ETV Bharat / international

ఈ రోజే ఇజ్రాయెల్​పై దాడులకు ఇరాన్, హెజ్​బొల్లా ప్లాన్ - పశ్చిమాసియాలో టెన్షన్ టెన్షన్! - Israel Prepares For Iran Attack

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 5, 2024, 11:40 AM IST

Israel Prepares For Iran Attack : ఇజ్రాయెల్​పై దాడులకు ఇరాన్​, హెజ్​బొల్లా సిద్ధమవుతున్నాయి. దీనితో అమెరికా రంగంలోకి దిగింది. పశ్చిమాసియా ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించింది.

US deploys jets and warships as Iran threatens Israel
Israel Prepares For Iran Attack (AP)

Israel Prepares For Iran Attack : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఏ క్షణంలో ఎక్కడి నుంచి దాడులు జరుగుతాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ ఉద్రిక్తతలను చల్లార్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. అందులో భాగంగా పశ్చిమాసియా ప్రాంతంలో అదనపు బలగాలను మోహరిస్తున్నామని వెల్లడించింది.

హమాస్‌, హెజ్​బొల్లా గ్రూపులకు అండగా ఇరాన్
ఇటీవలే ఇరాన్ రాజధాని టెహ్రాన్​లో హమాస్‌ అగ్రనేత ఇస్మాయిల్‌ హనియా హత్యకు గురయ్యారు. మరోవైపు, ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో హెజ్​బొల్లా సీనియర్‌ మిలిటరీ కమాండర్‌ ఫాద్‌ షుక్ర్ మరణించారు. ఈ రెండు పరిణామాల తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. పైగా ఈ హమాస్‌, హెజ్​బొల్లా గ్రూపులకు ఇరాన్ మద్దతుగా ఉంది. ఇప్పటికే హమాస్‌-ఇజ్రాయెల్‌ యుద్ధంతో వేడెక్కిన ఈ ప్రాంతంలో తాజా పరిణామాలతో మరింత ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే భయాలు పశ్చిమాసియా దేశాల్లో నెలకొంది.

రంగంలోకి అమెరికా- పరిస్థితులపై జో బైడెన్‌ సమీక్ష
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరా తీశారు. తాజా పరిస్థితులపై సమీక్షించేందుకు బైడెన్ సోమవారం జాతీయ భద్రతా మండలితో సమావేశం కానున్నట్లు శ్వేతసౌధం తెలిపింది. జోర్డాన్‌ రాజు అబ్దుల్లాతోనూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చర్చించనున్నట్లు వెల్లడించింది.

దాడులకు ఇరాన్, హెజ్​బొల్లా ప్లాన్!
పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిస్థితులపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ జీ 7 దేశాల మంత్రులతో మాట్లాడినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్​పై ఇరాన్‌, హెజ్​బొల్లా సోమవారం దాడులు చేసే ప్రమాదం ఉన్నట్లు తమకు సమాచారం ఉందని ఆయన వారికి తెలిపారు. అయితే ఎలా, ఏ సమయంలో ఈ దాడులు ఉండొచ్చనేది మాత్రం కచ్చితంగా తెలియదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలను వీలైనంత త్వరగా చల్లబర్చాల్సిన అవసరం ఉందని ఆంటోని బ్లింకెన్ అభిప్రాయపడ్డారు.

'దేనికైనా రెడీ - ఇజ్రాయెల్​తో కలిసి సిద్ధమవుతాం'
మొత్తంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణపూరిత పరిస్థితులను విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నామని శ్వేతసౌధం ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్​తో కలిసి సిద్ధమవుతున్నామని పేర్కొన్నారు.

ట్రంప్​తో డిబేట్​కు నో చెప్పిన కమలా హారిస్​! - KAMALA HARRIS AND TRUMP DEBATE

250 న్యూక్లియర్​ క్షిపణి లాంఛర్లతో - ఉత్తర కొరియా భారీ ఆయుధ ప్రదర్శన - NORTH KOREA MISSILE LAUNCHERS SHOW

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.