India Republic Day 2024 : 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న భారత్‌కు ప్రపంచ దేశాలు శుభాకాంక్షలు తెలిపాయి. అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా సహా వివిధ దేశాలు భారత్‌కు శుభాకాంక్షలు చెప్పాయి. భారత్‌తో అనేక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఎదురు చూస్తున్నామని ఈ సందర్భంగా అమెరికా తెలిపింది. గతేడాది కాలంగా ఇరుదేశాల బంధం అనేక మైలురాళ్లను దాటిందని పేర్కొంది. జీ20కి భారత్ అధ్యక్షత వహించిన సమయంలో ఇరుదేశాల మధ్య సహకారాన్ని గుర్తు చేసింది. ప్రజల మధ్య సత్సంబంధాలు మరింత పెంపొందించే దిశగా పని చేసేందుకు ఎదురు చూస్తున్నామని తెలిపింది. భారత్-అమెరికా బంధాన్ని ప్రపంచంలోనే అత్యంత కీలకమైనదిగా అభివర్ణించింది.
"భారత ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌కు ఆ దేశ రాజ్యాంగం బలమైన పునాది ఏర్పరచింది. ప్రపంచ స్థాయిలో నాయకత్వం వహించే దేశంగా భారత్‌కు రాజ్యాంగం మార్గనిర్దేశం చేస్తుంది. అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్న భారత్‌తో అనేక రంగాల్లో సహకారం పెంపొందించుకునే దిశగా పని చేస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత పర్యటనలో ఈ విషయం స్పష్టమైంది."
-అమెరికా విదేశాంగ శాఖ
రష్యా స్పెషల్ విషెస్
భారత స్నేహితులకు శుభాకాంక్షలంటూ రష్యా ట్వీట్ చేసింది. భారత్ అభివృద్ధి మరింత వేగంగా సాగాలంటూ అభిలాషించింది. ప్రకాశవంతమైన అమృతకాలం భారత్ కోసం ఎదురుచూస్తోందని భారత్లోని రష్యా రాయబారి డెన్నిక్ అలిపోవ్ పేర్కొన్నారు. 'రష్యా- భారతీయ దోస్తీ' సుదీర్ఘకాలం కొనసాగాలని ఆకాంక్షించారు. దీంతో పాటు వినూత్నంగా శుభాకాంక్షలు తెలుపుతూ బాలీవుడ్ చిత్రం గదర్లోని ఓ పాటకు భారత్లోని తమ రాయబారులు డ్యాన్స్ చేస్తున్న వీడియోను రష్యా పంచుకుంది. భారత జాతీయ పతాకాన్ని పట్టుకొని అధికారులు, ప్రజలు డ్యాన్స్ చేస్తుండటం వీడియోలో కనిపిస్తోంది.
-
Warmest congratulations on the #RepublicDay, India! Wishing our Indian friends prosperity, well-being and very bright #AmritKaal! Long live #Bharat! Long live Rusi-Bharatiya Dosti! pic.twitter.com/BOeEewup86
— Denis Alipov 🇷🇺 (@AmbRus_India) January 25, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">Warmest congratulations on the #RepublicDay, India! Wishing our Indian friends prosperity, well-being and very bright #AmritKaal! Long live #Bharat! Long live Rusi-Bharatiya Dosti! pic.twitter.com/BOeEewup86
— Denis Alipov 🇷🇺 (@AmbRus_India) January 25, 2024Warmest congratulations on the #RepublicDay, India! Wishing our Indian friends prosperity, well-being and very bright #AmritKaal! Long live #Bharat! Long live Rusi-Bharatiya Dosti! pic.twitter.com/BOeEewup86
— Denis Alipov 🇷🇺 (@AmbRus_India) January 25, 2024
ఆస్ట్రేలియా, కెనడా, మాల్దీవులు శుభాకాంక్షలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపిన ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ ఇరుదేశాల స్నేహ బంధం మరింత దృఢపడాలని ఆకాంక్షించారు. దౌత్యపరంగా వివాదం నెలకొన్న వేళ భారత్‌కు కెనడా శుభాకాంక్షలు చెప్పింది. భారత్‌కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని పేర్కొంటూ దిల్లీలోని కెనడా హైకమిషనర్ కార్యాలయం ఇంగ్లిష్, హిందీలో పోస్టు పెట్టింది. రిపబ్లిక్ డే సందర్భంగా మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు భారత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి వేర్వేరుగా సందేశాలు పంపారు. భారత్‌కు శుభాకాంక్షలు తెలిపిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సొలీహ్ ఇరుదేశాల మధ్య ఉన్న పటిష్ఠ బంధం ఇలాగే కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఐరాస భద్రతా మండలిలో భారత్ ఉండాలి- శక్తిమంతమైన దేశాలకు అదే సమస్య! : ఎలాన్ మస్క్
'భారత్‌తో వివాదం మనకే చేటు'- మాల్దీవులు అధ్యక్షుడి తీరుపై స్వదేశంలో విమర్శలు