ETV Bharat / offbeat

సింపుల్​గా ఇలా "గోబీ 65" చేయండి - పిల్లలైతే మమ్మీ ఇంకొంచం పెట్టమ్మా అని అడిగి మరీ తింటారు! - GOBI 65 RECIPE

పప్పు, సాంబార్​లోకి అద్దిరిపోయే సైడ్ డిష్ - ఇలా చేసి పెడితే ఎవరైనా లొట్టలేసుకుంటూ తినాల్సిందే!

Gobi 65 Recipe in Telugu
Gobi 65 Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 5, 2024, 8:06 PM IST

Gobi 65 Recipe in Telugu : క్యాలీఫ్లవర్ పోషకాలు పుష్కలంగా ఉండే కూరగాయల్లో ఒకటి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే దీన్ని కొందరు అంతగా తినడానికి ఇష్టపడరు. ఇక పిల్లలైతే దీని పేరు చెబితే చాలు క్యాలీఫ్లవర్​ హా.. మమ్మీ అంటూ ముఖం చిట్లిస్తుంటారు. మీ పిల్లలు క్యాలీఫ్లవర్ తినడానికి ఇష్టపడట్లేదా? అయితే, ఓసారి ఇలా "గోబీ 65" చేసి పెట్టండి. టేస్ట్ సూపర్​గా ఉండే దీన్ని తిన్నా కొద్దీ ఇంకొంచం పెట్టు మమ్మీ అని అడిగి మరీ తింటారు! ఈ రెసిపీని అన్నంలోకి సైడ్​ డిష్​గా మాత్రమే కాదు.. డైరెక్ట్​గా స్నాక్స్​గా తిన్నా చాలా రుచికరంగా ఉంటుంది. ఇంతకీ, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • క్యాలీఫ్లవర్ ముక్కలు - 1 కప్పు
  • మైదా - 3 టేబుల్​స్పూన్లు
  • కార్న్​ఫ్లోర్ - 3 టేబుల్​స్పూన్లు
  • బియ్యప్పిండి - 1 టేబుల్​స్పూన్
  • కారం - 1 టీస్పూన్
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్​స్పూన్
  • గరంమసాలా - 1 టీస్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • నూనె - డీప్ ఫ్రైకి తగినంత
  • పచ్చిమిర్చి - 3(నిలువుగా కట్ చేసుకోవాలి)
  • కరివేపాకు - కొద్దిగా

ఇంట్లో క్యాలీఫ్లవర్ ఎవరూ తినట్లేదా? - ఇలా ఫ్రై చేస్తే మొత్తం ఖాళీ చేస్తారు!

తయారీ విధానం :

  • ముందుగా క్యాలీఫ్లవర్​ని గోబీ 65కి కావాల్సిన విధంగా ఒక కప్పు వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వాటిని ఒక బౌల్​లో వేడి వాటర్​ తీసుకొని అందులో వేసి ఒక నిమిషం పాటు ఉంచి ఆపై జల్లి గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మైదా, కార్న్​ఫ్లోర్, బియ్యప్పిండి, కారం, అల్లంవెల్లుల్లి పేస్ట్, గరంమసాలా, కొత్తిమీర తరుగు వేసుకొని విస్కర్ సహాయంతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ మాదిరిగా కలుపుకోవాలి.
  • అనంతరం ఒక మిక్సింగ్ బౌల్​లో ఉడికించి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు తీసుకొని అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్​ని వేసి మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకొని పక్కనుంచాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి ముందుగా కలిపి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి.
  • ఆపై మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ రెండు వైపులా ఎర్రగా మారేంత వరకు వేయించుకోవాలి. అందుకోసం 5 నిమిషాల సమయం పట్టొచ్చు.
  • ఆవిధంగా వేయించుకున్నాక పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసుకొని కాసేపు వేయించుకొని ప్లేట్​లోకి తీసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "గోబీ 65" రెడీ!
  • మరి, నచ్చిందా.. అయితే, మీరూ ఓసారి క్యాలీఫ్లవర్ 65 ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు!

క్రిస్పీ క్రిస్పీగా కాలీఫ్లవర్​ పకోడి - ఇలా చేశారంటే వావ్​ అనాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.