ETV Bharat / international

గ్రామస్థులపై సాయుధులు కాల్పులు - 52మంది మృతి, 64మందికి గాయాలు - సౌత్​ సుడాలో కాల్పులు

South Sudan Abyei Attack : సుడాన్​లోని అబెయిలో కాల్పులు కలకలం రేపాయి. ఓ సాయుధ బృందం గ్రామస్థులపై విచక్షణా రహితంగా దాడి చేసింది. ఈ ఘటనలో 50 మంది మృతి చెందగా, 64 మంది గాయపడ్డారు.

South Sudan Abyei Attack
South Sudan Abyei Attack
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2024, 7:08 AM IST

Updated : Jan 29, 2024, 9:37 AM IST

South Sudan Abyei Attack :​​ సుడాన్​, దక్షిణ​ సుడాన్​ మధ్య వివాదాస్పదమైన అబై ప్రాంతంలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ సాయుధ గుంపు గ్రామస్థులపై విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 52 మంది మృతి చెందారు. 64 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఐక్యరాజ్యసమితి పరిరక్షణ దళానికి చెందిన వారు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటన శనివారం సాయంత్రం జరిగిందని వెల్లడించారు. అయితే ఈ ఘటనకు దారితీసిన కారణాలు తెలియనప్పటికీ, ఓ భూవివాదం కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

తరుచూ ఈ ప్రాంతంలో స్థానిక తెగల మధ్య వివాదాలు జరుగుతాయని అబై సమాచార మంత్రి బులిస్ కోచ్ తెలిపారు. అయితే తాజాగా శనివారం దాడి చేసినవారు న్యూర్​ తెగకు చెందిన వారు అని పేర్కొన్నారు. ఈ తెగ వారు గతేడాది తమ ప్రాంతంలో వచ్చిన వరదలు కారణంగా వార్రాప్​ రాష్టానికి వలస వచ్చారని చెప్పారు. మరోవైపు, ఈ ఘటనను ఐరాస సంస్థ UNIFSA ఖండించింది. గతంలో అగోక్​లోని తమ స్థావరంపై సాయుధ బృందం దాడి చేశాయని పేర్కొంది.

క్రిస్మస్ పార్టీలో కాల్పులు
కొన్నాళ్ల క్రితం ఇలాంటి ఘటనే మెక్సికోలో జరిగింది. గ్వానాజువాటో రాష్ట్రంలోని సాల్వాటియెర్రా పట్టణంలో జరిగిన క్రిస్మస్​ పార్టీలో ఓ సాయుధుడు బీభత్సం సృష్టించాడు. పార్టీల్లో పాల్గొన్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 'పొసాడా' అనే పార్టీ అనంతరం హాల్​ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. దీంతోపాటు అదే రాష్ట్రంలోని సలామాంకా నగరంలో జరిగిన కాల్పుల్లో మరో నలుగురు మరణించారని వెల్లడించారు. అయితే ఆ కాల్పులకు దారితీసిన పరిస్థితులను తెలపలేదు. పూర్తి వార్తను చదివేందుకు ఈ లింక్​ పై క్లిక్ చేయండి.

యూనివర్సిటిలో కాల్పులు
ఇటీవలే చెక్‌ రిపబ్లిక్‌ రాజధాని ప్రాగ్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. జన్ పలాచ్ స్క్వేర్​లోని చార్లెస్‌ విశ్వవిద్యాలయంలో ఓ సాయుధుడు బీభత్సం సృష్టించారు. ఫిలాసఫీ విభాగం భవనంలో విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. కాల్పుల్లో 15మంది మరణించగా, మరో 20మందికి గాయాలయ్యాయి. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దుండగుడిని ముట్టబెట్టారు. బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించారు. దుండగుడు అదే విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థిగా అధికారులు గుర్తించారు. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

ఆయిల్​ దొంగలించేందుకు కాల్పులు- ఐదుగురు సెక్యూరిటీ మృతి

US Shooting Today : అమెరికాలో కాల్పుల కలకలం.. 18 మందిని చంపి 'నరహంతకుడు' పరార్​

Last Updated : Jan 29, 2024, 9:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.