani (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Sep 26, 2024, 12:33 PM IST

How to Make Gongura Chicken Biryani: గోంగూరతో చేసే వంటలు అందరికీ సుపరిచితమే. గోంగూర కూర మొదలు.. పచ్చడి, వేపుడు, తొక్కు, పప్పు.. ఇలా ఒక్కటేమిటి దీనితో ఏది చేసినా రుచి అద్దిరిపోవాల్సిందే. అంతేనా గోంగూర విడిగా మాత్రమే కాదు.. చికెన్​, మటన్​, ప్రాన్స్​.. ఇలా నాన్​వెజ్​ కాంబినేషన్​ ఏదైనా టేస్ట్​ మరో లెవల్​ అంతే. అయితే ఎప్పడూ గోంగూరతో చేసే కూరలే కాకుండా.. కాకుండా ఈసారి కాస్త వెరైటీగా గోంగూర చికెన్​ బిర్యానీ చేసుకోండి. దీని టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. మరి ఇందులోకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం..

కావాల్సిన పదార్థాలు

  • 2 కట్టల గోంగూర
  • 3 చెంచాల నూనె
  • 15 పచ్చిమిరపకాయలు
  • అర చెంచా పసుపు
  • ఒక చెంచా ఉప్పు

చికెన్ కోసం కావాల్సిన పదార్థాలు

  • ఒక కేజీ చికెన్
  • ఒక చెంచా పసుపు
  • ఒక చెంచా ఉప్పు
  • రెండు చెంచాల కారం
  • రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్
  • 3 చెంచాల నెయ్యి
  • ఒక చెంచా నూనె
  • 2 బిర్యానీ ఆకులు
  • 4 లవంగాలు
  • 4 యాలకలు
  • ఒక అనాస పువ్వు
  • ఒక ఇంచు దాల్చిన చెక్క
  • 3 ఉల్లిపాయ ముక్కలు

బిర్యానీ కోసం కావాల్సిన పదార్థాలు

  • ఒక కేజీ బాస్మతి బియ్యం
  • 2 బిర్యానీ ఆకులు
  • 4 లవంగాలు
  • 4 యాలకులు
  • ఒక అనాస పువ్వు
  • ఒక ఇంచు దాల్చిన చెక్క
  • ఒక చెంచా నెయ్యి
  • కొద్దిగా పుదీనా
  • కొద్దిగా కొత్తిమీర

తయారీ విధానం

  • ముందుగా బాస్మతి బియ్యాన్ని బాగా కడిగి సుమారు ఓ అర గంట పాటు నానబెట్టుకోవాలి.
  • ఆ తర్వాత చికెన్​ను శుభ్రంగా కడుక్కొని మ్యారినేట్​ చేసుకోవాలి. ఇందుకోసం పసుపు, ఉప్పు, కారం,1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి అరగంట పాటు పక్కకుపెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ ఆన్ చేసుకుని ఓ గిన్నెలో నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • నూనె వేడయ్యాక ఇందులో శుభ్రం చేసుకున్న గోంగూర ఆకులు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు వేసి మెత్తగా అయ్యేవరకు వేయించుకోవాలి.
  • గోంగూర మెత్తగా అయ్యాక స్టౌ ఆఫ్ చేసి మిక్సీలో వేసి రుబ్బుకోని పక్కకుపెట్టుకోవాలి.
  • మరోసారి స్టౌ ఆన్ చేసి బిర్యానికి సరిపడా గిన్నె పెట్టి అందులో నెయ్యి, నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • ఇందులో బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, దాల్చిన చెక్క వేసి వేగనివ్వాలి.
  • ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్ర రంగు వచ్చేవరకు బాగా వేయించుకోవాలి.
  • ఆ తర్వాత మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.
  • అనంతరం మ్యారినేట్​ చేసుకున్న చికెన్​ను ఇందులో వేసి బాగా కలిపి 15 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. (చికెన్​ నుంచి వచ్చే నీటితోనే ఉడికిపోతుంది.)
  • ఇప్పుడు ముందుగా రుబ్బుకున్న గోంగూర మిశ్రమాన్ని వేసి చికెన్ ముక్కలకు బాగా పట్టేలా కలపి 5 నిమిషాల పాటు ఉడికించుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మరో గిన్నెను స్టవ్​ మీద పెట్టి.. అందులోకి మంచి నీరు, బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, ఉప్పు వేసి బాగా మరిగించుకోవాలి.
  • నీరు మరిగాక అందులో కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని పోసి ఉడికించుకోవాలి. (సుమారు 70శాతం మాత్రమే ఉడికించుకోవాలి)
  • ఈ అన్నాన్ని జల్లి గరిటెతో వడకట్టి పక్కన పెట్టుకున్న గోంగూర చికెన్​పై చల్లుకోవాలి.(ఓకే దగ్గర కాకుండా గిన్నె మొత్తం సమాతరంగా చల్లుకోవాలి)
  • ఆ తర్వాత దీనిపై నెయ్యి, పుదీనా, కొత్తిమీర వేసి మూత పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పెనం పెట్టుకుని దానిపై ఈ గిన్నెను పెట్టి పావు గంట మగ్గనివ్వాలి. (5 నిమిషాలు హై ఫ్లేమ్​లో.. 10 నిమిషాలు లో ఫ్లేమ్​లో ఉడికించుకోవాలి)
  • ఇంకెముంది స్టౌ ఆఫ్ చేసుకుని దించేసుకుంటే వేడి వేడి గోంగూర బిర్యానీ రెడీ!

బీరకాయతో రొటీన్ పచ్చడి, కర్రీలు ఎందుకు? - వెరైటీగా పాలు పోసి ట్రై చేయండి - సూపర్​ అనాల్సిందే! - Beerakaya Milk Curry

పక్కా పల్లెటూరి రుచిలో - నోరూరించే "గోంగూర పచ్చడి" - ఇలా ప్రిపేర్​ చేసుకుంటే వారం నిల్వ! - Village Style Gongura Pachadi

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.