ETV Bharat / offbeat

బేకరీ స్టైల్​ "దిల్​పసంద్" - ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్​ సూపర్​గా ఉంటుంది! - Dilpasand Recipe

Dilpasand Recipe: మీకు దిల్​పసంద్ అంటే చాలా ఇష్టమా? అయితే.. ఇకపై దానికోసం బేకరీకి వెళ్లాల్సిన పనిలేదు. చాలా సింపుల్​గా ఇంట్లోనో ఓవెన్ లేకుండా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్​ కూడా చాలా బాగుంటుంది! మరి.. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Bakery Style Dilpasand Recipe
Dilpasand Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Oct 1, 2024, 12:58 PM IST

How to Make Bakery Style Dilpasand : మనలో చాలా మంది బేకరీ ఐటమ్స్ ఎంతో ఇష్టంగా తింటుంటారు. అలాంటి వాటిల్లో దిల్​పసంద్ ఒకటి. ​అయితే, చాలా మంది ఇది బేకరీలోనే దొరుకుతుందనే భావనలో ఉంటారు. కానీ, మీకు తెలుసా? దిల్​పసంద్​ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పైగా టేస్ట్ కూడా బేకరిలో దొరికే వాటికి ఏమాత్రం తీసిపోదు! ఇంతకీ.. దిల్​పసంద్ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

పిండి తయారీ కోసం :

  • మైదా - రెండు కప్పులు
  • పాలు - అరకప్పు
  • చక్కెర - 2 టేబుల్​స్పూన్లు
  • నూనె - 2 టేబుల్​స్పూన్లు
  • డ్రై ఈస్ట్ - అరచెంచా
  • ఉప్పు - రుచికి తగినంత

స్టఫింగ్ కోసం :

  • కొబ్బరితురుము - కప్పు
  • టూటీఫ్రూటీ - అర కప్పు
  • పంచదార - పావు కప్పు
  • యాలకుల పొడి - పావు చెంచా
  • బటర్ - 3 టేబుల్​స్పూన్లు
  • చెర్రీ పండ్లు - చారెడు
  • జీడిపప్పులు - 12
  • బాదంపప్పులు - 5 నుంచి 6
  • పాలు - చెంచా

తయారీ విధానం :

  • ముందుగా పిండిని కలిపి పెట్టుకోవాలి. ఇందుకోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మైదా, పాలు, పంచదార, డ్రై ఈస్ట్, నూనె, రుచికి సరిపడా ఉప్పు.. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై దాన్ని రెండు గంటలపాటు పక్కన ఉంచాలి.
  • ఆలోపు రెసిపీలోకి కావాల్సిన స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం మరో మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కొబ్బరితురుము, టూటీఫ్రూటీ, పంచదార, 2 టేబుల్ స్పూన్ల బటర్, సన్నగా తరుక్కున జీడిపప్పు, బాదం పలుకులు, యాలకులపొడి.. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే.. స్టఫింగ్ రెడీ.
  • ఇప్పుడు ముందుగా కలిపిపెట్టుకున్న పిండిముద్దను తీసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత పిండిని రెండు సమాన భాగాలుగా చేసుకోవాలి.
  • అనంతరం చపాతీ పీటపై పొడి పిండి చల్లుకుంటూ ఆ పిండి ముద్దలను చపాతీ రోలర్​తో రెండు మందమైన రొట్టెలుగా వత్తుకోవాలి.
  • ఆ తర్వాత ఒక రొట్టెను ఓవెన్ సేఫ్‌ ప్లేటు మీద ఉంచి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి స్టఫింగ్​ను అంచుల దగ్గర కాస్త ప్లేస్ వదిలేసి.. మిగిలిన భాగంలో సమానంగా పరచుకోవాలి.
  • ఆవిధంగా రెడీ చేసుకున్నాక.. రెండో రొట్టెను దాని మీద ఉంచి అంచులను సీల్ చేసినట్టుగా చేతితో వత్తుతూ కలుపుకోవాలి. అనంతరం అరగంట అలా ఉంచేస్తే రొట్టె ఉబ్బి, రెట్టింపు సైజు అవుతుంది.
  • ఆ తర్వాత దాని మీద చెంచా పాలు పోసి.. మధ్యలో ఇంటూ మార్క్‌లా గాటు పెట్టుకోవాలి. ఆపై ప్రీహీట్‌ చేసి ఓవెన్‌లో 180 డిగ్రీల వద్ద అరగంట పాటు బేక్‌ చేసుకోవాలి. పైన పాలు యాడ్ చేసుకోవడం ద్వారా దిల్​పసంద్​కి మంచి కలర్ వస్తుంది.
  • ఓవెన్ లేకపోతే.. దిల్​పసంద్ పట్టే ఒక బేకింగ్ బౌల్ లేదా ప్లేట్ తీసుకొని బటర్/నెయ్యి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత పాలు పోసి మధ్యలో గాటు పెట్టుకున్న రొట్టెను ఉంచి దానిపై కూడా కాస్త బటర్ అప్లై చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై లోతుగా ఉండే ఒక మందపాటి గిన్నెలో చిన్న స్టాండ్ పెట్టుకొని 5 నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఆపై దానిపై బేకింగ్ బౌల్ ఉంచి మూతపెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి 20 నుంచి 25 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి.
  • తర్వాత ఆ బౌల్​ను బయటకు తీసి రొట్టెను మరో సైడ్​కి తిప్పుకొని దానిపై కాస్త బటర్ అప్లై చేసుకోవాలి. దీని వల్ల దిల్​పసంద్ సాఫ్ట్​గా ఉంటుంది. ఆపై మూతపెట్టి మరోసారి 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్​ మీద బేక్ చేసుకోవాలి.
  • ఆవిధంగా బేక్ చేసుకున్నాక.. దాన్ని బయటకుతీసి టేబుల్‌స్పూన్‌ బటర్​ను సిలికాన్‌ కుంచెతో అద్దినట్లు చేయాలి. పది నిమిషాల తర్వాత స్లైసులుగా కట్‌ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే బేకరీ స్టైల్ "దిల్​పసంద్" రెడీ!
  • ఇక వీటిని గోరు వెచ్చగానూ తినొచ్చు. లేదంటే.. కొంతసేపు ఫ్రిజ్‌లో ఉంచి చల్లగానూ తినొచ్చు. ఎలా తిన్నా చాలా రుచికరంగా ఉంటాయి!

ఇవీ చదవండి :

బేకరీలో దొరికే ఎగ్ పఫ్స్ ఇంట్లోనే - అది కూడా ఓవెన్​ లేకుండానే! - ఇలా ప్రిపేర్ చేసుకోండి!

యమ్మీ యమ్మీగా బేకరీ స్టైల్ "వెజ్ బర్గర్" - ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి! - టేస్ట్ అద్దిరిపోతుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.