Telegram CEO Pavel Durov Arrested : టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్‌ను(39) పారిస్‌లో పోలీసులు అరెస్టు చేశారు. అజర్‌బైజాన్ నుంచి లే బోర్గట్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు. టెలిగ్రామ్‌లో మోసం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, పిల్లలపై నేరాలు, పెడోఫిలిక్ కంటెంట్, వ్యవస్థీకృత నేరాల్ని ప్రోత్సహించడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. దీంతో గతంలో అరెస్టు వారెంట్ జారీ చేసిన అధికారులు, తాజాగా అదుపులోకి తీసుకున్నారు.
అయితే, తనపై అరెస్ట్ వారెంట్ జారీ అయినప్పటి నుంచి దురోవ ప్రాన్స్, యూరప్‌లోని దేశాల్లో పర్యటించలేదు. తాజాగా లే బోర్గట్ వచ్చిన పావెల్ దురోవ్‌ను అరెస్ట్ చేసినట్లు మాస్కో టైమ్స్ పేర్కొంది.
టెలిగ్రామ్ యాప్ వ్యవస్థాపకుడు దురోవ్ రష్యాలో జన్మించారు. ప్రస్తుతం అయన దుబాయ్‌లో ఉంటున్నారు. VKontakte యాప్‌నకు సంబంధించి వినియోగదారుల డేటాను రష్యాలో భద్రతా అధికారులతో పంచుకోవడానికి నిరాకరించారు. దీంతో అక్కడి ప్రభుత్వంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత టెలిగ్రామ్నూ అడ్డుకునేందుకు రష్యా ప్రభుత్వం విఫలయత్నం చేసింది. దీంతో దురోవ్ 2014లో రష్యాను విడిచిపెట్టారు. 2021 ఆగస్టులో ఫ్రెంచ్ పౌరసత్వ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తనపై అరెస్టు వారెంట్ ఉన్నప్పటికీ, పావెల్ దురోవ్ పారిస్‌కు రావడంపై విచారణ అధికారి ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పావెల్‌ను ఆదివారం న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇక టెలిగ్రామ్ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా సుమారు 900 మిలియన్ల మంది వినియోగిస్తున్నారు.
పెళ్లి కాలేదు- కానీ టెలిగ్రామ్ CEOకి 100మంది పిల్లలు- అది కూడా 12 దేశాల్లో! - Telegram CEO Kids