ETV Bharat / international

స్విస్‌ బ్యాంకుల్లో తగ్గుతున్న భారతీయుల డబ్బులు- రూ.9వేల కోట్లు మాత్రమే! - Indians Funds In Swiss Banks

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 20, 2024, 5:55 PM IST

Swiss Banks Indians Funds : స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల నిధులు తగ్గుతున్నాయి. 2023లో 70 శాతం క్షీణించి నాలుగేళ్ల కనిష్ఠానికి చేరినట్లు స్విస్‌ బ్యాంక్‌ వెల్లడించింది. 2022 చివరి నాటికి 46వ స్థానంలో ఉన్న భారత్‌, ఇప్పుడు 67వ స్థానంలో నిలిచింది. అయితే ఈ నిధులన్నీ బ్లాక్‌ మనీగా చెప్పలేమని స్విస్‌ అధికారులు వెల్లడించారు.

Swiss Banks Indians Funds
Swiss Banks Indians Funds (Getty Images)

Swiss Banks Indians Funds : స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 2023లో 70 శాతం క్షీణించి నాలుగేళ్ల కనిష్ఠానికి చేరినట్లు స్విట్జర్లాండ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ వార్షిక డేటా వెల్లడించింది. 2023లో స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల నిధులు 1.04 బిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్‌లకు అంటే, భారత కరెన్సీలో రూ.9,771 కోట్లకు పడిపోయాయని గణాంకాలు వెల్లడించాయి. 2021లో స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల నిల్వలు 14 ఏళ్ల గరిష్ఠానికి 3.83 బిలియన్లకు చేరాయి. అయితే ఆ తర్వాత స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల నిల్వల క్షీణత మొదలైనట్లు స్విట్జర్లాండ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ వార్షిక డేటా వెల్లడించింది.

బాండ్లు, సెక్యూరిటీలు ఇలా భారతీయుల నిల్వలు భారీగా పడిపోయాయని డేటా వెల్లడించింది. కస్టమర్ డిపాజిట్ ఖాతాల్లోని మొత్తం నిధులు కూడా గణనీయంగా తగ్గాయని వివరించింది. 2023 చివరినాటికి స్విట్జర్లాండ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ పరిధిలోని బ్యాంకుల్లో భారతీయుల ఖాతాదారులకు చెల్లించాల్సిన మొత్తాలు 1,039.8 మిలియన్ల స్విస్‌ ఫ్రాంక్‌లుగా ఉన్నాయని, ఇందులో కస్టమర్ల డిపాజిట్లలో 310 మిలియన్ల స్విస్‌ ఫ్రాంక్​లు అని వార్షిక డేటా వెల్లడించింది.

స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల డేటా, వ్యక్తులు, వివిధ బ్యాంకుల్లో నిల్వలు, సంస్థల డిపాజిట్లు సహా స్విస్ బ్యాంకుల్లోని భారతీయ ఖాతాదారుల అన్ని రకాల నిధులను పరిగణనలోకి తీసుకుని ఈ గణాంకాలను వెల్లడించారు. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 2023లో దాదాపు 25 శాతం పడిపోయి రూ.63 కోట్లకు చేరాయి. ఈ డిపాజిట్లు 2022లో 18 శాతం పెరగగా, 2021లో 8 శాతానికిపైగా పడిపోయాయి. 2007 చివరి నాటికి స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్ల విలువ రూ. 9,000 కోట్లతో గరిష్ఠ స్థాయికి చేరింది.

బ్లాక్‌ మనీ అని చెప్పలేం!
స్విట్జర్లాండ్‌లోని భారతీయుల ఆస్తులను 'బ్లాక్‌ మనీ'గా నిర్వచించలేమని స్విస్‌ అధికారులు తెలిపారు. ట్యాక్స్‌ మోసం, పన్ను ఎగవేతకు వ్యతిరేకంగా భారత్‌ చేస్తున్న పోరాటానికి తాము కూడా మద్దతు చెప్పారు. స్విట్జర్లాండ్- భారత్‌ మధ్య పన్ను విషయాల్లో సమాచార మార్పిడి ఒప్పందం 2018 నుంచి అమలులో ఉంది. భారత్‌ ప్రాథమిక సాక్ష్యాధారాలను సమర్పిస్తే ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు అనుమానిస్తున్న భారతీయుల ఖాతాల వివరాలను స్విట్జర్లాండ్‌ అందజేస్తోంది. ఇప్పటి వరకు వందలాది కేసుల్లో భారత్‌- స్విట్జర్లాండ్‌ మధ్య ఇలా సమాచార మార్పిడి జరిగింది.

స్విస్‌ బ్యాంకుల్లో విదేశీ ఖాతాదారుల నిధుల నిల్వల్లో బ్రిటన్‌ 254 బిలియన్ల స్విస్‌ ఫ్రాంక్‌లతో అగ్రస్థానంలో ఉంది. తర్వాత స్థానంలో 71 బిలియన్ల స్విస్‌ ఫ్రాంక్‌లతో అమెరికా రెండో స్థానంలో ఉంది. 67 బిలియన్ల స్విస్‌ ఫ్రాంక్‌లతో ఫ్రాన్స్ మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో వెస్టిండీస్, జర్మనీ, హాంకాంగ్, సింగపూర్, లక్సెంబర్గ్, గ్వెర్న్సీ టాప్ 10లో ఉన్నాయి. 2022 చివరి నాటికి 46వ స్థానంలో ఉన్న భారత్‌, ఇప్పుడు 67వ స్థానంలో నిలిచింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.