Modi Address Indians At Moscow : భారత్ గత పదేళ్లలో సాధించిన విజయాలను ప్రపంచం గుర్తిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ అభివృద్ధి అధ్యాయాన్ని భారత్ లిఖిస్తోందని పేర్కొన్నారు. రష్యా పర్యటనలో భాగంగా భారత సంతతి వారితో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ప్రసంగించారు. రష్యా పర్యటనకు నేను ఒక్కడినే రాలేదని, 140 కోట్ల మంది ప్రేమను, దేశ మట్టి వాసనను తీసుకొచ్చానని అన్నారు. ఈ వ్యాఖ్యలతో సమావేశ మందిరం కరతాళ ధ్వనులతో మార్మోగింది.
#WATCH | Moscow, Russia: Prime Minister Narendra Modi says " ...today when india builds the world's tallest railway bridge, world's tallest statue, the world says, india is changing and how is india changing because india trusts the support of its 140 crore citizens, trusts the… pic.twitter.com/Book00KsUN
— ANI (@ANI) July 9, 2024
'ఇటీవలే మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణం చేశాను. అందుకే మూడు రెట్ల వేగంతో పని చేయాలని నిర్ణయించుకున్నా. ప్రస్తుతం ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌ను మూడో ఆర్థిక శక్తిగా నిలబెడతా. భారత్ సాధించిన విజయాలను చూసి ప్రపంచ దేశాలు గర్విస్తున్నాయన్నాయి. ఏ దేశానికి సాధ్యం కాని విధంగా చంద్రయాన్ ప్రయోగం చేశాం. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ గుర్తింపు పొందింది' ప్రధాని మోదీ అన్నారు.
#WATCH | Moscow, Russia: Prime Minister Narendra Modi says " today's india makes sure it achieves the target it sets. today, india is the country that takes chandrayaan to the part of the moon where no other country in the world could reach. today, india is the country that is… pic.twitter.com/2m9nUPQPo6
— ANI (@ANI) July 9, 2024
భారతే నెంబర్ వన్
డిజిటల్ లావాదేవీల్లో ప్రపంచంలోనే భారత్ నంబర్ వన్‌గా ఉందని గుర్తు చేసిన ప్రధాని మోదీ స్టార్టప్‌ల్లో ప్రపంచంలోనే మనం మూడో స్థానంలో ఉన్నామన్నారు. 2014లో వందల్లో ఉన్న స్టార్టప్‌లు నేడు లక్షల్లోకి చేరాయన్నారు. భారత్ రికార్డు స్థాయిలో పేటెంట్లను సాధిస్తోందన్న ప్రధాని మోదీ, భారత్ ఘనతను ప్రపంచం గుర్తించక తప్పని పరిస్థితిని కల్పించామన్నారు. దేశంలోని ప్రతిఒక్కరిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నామన్న ఆయన ఆత్మవిశ్వాసం భారత దేశానికి అతిపెద్ద ఆయుధమన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్యబీమా వ్యవస్థ భారత్‌లోనే ఉందని గుర్తు చేశారు. మన దేశ యువతే నిజమైన ఆస్తి అని మోదీ అన్నారు. ప్రపంచ అభివృద్ధి అధ్యాయాన్ని భారత్ లిఖిస్తోందన్న ఆయన, గత పదేళ్లలో భారత్ సాధించింది కేవలం ట్రైలర్ మాత్రమేనని రాబోయే 10 ఏళ్లలో అసలు సినిమా చూపిస్తామని అన్నారు. అన్ని సవాళ్లను ఎదుర్కోవడం తన డీఎన్‌ఏలోనే ఉందని మోదీ అన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ వృద్ధిలో భారత్ కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందన్నారు.
#WATCH | Moscow, Russia: Prime Minister Narendra Modi says " the world is surprised to see the pace of development that the country has achieved in the last 10 years. when people from the world come to india, they say 'bharat badal raha hai'. they are clearly able to see the… pic.twitter.com/Ka4q6or4v5
— ANI (@ANI) July 9, 2024
పుతిన్‌పై ప్రసంశలు
రెండు దశాబ్దాలుగా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో రష్యాధినేత పుతిన్ నాయకత్వంపై మోదీ ప్రశంసలు కురిపించారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం వేళ భారత విద్యార్థులు చిక్కుకుపోతే, వారిని కాపాడటంలో పుతిన్ సహకరించారని మోదీ గుర్తుచేశారు. ఈసందర్భంగా ఆయనతో పాటు రష్యా ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. 'భారత్-రష్యా నమ్మకమైన మిత్రులు. పరస్పర విశ్వాసం, గౌరవం ఆధారంగా ఈ స్నేహం కొనసాగుతోంది. రష్యాలో చలికాలంలో ఉష్ణోగ్రతలు ఎంత మైనస్‌లోకి పడిపోయినా సరే, మన రెండు దేశాల మధ్య బంధం ఎప్పుడూ ప్లస్‌లోనే ఉంటుంది. అది మన స్నేహాన్ని ఆహ్లాదంగా ఉంచుతుంది. ఇప్పటివరకు నేను ఆరుసార్లు రష్యాలో పర్యటించాను. పుతిన్‌తో 17 సార్లు భేటీ అయ్యాను. ఇక ఉన్నత విద్యకోసం భారతీయులు రష్యా వస్తున్నారు. ఇక్కడ మరో రెండు కాన్సులేట్ కార్యాయాలు ప్రారంభిస్తాం'అని మోదీ అన్నారు.
VIDEO | " you all are giving new heights to india-russia relations. with your hard word and honesty, you have contributed to the russian society. since decades, i have been admirer of the relations between india and russia. as soon as an indian listens to the word 'russia', what… pic.twitter.com/a6Z2c7tgUV
— Press Trust of India (@PTI_News) July 9, 2024
మోదీతో విందులో పుతిన్ కీలక నిర్ణయం- రష్యా సైన్యంలోని భారతీయులకు విముక్తి!
'భారత్ మాకు వ్యూహాత్మక భాగస్వామి'- మోదీ రష్యా పర్యటనపై అమెరికా స్పందన