ETV Bharat / international

'2ఏళ్లలోపు చిన్నారులను ఫోన్​కు దూరంగా ఉంచాల్సిందే- ఆరేళ్లు దాటితే రోజుకు 2గంటలు మాత్రమే!' - No Cell Phone Policy For Children - NO CELL PHONE POLICY FOR CHILDREN

No Cell Phone Policy For Children Sweden : చిన్నారులను టీవీలకు, ఫోన్లకు దూరంగా ఉంచాలని స్వీడన్ ప్రభుత్వం తల్లిదండ్రులకు సూచనలు జారీ చేసింది. అతిగా టీవీలు, ఫోన్లు చూడడం వల్ల వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతోందని పేర్కొంది. రెండేళ్లలోపు చిన్నారులను టీవీలు, ఫోన్లకు పూర్తిగా దూరంగా ఉంచాలని తాజా మార్గదర్శకాల్లో వెల్లడించింది.

mobile usage
mobile usage (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 3, 2024, 9:12 AM IST

No Cell Phone Policy For Children Sweden : టీవీలు, మొబైల్‌ ఫోన్లకు చిన్నారులను దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు స్వీడన్‌ ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. చిన్నారులు టీవీలు, డిజిటల్‌ మీడియా ముందు గంటల కొద్దీ గడుపుతుండటం వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని పేర్కొంది. చిన్నారుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రెండేళ్లలోపు చిన్నారులను టీవీలు, ఫోన్లకు పూర్తిగా దూరంగా ఉంచాలని తాజా మార్గదర్శకాల్లో వెల్లడించింది.

ఆరేళ్ల నుంచి 12 ఏళ్లలోపు పిల్లలు రెండు గంటలు టీవీలు, ఫోన్లు చూసేందుకు అనుమతినిచ్చింది. 13 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వారు రోజులో రెండు, మూడు గంటలే టీవీలు, స్క్రీన్లు చూసేందుకు పరిమితం చేయాలని తల్లిదండ్రులను కోరింది. స్వీడన్‌లోని 13 నుంచి 16 ఏళ్ల మధ్య వయస్సున్న పిల్లలు పాఠశాల సమయం తర్వాత సగటున రోజుకు ఆరున్నర గంటలు ఫోన్లు, టీవీల ముందు గడుపుతున్నారని పేర్కొంది. శారీరక శ్రమ, నిద్ర కోసం వారు ఎక్కువగా సమయం కేటాయించడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లలు నిద్రకు ఉపక్రమించే ముందు ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు సూచించింది.

పిల్లలు ఓవర్​గా ఫోన్​ చూడకుండా చేయండిలా!
భారతదేశంలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. పిల్లలు స్మార్ట్‌ఫోన్‌​లో ఏం చూస్తున్నారో, ఏం బ్రౌజ్​ చేస్తున్నారో చూసే సమయం కూడా ఉండట్లేదు నేటి తరం తల్లిదండ్రులకు. కానీ ఫోన్​ వినియోగం విషయంలో పిల్లలు చేస్తున్న పొరపాట్లు, తప్పులపై నిరంతరం నిఘా ఉంచాల్సిన అవసరం ప్రతి తల్లి, తండ్రిపై ఎంతైనా ఉంది. ఎప్పుడూ వారి వెనకాలే ఉండి ప్రతిదీ గమనించలేం గనుక వారి చేతికి మొబైల్​ ఫోన్​ ఇచ్చేముందు వాటిల్లో కొన్ని సెట్టింగ్​లను మార్చి ఇస్తే సరిపోతుంది. పిల్లలు చెడు కంటెంట్​ చూడకుండా నియంత్రించే పని మన చేతుల్లోనే ఉంది. అదేలాగో ఇప్పుడు చూద్దాం.

