ETV Bharat / offbeat

బియ్యం పిండితో కాదు.. అటుకులతో కరకరలాడే జంతికలు! - సూపర్ స్నాక్​ - Atukula Murukulu

author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

How to Make Atukula Murukulu : పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ.. జంతికలంటే ఎంతో ఇష్టం. టీ టైమ్​లో జంతికలు తింటే ఆ ఫీల్​ వేరే. సహజంగా వీటిని బియ్యం పిండితోనే చేస్తారు. కానీ.. అటుకులతో కూడా చేస్తారని మీకు తెలుసా? ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Atukula Murukulu
How to Make Atukula Murukulu (ETV Bharat)

Atukula Murukulu Recipe : టిఫెన్​ చేయడానికి ఎక్కువ సమయం లేనప్పుడు.. అటుకులతో అద్దిరిపోయే ఉప్మా చేసుకుంటారు జనం. అంతేకాదు.. ఇడ్లీలు, దోశలు, వడలు రుచికరంగా రావడానికి కూడా అటుకులను కలుపుతుంటారు. అయితే.. అటుకులతో చాలా క్రిస్పీగా కరకరలాడే జంతికలు కూడా తయారు చేయవచ్చని మీకు తెలుసా? ఒక్కసారి ఈ స్టోరీలో చెప్పిన విధంగా మురుకులు చేశారంటే.. అద్భుతమైన రుచిని ఆస్వాదిస్తారు. ఈ జంతికలను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇక లేట్​ చేయకుండా సూపర్​ టేస్టీ స్నాక్​ ఐటమ్​ అటుకుల జంతికలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..

కావాల్సిన పదార్థాలు :

  • అటుకులు-కప్పు
  • పుట్నాల పప్పు- అరకప్పు
  • బియ్యం పిండి-కప్పు
  • జీలకర్ర-టీస్పూన్​
  • నువ్వులు-టీస్పూన్​
  • కళోంజి విత్తనాలు-టీస్పూన్​
  • ఉప్పు- రుచికి సరిపడా
  • మిరియాల పొడి-చిటికెడు
  • నూనె-వేయించడానికి సరిపడా
  • ఉప్పు లేని బటర్-టేబుల్​స్పూన్

అటుకుల మురుకులు తయారీ విధానం:

  • ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి అటుకులు, పుట్నాల పప్పు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి.
  • ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి. తర్వాత దీనిని జల్లించి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మురుకుల పిండి కలపడం కోసం.. ఒక గిన్నెలో బియ్యం పిండి తీసుకోవాలి. ఇందులో నువ్వులు, జీలకర్ర, కళోంజి విత్తనాలు, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. అలాగే బటర్​ వేసి పిండిని బాగా కలుపుకోవాలి. మీ దగ్గర బటర్ లేకపోతే నెయ్యిని వేడి చేసి ఉపయోగించవచ్చు.
  • ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ.. పిండిని చాలా సాఫ్ట్​గా మారేంత వరకు కలుపుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై గిన్నె పెట్టుకొని డీప్​ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడి అయ్యేలోపు.. మురుకులు ప్రిపేర్ చేసుకునే మెషీన్​ లోపల కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి.
  • తర్వాత రెడీ చేసుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండిముద్దను తీసుకొని మురుకుల గొట్టంలో తీసుకోవాలి.
  • వేడిగా ఉన్న నూనెలో మీకు నచ్చిన ఆకారంలో మురుకులు పిండిని వత్తుకోవాలి
  • లేకపోతే.. చిల్లుల గరిటె తీసుకొని దాని మీద మీకు కావాల్సిన షేప్​లో పిండిని వత్తుకొని ఆపై వాటిని కాగే ఆయిల్​లో వేసి ఫ్రై చేసుకోవచ్చు.
  • మురుకులను రెండు వైపులా గోల్డెన్​ కలర్​లో కాల్చుకుని ప్లేట్​లోకి తీసుకోవాలి. అంతే.. ఇలానే పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి.
  • సింపుల్​గా ఇలా చేసుకుంటే క్రిస్పీ అటుకుల మురుకులు రెడీ అయిపోతాయి. మీకు నచ్చితే ఓసారి ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

బియ్యప్పిండితో జంతికలు చేస్తే గట్టిగా వస్తున్నాయా? - ఇలా ట్రై చేస్తే కరకరలాడుతూ గుల్లగా వస్తాయి!

టేస్టీ అండ్​ స్పైసీ "ఉల్లి మిక్చర్​" - ఇంట్లోనే నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా! - రుచి​ మస్త్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.