ETV Bharat / international

గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడి- 38 మంది మృతి

గాజా, లెబనాన్​పై ఇజ్రాయెల్ తీవ్ర డాడులు- గాజాలో 38 మంది హతం- లెబనాన్​లో ముగ్గురు జర్నలిస్టులు మృతి

Israel Attack On Iran Today
Israel Attack On Iran Today (Associated Press (File Photo))
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2024, 3:07 PM IST

Updated : Oct 25, 2024, 3:37 PM IST

Israel Attack On Iran Today : గాజాపై ఇజ్రాయెల్​ చేసిన దాడిలో 38 మంది మృతి చెందారు. ఈ మేరకు గాజా ఆరోగ్య శాఖ అధికారులు వివరాలు వెల్లడించారు. గాజా, లెబనాన్​పై దాడుల తీవ్రత పెంచిన ఇజ్రాయెల్ గాజా పట్టిలోని ఖాన్​ యూనిస్​పై శుక్రవారం ఉదయం తదాడి చేసింది. అయితే అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తున్నా ఇజ్రాయెల్​ దాడులు మాత్రం ఆపడం లేదు.

ముగ్గురు జర్నలిస్టులు మృతి
ఇదిలా ఉండగా, లెబనాన్​పై ఇజ్రాయెల్ చేసిన దాడిలో 3 టీవీ జర్నలిస్టులు చనిపోయినట్లు లెబనాన్​ మీడియా పేర్కొంది. మృతుల్లో తమ స్టాఫర్లు- కెమెరా ఆపరేటర్ ఘస్సన్ నజర్, బ్రాడ్​కాస్ట్​ ఆఫరేటర్ మహ్మద్ రిదా ఉన్నారని బీరుట్​కు చెందిన అల్-మయదీన్ టీవీ తెలిపింది. ఇక హెజ్​బొల్లా సంస్థకు సంబంధించిన అల్-మనర్ టీవీ, తమ కెమెరా ఆపరేటర్ వాసిమ్ ఖాసిమ్ సైతం ఇజ్రాయెల్ దాడిలో మృతి చెందినట్లు వెల్లడించింది.

'అల్​-జజీరాలో ఆరుగురు ఉగ్రవాదులు'
ఇటీవల ప్రముఖ అరబ్ మీడియా సంస్థ అల్‌-జజీరాపై ఇజ్రాయెల్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ సంస్థకు చెందిన ఆరుగురు జర్నలిస్టులు ఉగ్రవాదులంటూ ఇజ్రాయెల్ ఆరోపించింది. పాలస్తీనాకు చెందిన హమాస్‌, ఇస్లామిక్‌ జిహాద్‌ గ్రూప్‌లతో వారు కలిసిపోయారని మండిపడింది. కాగా, ఇజ్రాయెల్ చేసిన ఆరోపణలపై అల్​జజీరా తీవ్రంగా ఖండించింది.

నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు జైలు శిక్ష పొడగింపు
ఇరాన్​కు చెందిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గెస్ మొహమ్మదికి అక్కడి అధికారులు 6 నెలలు జైలు శిక్ష పొడగించారు. ఆదేశాలను ధిక్కరించినందుకు, నిరాకరించినందుకు శిక్ష పొడగించినట్లు తెలిపారు.
ఈ ఏడాది ఆగస్టు 6న ఎవిన్​ జైలులోని మహిళా వార్డులో మరో రాజకీయ ఖైదీని ఉరితీసినందుకు మొహమ్మది నిరసన తెలిపారని, అందుకే ఆమెపై ఈ అభియోగాలు మోపినట్లు 'ది ఫ్రీ నర్గెస్ కొయలెషన్' ఓ ప్రకటనలో తెలిపింది.

నార్గెస్ మొహమ్మది 2023 ఏడాదికి గానూ నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న 19వ మహిళగా, మానవహక్కుల కార్యకర్త షిరిన్ ఏబాది(2003) తర్వాత రెండో ఇరానియన్​గా చరిత్రకెక్కారు. మహిళలపై వివిధ రకాల ఆంక్షలు, కట్టుబాట్లతో నిండి ఉన్న పితృస్వామ్య వ్యవస్థలో, అలాంటి అసమానతల్ని తొలగించి అక్కడి మహిళలకు స్వేచ్ఛాస్వాతంత్ర్యాల్ని ప్రసాదించడానికి దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు నర్గెస్‌ మొహమ్మది. ఈ క్రమంలో ఆమె అనేక సార్లు జైలుకు కూడా వెళ్లారు. కానీ తన పోరాటాన్ని మాత్రం ఆపలేదు.

గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 87మంది మృతి- లీకైన ఇంటెలిజెన్స్ పేపర్స్​లో ఏముంది?

హమాస్‌ అగ్రనేత యాహ్యా సిన్వర్‌ హతం- ఇజ్రాయెల్​ శత్రువులంతా అంతమైనట్లే!

Last Updated : Oct 25, 2024, 3:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.