IOSలో సెట్టింగ్స్​ కోసం

  • ముందుగా మీ పిల్లల ఐఫోన్​ లేదా ఐప్యాడ్​లో సెట్టింగ్స్​ను ఓపెన్​ చేయండి. తర్వాత లిస్ట్​లో టాప్​లో ఉండే 'స్క్రీన్​ టైమ్​'పై క్లిక్​ చేయండి.
  • 'ఆన్​ స్క్రీన్​ టైమ్​' ఆప్షన్​పై క్లిక్ చేయండి. అనంతరం స్క్రీన్ టైమ్​కు పాస్​వర్డ్​ను సెట్​ చేసుకోండి.
  • ఈ స్క్రీన్​ టైమ్​ను సెట్​ చేయడం ద్వారా మీ పిల్లలు ఎన్ని నిమిషాలు లేదా ఎన్ని గంటలు ఫోన్​ను చూడాలనే దాన్ని మీరే వారికి తెలియకుండా ఆదేశించినట్లౌతుంది.
  • యాప్​ రెస్ట్రిక్షన్స్​ (యాప్​ పరిమితులు), కంటెంట్​, ప్రైవసీ, డౌన్​టైమ్​ షెడ్యూల్ వంటి వివిధ రకాల పరిమితులను కూడా పిల్లల ఫోన్లో సెట్​ చేయవచ్చు. వీటి ద్వారా మీ పిల్లలు ఏయే యాప్స్​ను ఓపెన్​ చేయలి? ఏవి ఓపెన్​ చేయకూడదు అనే వాటిని కూడా మీరే నిర్దేశిస్తారు. దీంతో మీ పిల్లలు అసభ్యకరమైన వెబ్​సైట్​ల జోలికి పోకుండా నియంత్రించగలిగిన వారవుతారు.
  • మీ పిల్లలు ఏం చూస్తున్నారు అనే విషయాన్ని వారికి తెలియకుండా తెలుసుకోవాలనుకుంటే 'ఫ్యామిలీ షేరింగ్' అనే ఫీచర్‌ను ఎనెబుల్​ చేసుకోవాలి. దీంతో మీ ఫోన్​ నుంచే ఓ రిమోట్​లా మీ పిల్లలు చూసే వెబ్ కంటెంట్​ను, స్క్రీన్​ టైమ్ వంటి వివరాలను​ పర్యవేక్షించొచ్చు.

ఆండ్రాయిడ్​ మొబైల్​ సెట్టింగ్స్​ కోసం

  • ముందుగా మీ పిల్లల ఆండ్రాయిడ్​ ఫోన్​​లో సెట్టింగ్స్​ను ఓపెన్​ చేయండి.
  • కొన్ని ఆండ్రాయిడ్ వెర్షన్స్​ను బట్టి ఈ సెట్టింగ్స్​ ఉంటాయి. కొన్నింటంలో 'డిజిటల్​ వెల్​ బీయింగ్​' లేదా 'పేరెంటల్​ కంట్రోల్స్​' వంటి ఆప్షన్స్​ను ఉంటాయి వాటిని ఎంచుకోవచ్చు.
  • 'డిజిటల్​ వెల్​ బీయింగ్​' లేదా 'పేరెంటల్​ కంట్రోల్స్​' ఆప్షన్​లపై క్లిక్​ చేయండి. అనంతరం తదుపరి వచ్చే సూచనలను పాటించండి.
  • ఈ సెట్టింగ్స్​ చేసిన తర్వాత యాప్​ పరిమితులు, కంటెంట్​ ఫిల్టర్లు, స్క్రీన్​ టైమ్​ షెడ్యూళ్లు వంటి వివిధ రకాల పరిమితులను సెట్​ చేయవచ్చు. వీటి ద్వారా పిల్లలు ఎటువంటి వెబ్​ కంటెంట్​ లేదా ఏ రకమైన వెబ్​సైట్స్​ చూడాలి అనే ఆదేశాలను మనమే ఇవ్వగలుగుతాము. ఐఓఎస్​ ఫోన్ల లాగానే ఆండ్రాయిడ్​ మొబైల్లో కూడా స్క్రీన్​ టైమ్​, కంటెంట్​ యాక్సెస్​ వంటి విషయాలను పర్యవేక్షించొచ్చు.

కంటెంట్​ ఫిల్టర్స్​ను సెట్​ చేయండి!
చెడు వెబ్​సైట్లు, అడల్ట్​ కంటెంట్​ ఉన్న వెబ్​ పోర్టల్​లు లేదా పలు రకాల పిల్లల ఏకాగ్రతను దెబ్బతీసే యాప్స్​ను ఈ కంటెంట్​ ఫిల్టర్స్​ ఆప్షన్​ ద్వారా నియంత్రించొచ్చు. వీటి వాడకాన్ని పరిమితం చేసేందుకు కూడా 'పేరెంటల్​ కంట్రోల్స్​' సహాయపడతాయి. మీ పిల్లల వయసుకు తగ్గట్టు కంటెంట్​ను మాత్రమే యాక్సెస్​ చేసి చూసేలా కూడా ఇందులో సెట్టింగ్స్​ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కంటెంట్ రేటింగ్‌ల ఆధారంగా యాప్ నియంత్రణలను కూడా సెటప్ చేయవచ్చు. తద్వారా మీ పిల్లలు వారి వయస్సుకి తగిన యాప్‌లను మాత్రమే డౌన్‌లోడ్ చేసి ఉపయోగించగలరు.

మరో విషయం ఏంటంటే మీ పిల్లలు ఎక్కువ సేపు ఫోన్లలో గడపకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. ఎందుకంటే అధిక సమయం అదే పనిగా మొబైల్​ స్క్రీన్​ను చూస్తే కంటి చూపు మందగించడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.