ETV Bharat / offbeat

మీ వాషింగ్​ మెషిన్​ను ఇలా క్లీన్​ చేయండి - దుర్వాసన పోవడంతోపాటు, బట్టలు చక్కగా వాష్​ అవుతాయి! - Washing Machine Cleaning Tips - WASHING MACHINE CLEANING TIPS

How to Clean Front load Washing Machine : చాలా మంది రోజూ వాషింగ్​ మెషిన్​లో బట్టలు వాష్​ చేస్తారు. కానీ, దాని శుభ్రతో విషయంలో మాత్రం కొంత నిర్లక్ష్యంగా ఉంటారు. దీనివల్ల వాషింగ్​ మెషిన్​లో మొత్తం మురికి పేరుకుపోతుంది. ఫలితంగా వాష్​ చేసిన బట్టల నుంచి బ్యాడ్​స్మెల్ వస్తుంటుంది. అయితే, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్​ని ఎలా క్లీన్ చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

Washing Machine
Washing Machine Cleaning Tips (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2024, 9:47 AM IST

Washing Machine Cleaning Tips : ప్రస్తుత కాలంలో ఇంట్లో ఎక్కువగా ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్​ పరికరాలలో వాషింగ్​ మెషిన్ ఒకటి. చాలా మంది రోజూ దాంట్లో బట్టలు వేసి వాష్ చేస్తుంటారు. కానీ మెజార్టీ జనాలు అది శుభ్రంగా ఉందా.. లేదా ? అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. దీనివల్ల వాషింగ్​ మెషిన్​ నుంచి ఒకరకమైనటువంటి బ్యాడ్​స్మెల్​ వస్తుంటుంది. అలాగే బట్టల మురికి కూడా సరిగా వదలదు. అయితే, కొన్ని టిప్స్ పాటించి వాషింగ్​ మెషిన్​ క్లీన్​ చేయడం వల్ల దుర్వాసన తొలగిపోవడంతోపాటు, ఎక్కువకాలం మన్నికగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ క్లీన్ ఎలా చేయాలో మీకు తెలుసా..? మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వైట్ వెనిగర్ :
మురికిగా ఉన్న ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ శుభ్రం చేయడానికి వైట్ వెనిగర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. క్లీన్ చేయడానికి ముందుగా వెనిగర్​ తీసుకుని డిటర్జెంట్ డిస్పెన్సర్​లో వేసుకోవాలి. ఆ తర్వాత వాషింగ్ మెషిన్​ ఆన్​ చేసి కాసేపు రన్ చేయాలి. ఇలా చేస్తే వెనిగర్ మెషిన్ లోపలి భాగాన్ని చేరుతుంది. ఫలితంగా డస్ట్​ మొత్తం బయటికి వచ్చేస్తుంది. తర్వాత బట్టలను వాష్​ చేస్తే ఎలాంటి దుర్వాసన రాకుండా ఉంటాయి.

బేకింగ్​ సోడా :
ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్​ క్లీన్ చేయడానికి బేకింగ్ సోడా మంచి సహజ క్లీనింగ్​ ఏజెంట్​గా పని చేస్తుంది. ఇది దుర్వాసనను తొలగించడంతోపాటు, బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ముందుగా డ్రమ్​లోని బట్టలను తీసేసి, డిటర్జెంట్ డిస్పెన్సర్ ఖాళీ చేయండి. ఇప్పుడు అరకప్పు బేకింగ్ సోడాను నేరుగా డ్రమ్​లో వేయండి. అలాగే కప్పు వెనిగర్​ డిటర్జెంట్ డిస్పెన్సర్​లో పోయండి. ఇప్పుడు హాట్​ వాటర్​తో డ్రమ్ క్లీన్​ ఆప్షన్​ సెలెక్ట్​ చేసుకోండి. వాషింగ్ సైకిల్ పూర్తైన తర్వాత, మెత్తని వస్త్రంతో డ్రమ్ క్లీన్​ చేసుకోండి. అంతే ఇలా చేస్తే వాషింగ్​ మెషిన్​ క్లీన్ అయిపోతుంది.

ఫిల్టర్ క్లీనింగ్ :
చాలా మంది వాషింగ్​ మెషిన్​ని లోపల, బయట శుభ్రం చేస్తారు. కానీ, ఫిల్టర్ క్లీన్​ చేయడం మాత్రం మర్చిపోతుంటారు. దీనిని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. మీ వాషింగ్ మెషిన్ మోడల్, కంపెనీ ఆధారంగా ఫిల్టర్ స్థానం మారవచ్చు. సాధారణంగా ఇది మెషిన్ ముందు భాగంలో, దిగువన ఉంటుంది. ముందుగా ఫిల్టర్​ని జాగ్రత్తగా బయటకు తీయండి. ఒక బకెట్​లో నీళ్లు తీసుకొని ఫిల్టర్​ని అందులో వేయండి. బ్రష్​తో ఫిల్టర్లో పేరుకుపోయిన మురికిని, దారాలను క్లీన్​ చేయండి. పాత వస్త్రంతో ఫిల్టర్​ని తుడవండి. తర్వాత మళ్లీ జాగ్రత్తగా ఫిల్టర్ అమర్చి, కవర్ మూసివేయండి.

  • మీరు వాషింగ్ మెషిన్​ క్లీన్​ చేయడానికి మార్కెట్లో లభించే కమర్షియల్ వాషింగ్ మెషిన్ క్లీనర్స్​ను కూడా ఉపయోగించవచ్చు.
  • వాషింగ్​ మెషిన్​ కంపెనీని బట్టి దానిని ఎంతసేపు శుభ్రం చేయాలి ? ఎంత మేరకు క్లీనింగ్​ డిటర్జెంట్స్​ ఉపయోగించాలి ? అనే వివరాలన్నీ యూజర్​ మాన్యువల్‌లో ఉంటాయి. ఒకసారి వాటిని తప్పకుండా చదవండి.
  • చివరిగా ప్రతి నెలా తప్పకుండా వాషింగ్​ మెషిన్​ క్లీన్ చేయండి. ఇలా చేస్తే మెషిన్​ నుంచి ఎలాంటి దుర్వాసనా రాదని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి :

నెలకోసారి వాషింగ్​ మెషిన్​ను ఇలా క్లీన్​ చేయండి - మురికిపోయి కొత్త దానిలా మెరుస్తుంది!

వాషింగ్ మెషిన్ క్లీనింగ్ కోసం బెస్ట్ టిప్స్ - ఫాలో అయ్యారంటే నిమిషాల్లో తళతళ మెరిసిపోవడం పక్కా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.