ETV Bharat / international

'శాంతి ప్రయత్నాలకు ఎదురుదెబ్బ'- మోదీ, పుతిన్‌ హగ్​పై జెలెన్‌స్కీ తీవ్ర స్పందన - PM Modi Russia Visit

Zelensky On Modi Russia Visit : ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్​స్కీ అసంతృప్తి వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్​తో ప్రధాని మోదీ భేటీ అవ్వడం శాంతి ప్రయత్నాలకు గట్టి దెబ్బే అని అన్నారు.

Zelensky On Modi Russia Visit
Zelensky On Modi Russia Visit (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 9, 2024, 4:07 PM IST

Zelensky On Modi Russia Visit : ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా స్పందించారు. పుతిన్‌తో మోదీ భేటీ తమను తీవ్రంగా నిరాశపరిచిందని అన్నారు. ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల విదేశీ పర్యటనలో ఉన్నారు. అందులో భాగంగానే సోమవారం రష్యాకు వెళ్లారు. అక్కడ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, మోదీకి ప్రత్యేకంగా ఆతిథ్యమిచ్చారు. ఇరు దేశాధినేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీ తీవ్రంగా స్పందించారు.

'శాంతి ప్రయత్నాలకు ఎదురుదెబ్బ'
'ఉక్రెయిన్‌పై సోమవారం రష్యా జరిపిన క్షిపణి దాడిలో ముగ్గురు చిన్నారులతో సహా 37 మంది ప్రాణాలు కోల్పోయారు. 171 మంది గాయపడ్డారు. ఆ వెంటనే చిన్నారుల ఆస్పత్రిపై రష్యా మరో క్షిపణి దాడి చేసింది. ఎంతోమంది శిథిలా కింద చనిపోయారు. అలాంటి రోజే ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశ నేత ప్రపంచంలోనే అత్యంత కిరాతక నేరస్థుడితో మాస్కోలో ఆలింగనం చేసుకున్నారు. ఇది తీవ్ర నిరాశను కలిగించింది. శాంతి ప్రయత్నాలకు ఇది గట్టి ఎదురుదెబ్బ లాంటిదే' అని ఎక్స్​ వేదికగా జెలెన్​స్కీ పేర్కొన్నారు.

రష్యా క్షిపణి దాడిలో గాయపడ్డ చిన్నారుల ఫోటోలను, ధ్వంసమైన భవనాల ఫోటోలను ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. 'రష్యాలో మోదీ పర్యటన సమయంలోనే ఉక్రెయిన్‌పై మాస్కో క్షిపణుల వర్షం కురిపించింది. ఐదు నగరాలను లక్ష్యంగా చేసుకుని భీకర దాడులు చేసింది. మొత్తం 40 క్షిపణులను ప్రయోగించింది. ఇందులో అనేక అపార్ట్‌మెంట్లు, ప్రభుత్వ భవనాలు, ఆసుపత్రులు కూలిపోయాయి' అని జెలెన్‌స్కీ తెలిపారు.

పుతిన్​తో యుద్ధం అంశం ప్రస్తావన
అయితే రష్యా అధ్యక్షుడితో భేటీ సందర్భంగా ఉక్రెయిన్‌తో యుద్ధం అంశాన్ని మోదీ ప్రస్తావించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని భారత్‌ ఎల్లప్పుడూ గౌరవిస్తుందని, యుద్ధభూమిలో దేనికీ పరిష్కారాలు లభించవని మోదీ చెప్పినట్లు పేర్కొన్నాయి. చర్చలు, దౌత్యమే ముందుకెళ్లే మార్గాలని పుతిన్‌కు మోదీ సూచించినట్లు తెలుస్తోంది.

'మూడోసారి ప్రమాణం చేశా- మూడు రెట్ల వేగంతో పనిచేస్తా'- రష్యాలో ప్రవాస భారతీయులతో మోదీ - Pm Modi Russia Visit

'భారత్‌ మాకు వ్యూహాత్మక భాగస్వామి'- మోదీ రష్యా పర్యటనపై అమెరికా స్పందన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.