North Korea Nuclear Missiles Show : ఉత్తరకొరియా భారీ ఆయుధ ప్రదర్శన నిర్వహించింది. దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ హాజరైన ఓ వేడుకలో దేశీయంగా తయారు చేసిన కొత్త న్యూక్లియర్ క్షిపణి లాంఛర్లను ప్రదర్శించారు. ఓ రహస్య ప్రదేశంలో జరిగిన ఆ వేడుకలో మొత్తం 250 క్షిపణి లాంఛర్లను కిమ్ ప్రభుత్వం ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన చిత్రాలను ఆ దేశ అధికారిక మీడియా KCNA విడుదల చేసింది. వాటిని సాయుధ దళాలకు కీలకంగా మారనున్న కొత్త-రకం వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి లాంఛర్లుగా KCNA పేర్కొంది. ఈ ప్రదర్శన జరుగుతున్నప్పుడు కిమ్ జోంగ్ ఉన్ ఉన్నత సైనికాధికారులతో కలిసి కనిపించారు. తక్కువ సంఖ్యలో ప్రజలు వేడుకకు వచ్చినట్లు చిత్రాలను బట్టి తెలుస్తోంది.
Korean Countries Balloons War : ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య చెత్త బెలూన్ల యుద్ధం కూడా జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం ఉత్తర కొరియా పంపిన చెత్త బెలూన్లు సౌత్ కొరియా అధ్యక్ష కార్యాలయం ప్రాంగణంలో పడ్డాయని ఆ దేశ మీడియా సంస్థ పేర్కొంది. అయితే ఉత్తర కొరియానే ముందుగా చెత్త బెలూన్లు ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. అవి సరిహద్దు దాటిన తర్వాత సియోల్‌కు ఉత్తరంగా ఎగిరాయని పేర్కొంది. బెలూన్ల నుంచి పడే వస్తువుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది. అయితే ఈ 'చెత్త' దాడిలో ఎలాంటి నష్టం జరగలేదని దక్షిణ కొరియా తెలిపింది.
మే నెల చివరి వారం నుంచి ఈ బెలూన్ల యుద్ధం రెండు దేశాల మధ్య సాగుతోంది. ఉత్తర కొరియా ఇలా బెలూన్లు పంపడం ఇది పదో సారి అని దక్షిణ కొరియా సైన్యం చెప్పింది. ఇప్పటి వరకు 2,000 కంటె ఎక్కువగానే బెలూన్లను ప్రయోగించినట్లు తెలిపింది. ఆ బెలూన్లలో ఎరువులు, సిగరెట్ పీకలు, చెత్త వస్తువులు, వ్యర్థాలు ఉన్నాయని వెల్లడించింది. అయితే దక్షిణకొరియా పంపిన బెలూన్లకు ప్రతీకారంగానే చెత్త బెలూన్లను పంపడం మళ్లీ ప్రారంభించామని ఉత్తర కొరియా పేర్కొంది.
లౌడ్‌స్పీకర్లతో సమాధానం
కొత్త కొరియా చెత్త బెలూన్లకు గతంలో దక్షిణ కొరియా గట్టి జవాబునిచ్చింది. సరిహద్దుల్లో పెద్ద పెద్ద లౌడ్‌స్పీకర్లను ఏర్పాటు చేసి ఉత్తర కొరియా వ్యతిరేక ప్రచారాలను ప్రారంభించింది. సైనిక స్థావరాలు ఉన్న ఉత్తర కొరియా ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా కె-పాప్ సంగీతం, విదేశీ వార్తలతోపాటు, ప్యాంగ్యాంగ్ వ్యతిరేక ప్రసారాలను దక్షిణ కొరియా సైన్యం హోరెత్తిస్తోంది. ఉత్తర కొరియాలో విదేశీ వార్తలు, కె-పాప్ సంగీతాన్ని వినడాన్ని తీవ్ర నేరాలుగా పరిగణిస్తారు. అవి తమ పౌర సమాజంలో ప్రభుత్వ వ్యతిరేక భావాలను నాటుతుందని, తన అధికారాన్ని బలహీనపరుస్తుందని కిమ్ జోంగ్ ఉన్ భావిస్తారని భావిస్తుంటారు. 2015లో ఇలాగే దక్షిణ కొరియా లౌడ్ స్పీకర్లతో ఉత్తర కొరియా వ్యతిరేక ప్రచారం చేయగా ప్రతిచర్యగా కిమ్ ప్రభుత్వం ఫిరంగులను పేల్చింది. అప్పట్లో అది ఉద్రిక్త పరిస్థితులకు తావిచ్చింది. మళ్లీ ఆ పరిస్థితులే ఎదురైతే ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని దక్షిణ కొరియా రక్షణ మంత్రి సైనిక బలగాలను ఆదేశించారు.
బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస- 100మంది మృతి- 14మంది పోలీసులు కూడా - Bangladesh Violence
ట్రంప్‌తో డిబేట్‌కు నో చెప్పిన కమలా హారిస్! - KAMALA HARRIS AND TRUMP DEBATE