ETV Bharat / offbeat

మీ ఇంట్లో ఎలక్ట్రిక్​ కెటిల్​ ఉందా ? ఎక్కువ కాలం పాటు పని చేయాలంటే ఇలా చేయాల్సిందే!! - ELECTRIC KETTLE CLEANING

-ఎలా పడితే అలా కెటిల్​ వాడితే త్వరగా పాడైపోతుంది -కెటిల్​ మన్నిక, క్లీనింగ్​ కోసం నిపుణుల సూచనలు!!

Electric Kettle
Electric Kettle Cleaning Tips (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 13, 2024, 5:02 PM IST

Electric Kettle Cleaning Tips : చాలా మంది కిచెన్​లో.. నీళ్లను వేడి చేయడం కోసం ఎలక్ట్రిక్​ కెటిల్​ వాడుతుంటారు. అలాగే కొంతమంది కోడిగుడ్లు ఉడికించుకోవడానికి, పాస్తా-నూడుల్స్‌.. వంటి వంటకాలు తయారుచేసుకోవడానికీ వివిధ రకాలుగా దీన్ని వాడుతుంటారు. అయితే నిమిషాల్లో ఇన్ని పనులకు ఉపయోగించే ఈ కెటిల్​ను సరిగ్గా వాడకపోయినా, శుభ్రత విషయంలో జాగ్రత్తలు పాటించకపోయినా త్వరగా పాడైపోతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఎలక్ట్రిక్​ కెటిల్​ లైఫ్​ ఎక్కువగా ఉండడానికి ఎలాంటి టిప్స్​ పాటించాలి ? దీన్ని ఎలా క్లీన్​ చేయాలి ? అనే విషయాలను ఈ స్టోరీలో చూద్దాం.

వాటర్ పూర్తిగా నింపకండి.. కొంతమంది హాట్ వాటర్​ అవసరమైతే.. కెటిల్లో పూర్తిగా వాటర్​ నింపుతుంటారు. ఇలా కెటిల్లో పూర్తిగా వాటర్​ ఎప్పుడూ నింపకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు వాటర్​ మరిగి అవుట్‌లెట్‌ రంధ్రాల్లోంచి బయటికి దొర్లి.. కెటిల్‌ మెషీన్‌లోకి వెళ్లే ప్రమాదం ఉంది. దీనివల్ల కెటిల్​ లైఫ్​ తగ్గిపోతుంది. కాబట్టి, మోతాదును, అక్కడి సూచనలను బట్టే అందులో నీళ్లు నింపి వేడి చేసుకోవాలి.

నీళ్లు అందులోనే ఉంచుతున్నారా?: చాలా మంది కెటిల్లో వాటర్ వేడి చేసిన తర్వాత కొన్ని నీళ్లను ఉపయోగించి.. మిగతా నీటిని అందులోనే ఉంచుతుంటారు. ఇలా చేయడం వల్ల కెటిల్‌ లోపలి భాగంలో సుద్ద కట్టులాగా తెల్లటి పొర పేరుకుపోతుంది. ఫలితంగా కెటిల్​ మన్నిక, పనితీరు క్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి, కెటిల్​ ఎక్కువ కాలం పాటు పని చేయడం కోసం.. వేడి చేశాక నీటిని గిన్నెలో లేదంటే స్టీల్‌ బాటిల్‌లో నింపుకొని దాని వాడకం పూర్తయ్యాక ఖాళీగా ఉంచుకోవడమే మంచిదంటున్నారు.

ఇలా క్లీన్ చేయండి.. ఎక్కువ మంది కెటిల్‌ని కుళాయి నీళ్ల కింద కడుగుతుంటారు. ఇలా పైపైన కడగడం వల్ల సరిగ్గా శుభ్రపడక దాన్నుంచి బ్యాడ్​స్మెల్ వచ్చే అవకాశముంది. కాబట్టి, ఈ సారి మీ ఇంట్లో కెటిల్​ని ఇలా శుభ్రం చేయండి. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు, వెనిగర్‌ సమపాళ్లలో తీసుకోండి. ఈ మిశ్రమాన్ని కెటిల్లో సగం వరకు నింపి మరిగించండి. తర్వాత స్విచాఫ్‌ చేసి అరగంట పాటు అలాగే వదిలేయాలి. ఇప్పుడు స్క్రబ్బర్‌తో రుద్ది క్లీన్​ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ మరొక విషయం గుర్తుంచుకోవాలి. అదేంటంటే.. కెటిల్‌ బయటి వైపు కుళాయి కింద కడగకుండా శుభ్రమైన తడిగుడ్డతో తుడిచేస్తే సరిపోతుంది. లేకపోతే కెటిల్‌ కింద ఉన్న మెషీన్‌ భాగంలోకి వాటర్​ చేరి తద్వారా కెటిల్​ త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంది.

చివరిగా.. ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల కెటిల్స్​ అందుబాటులో ఉన్నాయి. అయితే, కొన్ని మాత్రం కేవలం నీళ్లు వేడి చేయడానికి లేదా పాలు వేడి చేయడం కోసం మాత్రమే డిజైన్ చేస్తారు. కెటిల్​ ఎక్కువ కాలం పాటు బాగా పని చేయడానికి ప్యాకేజింగ్‌ లేబుల్‌పై ఉన్న పదార్థాల్ని తయారుచేయడానికి మాత్రమే దీన్ని ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో చిన్న పిల్లలకు అందకుండా ఎలక్ట్రిక్​ కెటిల్​ అమర్చి.. ఉపయోగించాలని సూచిస్తున్నారు.

వాటర్ బాటిల్ క్లీనింగ్ ఇబ్బందిగా ఉందా? - ఇలా చేశారంటే నిమిషాల్లో వాటిని తళతళ మెరిపించవచ్చు!

ఇల్లు క్లీన్​ చేసే పని పెట్టుకున్నారా? - "బేకింగ్​ సోడా" మంత్రం వేయండి - చిటికెలో క్లీన్ అయిపోతుంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.