ETV Bharat / offbeat

ఆహా అనిపించే ​"ఆఫ్ఘాని ఎగ్​ మసాలా"- సూపర్​ టేస్టీ రెసిపీ - ఇంట్లో ఈజీగా చేసేయండి! - Egg Afghani Recipe - EGG AFGHANI RECIPE

Afghani Egg Curry Recipe : గుడ్లతో ఎప్పుడూ ఒకేలా కాకుండా కాస్త కొత్తగా ట్రై చేయాలని కోరుకునేవారికి ఆఫ్ఘాని ఎగ్​ మసాలా రెసిపీ సూపర్ ఛాయిస్. చపాతీ, పులావ్, వైట్​ రైస్​ ఇలా ఎందులోకైనా ఈ కర్రీ అద్దిరిపోతుంది. తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం.

Egg Curry Recipe
Afghani Egg Curry Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 28, 2024, 2:05 PM IST

How to Make Afghani Egg Curry : ఇంట్లో ఏ కూరగాయలూ లేనప్పుడు చాలా మంది నిల్వ పచ్చడి ఏదో ఒకటి అన్నంలో వేసుకొని తింటారు. దానికి సైడ్​ డిష్​గా ఆమ్లెట్ వేసుకోవడం చేస్తుంటారు. లేదంటే.. ఆనియన్​ ఎగ్​ కర్రీ వండుకుంటారు. ఇలా కోడి గుడ్డుతో ఎన్నో రకాల రెసిపీలు చేసుకుంటుంటారు. అందులో దేనికదే ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది. అలాంటి వాటిల్లో టాప్​లో ఉండే రెసిపీ ఆఫ్ఘాని ఎగ్​ మసాలా కర్రీ. వేడివేడి అన్నంలోకి, చపాతీల్లోకి ఈ రెసిపీ ఎంతో రుచికరంగా ఉంటుంది. అంతేకాదు.. ఈ ఆఫ్ఘాని ఎగ్​ మసాలాను చాలా సులభంగా రెస్టారెంట్ స్టైల్​లో తయారు చేయొచ్చు. మరి, దాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు..

  • బాయిల్డ్ ఎగ్స్​-4
  • కొత్తిమీర కప్పు
  • ఉల్లిపాయలు-2
  • పచ్చిమిర్చి-3
  • జీడిపప్పు-10
  • వెల్లుల్లి రెబ్బలు-4
  • అల్లం -చిన్న ముక్క
  • లవంగాలు-3
  • యాలకులు-2
  • దాల్చిన చెక్క
  • పసుపు చిటికెడు
  • కారం టేబుల్​స్పూన్​
  • జీలకర్రపొడి-అరటీస్పూన్​
  • గరం మసాలా- పావుటీస్పూన్​
  • ఫ్రెష్​ క్రీమ్-టేబుల్​స్పూన్​
  • పెరుగు -2 టేబుల్​స్పూన్లు
  • కసూరి మేతి- టేబుల్​స్పూన్​

తయారీ విధానం..

  • ముందుగా స్టౌపై పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్​ వేయండి. ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించండి. ఇందులో వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క, పచ్చిమిర్చి, జీడిపప్పు వేసుకోవాలి. సన్నని మంటమీద ఉల్లిపాయలు మగ్గించి.. ప్లేట్లోకి తీసుకోవాలి.
  • ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ గిన్నెలో కొత్తిమీర వేసుకుని.. కొద్దిగా నీళ్లు యాడ్​ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు పాన్​లో ఆయిల్​ వేసి పసుపు, కారం, ఉప్పు వేసి ఎగ్స్​ వేసి వేపుకోండి. వీటిని తీసి పక్కన పెట్టుకోండి.
  • ఇదే పాన్​లో కాస్త ఆయిల్​ వేయండి. ఇందులో యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేయండి. తర్వాత ఇందులో గ్రైండ్​ చేసుకున్న ఉల్లిపాయ, కొత్తిమీర మిశ్రమం వేసుకోండి.
  • రెండు నిమిషాల తర్వాత ఇందులో పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మూత పెట్టి కొద్ది సేపు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో ఫ్రెష్​ క్రీమ్​, పెరుగు వేసి కలుపుకోవాలి.
  • కర్రీలో ఆయిల్​ పైకి తేలిన తర్వాత కసూరి మేతి, గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడే ఎగ్స్​ వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోండి.
  • స్టౌ ఆఫ్​ చేసుకునే ముందు కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. సూపర్ టేస్టీ ఆఫ్ఘాని ఎగ్​ గ్రేవీ కర్రీ రెడీ. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

కాస్త కారంగా.. కాస్త ఘాటుగా!

ఆహా 'కొల్హాపురి గుడ్డు కూర' రుచి.. తినరా మైమరచి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.