ETV Bharat / offbeat

ఎంత క్లీన్​ చేసినా బాత్రూమ్​ నుంచి దుర్వాసన వస్తోందా? - ఈ సహజ చిట్కాలు ఫాలో అయితే ప్రాబ్లమ్​ సాల్వ్​! - HOW TO AVOID SMELL FROM BATHROOM

-పండగ వేళ ఇంటితో పాటు బాత్రూమ్​ను మెరిపించండి -చిట్కాలతో పాటు ఈ జాగ్రత్తలు కూడా ఫాలో అవ్వాలి

BATHROOM CLEANING TIPS
How to avoid Bad Smell from Bathroom (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 29, 2024, 12:31 PM IST

How to avoid Bad Smell from Bathroom: దీపావళి సందడి మొదలైంది. ఈ పండగ వేళ ఇంటికి అతిథులు వస్తుంటారు. ఈ క్రమంలో ముందుగానే ఇంటిని క్లీన్​ చేస్తుంటారు మహిళలు. అయితే హోమ్​ క్లీన్​ చేయడం ఒక ఎత్తయితే.. బాత్​రూమ్​ క్లీనింగ్​ మరోలా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎక్కువ సేపు శ్రమించాల్సి వస్తుంది. అయితే ఒక్కోసారి టాయిలెట్స్ ఎంత క్లీన్ చేసినా బాత్రూం నుంచి చెడు వాసన వస్తూనే ఉంటుంది. ఇక మనుషులు ఎక్కువైతే ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతుంది. అలాంటప్పుడు ఈ చిన్ని చిట్కాలు ట్రై చేయమంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

సుగంధ నూనెలు ప్రయత్నించండి: బాత్రూమ్‌లు ఫ్రెష్‌గా ఉండేందుకు ఇప్పుడు మార్కెట్లో బోలెడు ఫ్రెషనర్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీటిని ఉపయోగించవచ్చు. లేదంటే ఎసెన్షియల్‌ ఆయిల్స్​ను స్ప్రే చేసినా ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఈ నూనెల్లోని యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు.. ఫంగస్‌లు, బ్యాక్టీరియాలను పోగొడతాయి. కాబట్టి లావెండర్ లేదా మింట్​​ ఎసెన్షియల్‌ ఆయిల్​లో ఓ కాటన్​ బాల్​ ముంచి దాన్ని బాత్రూమ్‌లో ఓ మూలన ఉంచండి. ఇలా చేయడం వల్ల దుర్వాసన తగ్గిపోతుంది.

వెనిగర్​: ముందుగా ఎప్పటిలానే బాత్రూమ్​ను శుభ్రం చేయాలి. ఆ తర్వాత ఒక బకెట్ నీళ్లలో సుమారు ఒక గ్లాసు వెనిగర్​ను కలిపి బాత్రూంలో పోసి సుమారు గంట సేపు నాననివ్వండి. ఆపై బాత్రూమ్​ను మళ్లీ నీటితో శుభ్రం చేస్తే వాసన రాకుండా ఉంటుంది.

పేస్ట్​: ఏదైనా మంచి సువాసన కలిగిన టూత్​పేస్ట్​కి అక్కడక్కడ పిన్నుతో హోల్స్ పెట్టి ఆ ట్యూబ్​ని మీ ఫ్లష్​లో వేయాలి. దీని వల్ల ఫ్లష్ కొట్టిన ప్రతిసారి మంచి స్మెల్ స్ప్రెడ్ అవ్వడమే కాకుండా టాయిలెట్ క్లీన్​గా ఉంటుంది.

బేకింగ్​ సోడా​: టాయిలెట్స్ ఎంత క్లీన్ చేసినా మురికి పోకుండా వాసన వస్తూ ఉంటే.. బేకింగ్ సోడాలో కాస్త డిష్​వాషర్​ లిక్విడ్​ వేసి మిక్స్ చేసి టాయిలెట్ సీట్స్​పై పోసి బాగా రబ్ చేసి వదిలేయాలి. ఒక పది నిమిషాల తర్వాత టాయిలెట్స్ క్లీన్ చేస్తే తెల్లగా మారడమే కాకుండా దుర్వాసన కూడా పోతుంది.

సిట్రిక్​ యాసిడ్​: పావు కప్పు బేకింగ్‌ సోడాలో పావు కప్పు సిట్రిక్‌ యాసిడ్‌, రెండు చెంచాల లిక్విడ్‌ డిష్‌వాషర్‌ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాత ఐస్‌ ట్రేలో వేసి ఆరనివ్వాలి. గట్టిగా అయ్యాక వీటిని స్నానాల గదిలో అక్కడక్కడా పెడితే దుర్వాసన పోతుంది.

గోడలు మురికిగా మారాయా ? - ఈ టిప్స్​ పాటిస్తూ క్లీన్​ చేసి - దీపావళికి అందంగా మార్చండి!

ఈ జాగ్రత్తలు కూడా:

  • బాత్రూమ్ ఫ్లోర్, వాష్ బేసిన్, సింక్, షవర్, బాత్‌టబ్, టాయిలెట్​ వంటివి క్రమం తప్పకుండా క్లీన్​ చేయాలి. వీటిని రెగ్యులర్​గా క్లీన్​ చేస్తే చెడు వాసనలకు కారణమయ్యే ధూళి, ధూళి తొలగిపోయి దుర్వాసన రాకుండా ఉంటుంది.
  • బాత్రూమ్ గదికి గాలీ, వెలుతురూ ధారాళంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఉపయోగించని సమయంలో కిటికీలు, తలుపులు తెరిచిపెట్టడం వల్ల అక్కడ ఉన్న తేమ తొందరగా ఆరిపోతుంది.
  • బాత్రూమ్​లో సగం తడిచిన దుస్తులు ఉంటే కచ్చితంగా దుర్వాసన వస్తుంది. అందుకనే ఈ ప్రదేశాల్లో దుస్తులు, టవల్స్​ లేకుండా ఎప్పటికప్పుడు తీసివేయండి.
  • బాత్రూమ్‌ డ్రైన్‌ వద్ద ఎలాంటి అడ్డంకులూ లేకుండా సజావుగా నీరు వెళ్లడానికి వీలుగా ఉందో లేదో ఎప్పటికప్పుడు సరి చూసుకోవాలి.
  • ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవ్వడం వల్ల బాత్రూమ్స్ నుంచి దుర్వాసన రాకుండా ఎల్లప్పుడూ ఫ్రెష్​గా ఉంటాయి.

కుక్కర్‌ నుంచి వాటర్‌ లీకై కిచెన్ మొత్తం​ పాడైపోతోందా ? - ఈ టిప్స్​ పాటిస్తే ఈజీగా చెక్​ పెట్టొచ్చు!

కుంకుడు కాయలతో జుట్టు మాత్రమే కాదు ఇవీ క్లీన్​ అవుతాయి! - ఎలా వాడాలో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.