ETV Bharat / international

ట్రంప్​తో డిబేట్​కు నో చెప్పిన కమలా హారిస్​! - KAMALA HARRIS AND TRUMP DEBATE - KAMALA HARRIS AND TRUMP DEBATE

Kamala Harris Rejects Trump's Offer To Shift Presidential Debate : అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. కమలా హారిస్​, డొనాల్డ్ ట్రంప్ మధ్య మాటల తూటాలు పెలుతున్నాయి. అయితే అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి సెప్టెంబరు 4న ఫాక్స్‌ న్యూస్‌ ఛానెల్‌ ఆతిథ్యంలో డిబేట్​ చేద్దామంటూ ట్రంప్‌ చేసిన ప్రతిపాదనను కమలా హారిస్​ తిరస్కరించారు. ఇంకా ఆమె ఏం అన్నారంటే?

Kamala Harris VS Donald Trump
Kamala Harris VS Donald Trump (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 5, 2024, 10:26 AM IST

Kamala Harris Rejects Trump's Offer To Shift Presidential Debate : అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారపర్వం జోరుగా కొనసాగుతోంది. అధ్యక్ష అభ్యర్థులుగా ఖరారైన డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ పరస్పరం విమర్శల దాడి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి సెప్టెంబరు 4న ఫాక్స్‌ న్యూస్‌ ఛానెల్‌ ఆధ్వర్యంలో డిబేట్ చేద్దామంటూ రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల చేసిన ప్రతిపాదనను, డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ తిరస్కరించారు. జో బైడెన్‌ డెమోక్రాట్ల అభ్యర్థిగా ఉన్నప్పుడు కుదిరిన అంగీకారం ప్రకారమే, సెప్టెంబరు 10న ఏబీసీ న్యూస్‌ ఆతిథ్యంలో డిబేట్ చేద్దామని స్పష్టం చేశారు.

"ఎప్పుడైనా, ఎక్కడైనా సరే అని గతంలో వ్యాఖ్యానించిన ఓ వ్యక్తి ఇప్పుడు నిర్దిష్ట తేదీన, నిర్దిష్ట సురక్షిత ప్రాంతంలో డిబేట్ అని ప్రతిపాదిస్తుండటం విచిత్రంగా ఉంది. కొత్త ప్రతిపాదన నాకు ఏమాత్రం అంగీకారం కాదు. సెప్టెంబరు 10న డిబేట్​లో పాల్గొనేందుకు ట్రంప్‌ ముందుగా అంగీకరించారు. నేను అదే తేదీన ట్రంప్​తో డిబేట్​లో పాల్గొంటాను" అని కమలా హారిస్ ఎక్స్​లో పోస్ట్ చేశారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్‌ జూన్‌లో సీఎన్​ఎన్‌ ఆధ్వర్యంలో బైడెన్​తో తొలి డిబేట్​లో పాల్గొన్నారు. సెప్టెంబరు 10న ఏబీసీ న్యూస్‌ నిర్వహణలో రెండో డిబేట్​లో పాల్గొనాలని వారిద్దరి మధ్య అంగీకారం కుదిరింది. అనూహ్య పరిస్థితుల్లో అధ్యక్ష రేసు నుంచి బైడెన్‌ వైదొలగడం వల్ల ఆయన స్థానంలో కమలా హారిస్​ వచ్చారు. దీనితో సెప్టెంబరు 4న ఫాక్స్‌ న్యూస్‌ ఛానెల్‌ నిర్వహణలో డిబేట్​లో పాల్గొందామని ట్రంప్‌ ఇటీవల ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను తాజాగా కమలా హారిస్​ తిరస్కరించారు.

అంతా సాఫీగానే
డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిగా అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగినప్పటి నుంచి కమలా హారిస్‌ ప్రయాణం సాఫీగానే సాగుతోంది. ఆమె సభలకు జనం భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. విరాళాలు పెద్దఎత్తున వస్తున్నాయి. అయితే రానున్న వారం రోజులు కమలకు చాలా కీలకం. ఎన్నికల ప్రచారంలో ఇంకా జోరు పెంచాల్సి ఉండటం సహా, ఉపాధ్యక్ష అభ్యర్థిని మంగళవారంలోగా నిర్ణయించాల్సి ఉంటుంది. ఆరుగురు కీలక వ్యక్తులతో (నలుగురు గవర్నర్లు, ఓ సెనెటర్, ఓ కేబినెట్‌ అధికారి) కూడిన జాబితాలో నుంచి కమల తన నంబర్‌-2ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

కమలా హారిస్​కు జిమ్మీ కార్టర్‌ మద్దతు
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన కమలా హారిస్​కు అంతకంతకు మద్దతు పెరుగుతోంది. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ కమలా హారిస్​కు మద్దతు పలికారు. ఈ విషయాన్ని ఆయన మనవడు జాసన్‌ తాజాగా విలేకర్లకు తెలిపారు. కార్టర్‌ 1977-81 మధ్య అమెరికా అధ్యక్షుడిగా సేవలు అందించారు. 2002లో నోబెల్‌ శాంతి బహుమతిని అందుకున్నారు.

వివాహేతర సంబంధాన్ని అంగీకరించిన కమల భర్త
మొదటి వివాహ సమయంలో తనకు వివాహేతర సంబంధం ఉండేదని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ భర్త డగ్లస్‌ ఎమ్‌హోఫ్‌ తెలిపారు. తన పిల్లలు చదివే పాఠశాలలో పనిచేసే ఓ ఉపాధ్యాయురాలితో ఎమ్‌హోఫ్‌ వివాహేతర సంబంధం పెట్టుకున్నారని, అందువల్లే ఆయన మొదటి వివాహానికి తెరపడిందని ఇటీవల వార్తలొచ్చాయి. వాటిపై ఆయన వివరణ ఇచ్చారు.

"నా మొదటి వివాహం తర్వాత నా చర్యలతో నేను, నా మాజీ భార్య చాలా కఠిన సమయాన్ని ఎదుర్కొన్నాం. ఆమెను మోసం చేశాను. అందుకు నేను పూర్తి బాధ్యత వహించాను"’ అని ‘సీఎన్‌ఎన్‌’ తో డగ్లస్‌ ఎమ్‌హోఫ్‌ తెలిపారు. కాగా కమలా హారిస్, ఎమ్‌హోఫ్‌ను 2014లో వివాహం చేసుకున్నారు. కమలకు ఇది మొదటి వివాహం కాగా, ఎమ్‌హోఫ్‌కు రెండోది. ఎమ్‌హోఫ్‌ వివాహేతర సంబంధం గురించి కమలకు ముందే తెలుసని సీఎన్‌ఎన్‌ వెల్లడించింది.

బంగ్లాదేశ్​లో మళ్లీ హింస- 100మంది మృతి- 14మంది పోలీసులు కూడా - Bangladesh Violence

మోడ్రన్ టెక్నాలజీతో ఒలింపిక్స్‌ డ్రోన్‌ షో- ఒకదానికొకటి ఢీకొట్టకుండా ఎలా ఎగురవేస్తారో తెలుసా? - Paris Olympics 2024 Drone Show

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.