Food Poisoning After Eating Sea Turtle : సముద్ర తాబేలు మాంసం తిని 9మంది మృతి చెందగా, మరో 78 మంది ఆస్పత్రి పాలయ్యారు. మరణించిన వారిలో 8 మంది పిల్లలు ఉన్నారు. ఈ ఘటన తూర్పు ఆఫ్రికా దేశం టాంజానియాలోని స్వతంత్ర ప్రాంతమైన జాంజిబార్‌లో జరిగింది.
ఇదీ జరిగింది
జాంజిబార్ పెంబా ద్వీపంలో కొంతమంది మంగళవారం సముద్ర తాబేలు మాంసాన్ని తిన్నారు. ఆ తర్వాత అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. అయితే వారిలో 9 మంది మరణించినట్లు అధికారులు శనివారం వెల్లడించారు. ఇంకా 78 మంది చికిత్స పొందుతున్నారని చెప్పారు. సుమద్ర తాబేలను తినడం వల్లే వారు మృతి చెందినట్లు పరీక్షల్లో తేలిందని పేర్కొన్నారు. పెంబా ప్రాంతంలోని ప్రజలు తాబేలు మాంసాన్ని తినకూడదని అధికారులు కోరారు. నవంబర్ 2021లోనూ ఇలాగే తాబేలు మాంసాన్ని తిని మూడేళ్ల చిన్నారితో సహా ఏడుగురు మరణించారు. మరో ముగ్గురు ఆస్పత్రి పాలయ్యారు. రుచికరమైనవిగా భావించి సముద్ర తాబేళ్లను తింటుంటారు ఇక్కడి ప్రజలు. అయితే వీటిని తినడం ద్వారా చెలోనిటాక్సిమ్ అనే ఫుడ్ పాయిజన్ వల్ల క్రమంగా అరోగ్యం క్షీణించి చనిపోతున్నా భుజిండం ఆపరు.
వ్యాన్, కంటైనర్ ఢీ- 9మంది మృతి
America Car Crash Today : ఇటీవల అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9మంది మరణించారు. ఈ ఘటన పశ్చిమ విస్కాన్సిన్ జాతీయ రహదారి కూడలిలో శుక్రవారం జరిగింది. కూడలిలోకి ప్రవేశించిన వ్యాన్, ముందున్న కంటైనర్‌ను ఢీ కొట్టడం వల్ల 9మంది మృతిచెందారు. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు, ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు గవర్నర్ టోనీ ఎవర్స్. మరోవైపు అమెరికా- మెక్సికో సరిహద్దులో ఓ సైనిక హెలికాప్టర్ కూలి ముగ్గురు మరణించారు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం టెక్సాస్ సమీపంలోని రియె గ్రాండ్ వ్యాలీలో జరిగింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ఓ మహిళ సహా నలుగురు ఉన్నట్లు అధికారులు చెప్పారు.
కెనడా మీడియాలో నిజ్జర్ హత్య దృశ్యాలు వైరల్- 9నెలల తర్వాత వెలుగులోకి!
గాల్లో ఊడిన విమానం టైరు- గగనతలంలో ప్రయాణికులు టెన్షన్ టెన్షన్- ఆఖరికి!