ETV Bharat / offbeat

యమ్మీ యమ్మీగా "స్టఫ్డ్​ ఫ్రెంచ్ టోస్ట్" - నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ సూపర్! - FRENCH TOAST RECIPE

బ్రెడ్​తో నిమిషాల్లో చేసుకునే సూపర్ రెసిపీ - ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్లీ మళ్లీ కావాలనడం పక్కా!

HOW TO MAKE FRENCH TOAST
French Toast Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 21, 2024, 3:33 PM IST

French Toast Recipe in Telugu : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది టిఫెన్స్ ప్రిపేర్ చేసుకోవడానికి తగిన సమయం లేనప్పుడు బ్రెడ్​తో చేసేవి ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటుంటారు. అంటే.. ఈజీగా అయిపోతుందని బ్రెడ్ ఆమ్లెట్, ఇతర రెసిపీలు ట్రై చేస్తుంటారు. కానీ, అవి మాత్రమే కాదు బ్రెడ్​తో నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే మరో సూపర్ రెసిపీ ఉంది. అదే.. "స్టఫ్డ్ ఫ్రెంచ్ రోస్ట్". మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్ లేదా ఈవెనింగ్ స్నాక్​లో టేస్టీగా ఏదైనా తినాలనుకునేవారికి కూడా ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉండే ఈ రెసిపీని పెద్దలే కాదు పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు! మరి, ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • బంగాళదుంపలు - 3(మీడియం సైజ్​వి)
  • చిల్లీ ఫ్లేక్స్ - అరటేబుల్​స్పూన్
  • ఉప్పు - కొద్దిగా
  • చాట్ మసాలా - అరటీస్పూన్
  • వేయించిన జీలకర్ర పొడి - అరటీస్పూన్
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • మిరియాల పొడి - కొద్దిగా
  • బ్రెడ్ స్లైసులు - 6
  • గుడ్లు - 2
  • పాలు - 1 కప్పు
  • బ్రౌన్ షుగర్ - 1 టేబుల్​స్పూన్
  • బటర్ - కొద్దిగా

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా బంగాళదుంపలను ఉడికించుకోవాలి. ఆపై వాటి పొట్టు తొలగించి ఒక మిక్సింగ్ బౌల్​లో తురుముకోవాలి.
  • తర్వాత అందులో చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, చాట్ మసాలా, వేయించిన జీలకర్ర పొడి, కొత్తిమీర తరుగు, మిరియాల పొడి వేసుకొని అన్నీ కలిసేలా బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు శాండ్​విచ్ బ్రెడ్ స్లైసులను తీసుకొని వాటి చివరలన్నింటినీ కట్ చేసుకోవాలి.
  • అనంతరం ఒక్కో బ్రెడ్ స్టైస్​ని తీసుకుంటూ దాని మీద ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలూ మిక్చర్​ని ఒక టేబుల్​స్పూన్ వేసుకొని నెమ్మదిగా బ్రెడ్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అలా అన్నింటికి అప్లై చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు మరో మిక్సింగ్ బౌల్​లో ఎగ్స్​ని పగులకొట్టి వేసుకోవాలి. ఆపై అందులో చిక్కని పాలు, కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు యాడ్ చేసుకొని మిశ్రమం మొత్తం చక్కగా కలిసేలా బాగా విస్క్ చేసుకోవాలి.
  • ఆవిధంగా మిక్స్ చేసుకున్నాక బ్రౌన్ షుగర్ వేసుకొని అది కరిగేంత వరకు మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఆ తర్వాత ఆలూ మిక్చర్ అప్లై చేసుకున్న రెండు బ్రెడ్ స్లైసులను ఒకదానిపై మరొకటి పెట్టి నెమ్మదిగా అదిమితే స్టిక్ అయిపోతాయి. అనంతరం నెమ్మదిగా చాకుతో ట్రైయాంగిల్ షేప్​లో కట్ చేసుకోవాలి. కొంచం డిఫరెంట్​గా కనిపించాలంటే పొడవుగా స్ట్రిప్స్​ మాదిరిగా కట్ చేసుకోవచ్చు.
  • అనంతరం స్టౌ మీద పాన్ పెట్టుకొని కొద్దిగా బటర్ వేసుకోవాలి. అది కరిగి వేడక్కాక దాని మీద.. ఎగ్ మిక్చర్​లో రెండు వైపులా తడిసేలా ముంచి చక్కగా కోట్ చేసుకున్న కట్ చేసిన బ్రెడ్ స్లైసును ఉంచాలి.
  • ఆపై స్టౌను లో ఫ్లేమ్​ టూ మీడియం ఫ్లేమ్​కు అడ్జస్ట్ చేసుకుంటూ టోస్ట్​ను రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. అలా కాల్చుకునేటప్పుడు అంచుల వెంబడి కొద్దిగా బటర్ అప్లై చేసుకోవాలి. ఆవిధంగా అన్నింటినీ కాల్చుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "స్టఫ్డ్​ ఫ్రెంచ్ టోస్ట్" రెడీ!
  • ఇక వీటిని వేడివేడిగా టమాటా కెచప్​తో తింటుంటే కలిగే ఆ ఫీలింగ్ సూపర్​గా ఉంటుంది! మరి, ఇంకెందుకు ఆలస్యం నచ్చితే మీరూ ఓసారి ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ ఎంజాయ్ చేయండి!

ఇవీ చదవండి :

గుడ్డు లేకుండా అద్దిరిపోయే "బ్రెడ్​ ఆమ్లెట్" - ఇలా ప్రిపేర్ చేస్తే ఇంకా కావాలంటారు!

ఎగ్, ఓవెన్‌ లేకుండానే టేస్టీ "క్రెమ్​ కేరమెల్‌" - ఇలా చేస్తే నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.