UK Graduate Route Visa : బ్రిటన్‌లో మాస్టర్స్ డిగ్రీ కోసం వచ్చే దరఖాస్తులు తగ్గిపోవడం వల్ల ఆ దేశ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్‌గా ప్రసిద్ధి చెందిన యూకే గ్రాడ్యూయేట్ రూట్ పథకాన్ని కొనసాగిస్తున్నట్లు బ్రిటన్ ప్రకటించింది. ప్రస్తుతం దానిని కొనసాగిస్తూ, పరిశీలనలో పెట్టామని చెప్పింది. ఈ నిర్ణయం ఎన్నికల వరకు కొనసాగుతుందని, ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం దీనిని నిర్ణయిస్తుందని తెలిపింది. అయితే, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భారతీయులు సహా ఇతర దేశాల విద్యార్థుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తగ్గిన మాస్టర్స్ డిగ్రీ దరఖాస్తులు
గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం భారత్ నుంచి మాస్టర్స్ డిగ్రీ దరఖాస్తులు 21,800 మేరకు తగ్గిపోయినట్లు బ్రిటన్ జాతీయ గణాంకాల కార్యాలయం (ఓఎన్‌ఎస్) గురువారం తెలిపింది. నికర వలసల్లో సుమారు 10శాతం తగ్గిపోయినట్లు చెప్పింది. ఇది విదేశీ విద్యార్థులు చెల్లించే ఫీజులపై ఆధారపడిన బ్రిటిష్ విశ్వవిద్యాలయాలకు అవరోధం ఏర్పడింది. బ్రిటన్‌లో విద్యాభ్యాసం కోసం వచ్చే భారతీయ విద్యార్థుల్లో 81 శాతం మంది మాస్టర్స్ డిగ్రీ చదవడానికే వస్తారు. ఈ ఏడాది నుంచి వారు తమ భార్యాపిల్లలను కానీ, తల్లిదండ్రులను కానీ తమ వెంట బ్రిటన్‌కు తీసుకురాకూడదనే నిబంధన ప్రవేశపెట్టారు. దీంతో భారతీయ మాస్టర్స్ దరఖాస్తుదారుల సంఖ్య తగ్గిపోయింది. మాస్టర్స్ పూర్తిచేసిన తరువాత బ్రిటన్‌లో పనిచేస్తూ అనుభవం గడించే అవకాశం ఉండడం ఇంతవరకు భారతీయ విద్యార్థులకు ఆకర్షణీయంగా ఉండేది. నైపుణ్య సిబ్బంది వీసా గ్రాంట్లు భారతీయులకే ఎక్కువగా లభిస్తున్నాయి. 2023 డిసెంబరుతో ముగిసిన సంవత్సరంలో బ్రిటన్‌కు దీర్ఘకాల వలస కోసం వచ్చిన విదేశీయుల్లో భారతీయులే (2,50,000) అత్యధికంగా ఉన్నారు. తదుపరి స్థానాలను నైజీరియన్లు (1,41,000), చైనీయులు (90,000), పాకిస్థానీలు (84,000) దక్కించుకున్నారు. 2023లో 12.2 లక్షల మంది బ్రిటన్‌కు వచ్చారని, వారిలో 5,32,000 మంది నిష్క్రమించారని ఓఎన్‌ఎస్ చెప్పింది.
త్వరలోనే పార్లమెంట్ రద్దు- జులై 4న ఎన్నికలు
అంతకుముందు బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల తేదీపై వస్తున్న ఊహాగానాలకు ప్రధానమంత్రి రిషి సునాక్ తెరదించారు. జులై 4న వాటిని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. తదనుగుణంగా త్వరలోనే పార్లమెంటును రద్దు చేయనున్నట్లు సునాక్ తెలిపారు.
చైనా కవ్వింపు చర్యలు - తైవాన్ చుట్టూ డ్రాగన్ సైనిక విన్యాసాలు - China Military Drills