ETV Bharat / international

ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడి- భారతీయుడు మృతి, మరో ఇద్దరికి గాయాలు - kerala man killed israel

Indian Killed In Israel : లెబనాన్ భూభాగం నుంచి ఇజ్రాయెల్‌పై జరిగిన క్షిపణి దాడిలో ఓ భారతీయుడు మృతి చెందాడు. ఇజ్రాయెల్‌ ఉత్తర సరిహద్దుల్లో ఉన్న మార్గలియట్‌ అనే వ్యవసాయ క్షేత్రంపై ట్యాంక్‌ విధ్వంసక క్షిపణి దాడి జరిగినట్లు ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ ధ్రువీకరించింది. ఈ దాడిలో ఓ భారతీయుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వీరంతా కేరళకు చెందిన వారిగా గుర్తించారు.

Indian Killed In Israel
Indian Killed In Israel
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 5, 2024, 10:17 AM IST

Indian Killed In Israel : లెబనాన్ భూభాగం నుంచి చేసిన క్షిపణి దాడిలో ఇజ్రాయెల్‌లో ఓ భారతీయుడు మరణించాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా కేరళకు చెందినవారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఇజ్రాయెల్‌ ఉత్తర సరిహద్దుల్లో ఉన్న మార్గలియట్‌ అనే వ్యవసాయ క్షేత్రంపై ట్యాంకు విధ్వంసక క్షిపణి దాడి జరిగినట్లు అధికారులు ధ్రువీకరించారు.

మృతుడిని కేరళలోని కొల్లామ్‌కు చెందిన పట్నిబిన్ మాక్స్‌వెల్‌గా గుర్తించారు. ప్రస్తుతం అతడి మృతదేహం స్థానిక జీవ్‌ ఆసుపత్రిలో ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ దాడిలో గాయపడిన జోసెఫ్‌ జార్జ్‌, పాల్‌ మెల్విన్‌కు చికిత్స అందిస్తున్నారు. పాల్‌కు శస్త్రచికిత్స జరిగినట్లు తెలిపారు. అతడు భారత్‌లోని తన కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు చెప్పారు. ఈ దాడి హెజ్‌బొల్లా పనేనని అనుమానిస్తున్నారు. హమాస్‌కు మద్దతుగా ఈ గ్రూప్‌ అక్టోబర్‌ 8 నుంచి ఉత్తర ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలపై రాకెట్లు, క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. దీనికి ప్రతీకారంగా హెజ్‌బొల్లా స్థావరాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (IDF) ప్రకటించింది.

హమాస్‌ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి లెబనాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న హెజ్‌బొల్లాతో ఇజ్రాయెల్‌కు సవాళ్లు ఎదురవుతున్నాయి. దీంతో ఈ గ్రూప్‌పైనా ఐడీఎఫ్‌ దాడులు చేపడుతోంది. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు ఏడుగురు పౌరులతో పాటు 10 మంది సైనికులు మరణించినట్లు ఐడీఎఫ్‌ తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్‌ దాడుల వల్ల తమవైపు 229 మంది మృతిచెందినట్లు హెజ్‌బొల్లా తెలిపింది.

ఒకే కుటుంబానికి చెందిన 14మంది మృతి
Israel Strike Rafah : ఇటీవల రఫాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఒకే కుటుంబానికి చెందిన 14మంది మరణించారు. మృతుల్లో 5నెలల కవలలు ఉన్నారు. దీంతో చిన్నారుల తల్లి తీవ్రంగా విలపించింది. పెళ్లైన పదేళ్ల తర్వాత పుట్టిన చిన్నారులు దూరం కావడం వల్ల ఆ తల్లిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఇప్పటివరకు ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంలో 30,000 మంది పాలస్తీనియన్లు మరణించారు. గాజాలో ఉన్న 2.3 మిలియన్ల జనాభాలో 80శాతం మంది తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. జనాభాలో నాలుగింట ఒక వంతు మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.