Modi Ukraine Visit : ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, కీవ్‌లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. బాపూజీ ఆశయాలు విశ్వవ్యాప్తమన్న ఆయన, కోట్లాది మందికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. మానవాళికి మహాత్ముడు చూపించిన బాటలో నడుద్దామని పిలుపునిచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో గాంధీకి నివాళులు అర్పిస్తున్న ఫొటోను ట్వీట్ చేశారు.
Paid tributes to Mahatma Gandhi at Kyiv. The ideals of Bapu are universal and give hope to millions. May we all follow the path he showed to humanity. pic.twitter.com/vdqiUQcjJV
— Narendra Modi (@narendramodi) August 23, 2024
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరినట్లు అధికారులు వెల్లడించారు. వ్యవసాయం, వైద్యం, సంస్కృతి, మానవతా సాయం అంశాలపై పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మోదీ ఉక్రెయిన్ పర్యటన ఓ మైలురాయిగా నిలుస్తుందన్న విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చెప్పారు.
ద్వైపాక్షిక సంబంధాలతో పాటు వాణిజ్యం, ఆర్థిక అంశాలు, రక్షణ, ఔషధ, వ్యవసాయం, విద్య రంగాల్లో సహకారంపై మోదీ, జెలెన్‌స్కీ చర్చించినట్లు పేర్కొన్నారు జైశంకర్. ఉక్రెయిన్‌లో యుద్ధానికి సంబంధించి కూడా ఇరు దేశాధినేతల మధ్య చర్చలు జరిగినట్లు వెల్లడించారు. శాంతిని పునరుద్ధరించేందుకు అన్ని విధాలుగా సహకరించేందుకు భారత్ సుముఖంగా ఉందని మోదీ పునరుద్ఘాటించనట్లు పేర్కొన్నారు.
రెండు రోజుల పోలండ్ పర్యటనను ముగించుకున్న ప్రధాని మోదీ, 10 గంటలు ప్రయాణించి ఉక్రెయిన్ చేరుకున్నారు. అక్కడి భారత సంతతి ప్రజలు రైల్వేస్టేషన్ వద్ద మోదీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజధాని కీవ్‌లోని అమరుల స్మారక ప్రాంతానికి చేరుకున్న మోదీకి స్వాగతం పలికిన అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం రష్యా దాడిలో మరణించిన చిన్నారులకు మోదీ నివాళి అర్పించారు. ఉక్రెయిన్ ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభాల ఆనవాళ్లకు సంబంధించి అక్కడి మ్యూజియంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఇద్దరు నేతలు వీక్షించారు.
Paid tributes to Mahatma Gandhi at Kyiv. The ideals of Bapu are universal and give hope to millions. May we all follow the path he showed to humanity. pic.twitter.com/vdqiUQcjJV
— Narendra Modi (@narendramodi) August 23, 2024
ఈ సంక్షోభం చిన్నారులకు వినాశకరం: మోదీ
"అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కలిసి అమరుల స్మారకం వద్ద నివాళి అర్పించాం. ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభం చిన్నారులకు వినాశకరమైంది. ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. దుఃఖం నుంచి బయటపడే మనోధైర్యాన్ని వారికి ఇవ్వాలని ప్రార్థిస్తున్నా" అని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు.
రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కార మార్గాలపై చర్చ!
ఫోమిన్ బొటానికల్ గార్డెన్‌కు వెళ్లి గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన మోదీ, ఆ తర్వాత అధ్యక్ష భవనమైన మారిన్‌స్కీ ప్యాలెస్‌కు జెలన్‌స్కీ మోదీని తీసుకెళ్లారు. కీవ్ పర్యటనలో ఉన్న మోదీతో అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యక్తిగతంగా, బృంద స్థాయిలో భేటీ అయ్యారు. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కార మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు.
#WATCH | Prime Minister Narendra Modi pays floral tributes to Mahatma Gandhi in Ukraine's Kyiv pic.twitter.com/NbXTxGKKNx
— ANI (@ANI) August 23, 2024
1991లో ఉక్రెయిన్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత ప్రధాని అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆహ్వానం మేరకు మోదీ ఆ దేశంలో పర్యటిస్తున్నారు. ఆరు వారాల కింద రష్యాలో పర్యటించిన ప్రధానిపై అమెరికా, పశ్చిమ దేశాల నుంచి విమర్శలు వచ్చాయి. యుద్ధంలో భారత్ ఏ పక్షానికీ మద్దతుగా ఉండదని, కేవలం శాంతికి వారధిగా పని చేస్తుందనే సందేశం ఇచ్చేందుకు ప్రధాని ఈ పర్యటనను చేపట్టారు.
పోలెండ్‌కు ప్రధాని మోదీ- 45 ఏళ్లలో ఇదే ఫస్ట్ టైమ్! - PM Modi Poland Visit