ETV Bharat / international

మళ్లీ రెచ్చిపోయిన హూతీలు- అమెరికా యుద్ధనౌకలపై దాడి- తిప్పికొట్టిన అగ్రరాజ్యం

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 12:07 PM IST

Updated : Mar 6, 2024, 12:22 PM IST

Houthi Rebels Attack US Ships : ఎర్ర సముద్రం మరోసారి రణరంగాన్ని తలపించింది. అమెరికాకు చెందిన రెండు యుద్ధనౌకలపై హూతీ తిరుగుబాటుదారులు విధ్వంసక క్షిపణులతో దాడులకు పాల్పడ్డారు. అయితే వాటిని సమర్థంగా కూల్చివేసినట్లు అమెరికా వెల్లడించింది.

Houthi Rebels Attack US Ships
Houthi Rebels Attack US Ships

Houthi Rebels Attack US Ships : ఎర్ర సముద్రంలో మరోసారి హూతీ రెబల్స్ రెచ్చిపోయారు. అమెరికాకు చెందిన రెండు యుద్ధ నౌకలపై హూతీ తిరుగుబాటుదారులు దాడులు చేశారు. కొన్ని నౌకా విధ్వంసక క్షిపణులు, డ్రోన్ల సాయంతో రెండు డెస్ట్రాయర్లపై దాడులు నిర్వహించినట్లు హూతీ సంస్థ ప్రతినిధి యహ్యా సరెయ ప్రకటించారు. తమ దళాలు క్షిపణులను సమర్థవంతంగా కూల్చివేసినట్లు అమెరికా వెల్లడించింది. ఎదురు దాడి చేసి యెమెన్‌ భూభాగంలోని మూడు క్షిపణులు, మరికొన్ని డ్రోన్లను ధ్వంసం చేసినట్లు తెలిపింది.

మరోవైపు, సోమవారం అర్ధరాత్రి MSCస్కై 2 వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో చిక్కుకున్న 23 మంది సిబ్బందిని భారత నౌకదళం సురక్షితంగా రక్షించింది. ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా నౌకతో MSCస్కై 2 నౌకను చేరుకున్న నౌకదళ సిబ్బంది 13 మంది భారతీయులు సహా మొత్తం 23 మందిని కాపాడారు.

తెగిపోయిన డేటా కేబుల్స్
ఎర్ర సముద్రంలో మూడు డేటాకేబుల్స్‌ తెగిపోయినట్లు టెలికాం సంస్థలు, ఓ అమెరికా ప్రభుత్వాధికారి ధ్రువీకరించినట్లు వార్తలొస్తున్నాయి. దీంతో ఆసియా-ఐరోపా మధ్య దాదాపు 25శాతం డేటా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉంది. హెచ్‌జీసీ గ్లోబల్‌ కమ్యూనికేషన్‌ స్పందిస్తూ ఆ ట్రాఫిక్‌ను వేరే కేబుల్స్‌కు మళ్లించేందుకు యత్నిస్తున్నట్లు పేర్కొంది. ఎలా తెగిపోయాయో కారణం మాత్రం వెల్లడించలేదు.

వాస్తవానికి సముద్రం అడుగున ఏర్పాటుచేసిన డేటా కేబుల్సే ఇంటర్నెట్‌ను నడిపించే అదృశ్య శక్తి. గత కొన్నేళ్లుగా అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా వంటి కంపెనీలు దీనిలో భారీ ఎత్తున నిధులను పెట్టుబడిగా పెట్టాయి. ఈ కేబుల్స్‌ దెబ్బ తింటే ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవల్లో అంతరాయం ఏర్పడుతుంది. 2006లో తైవాన్‌ భూకంపం సందర్భంగా ఒకసారి ఈ కేబుల్స్‌ దెబ్బతిని ఇంటర్నెట్‌ సేవల్లో ఇబ్బందులు తలెత్తాయి.

వరుసదాడులపై స్పందించిన అమెరికా
ఎర్ర సముద్రంలో రవాణా నౌకలపై వరుస దాడులకు పాల్పడుతున్న హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా, బ్రిటన్​కు చెందిన సైన్యం కొద్దిరోజుల క్రితం విరుచుకుపడింది. యెమెన్‌లోని వారి స్థావరాలే లక్ష్యంగా మరోసారి దాడులు నిర్వహించినట్లు కొద్ది రోజుల క్రితం డిఫెన్స్​ సెక్రటరీ లాయిడ్​ ఆస్టిన్​ తెలిపారు. ఈ విషయంలో మిత్రదేశాలైన ఆస్ట్రేలియా, బహ్రెయిన్​, కెనడా, డెన్మార్క్​, నెదర్లాండ్స్​, న్యూజిలాండ్​ దేశాలు కూడా తమకు సహకరించాయని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి వార్తను చదివేందుకు ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

భారత్​పై హౌతీ దాడుల ఎఫెక్ట్ నో​- ఫ్యాక్టరీలు మూసేస్తున్న ఐరోపా దేశాల్లోని కంపెనీలు!

ఇరాన్‌కు చైనా వార్నింగ్- నౌకలపై దాడులు ఆపకపోతే వ్యాపార సంబంధాలు కట్​!

Last Updated : Mar 6, 2024, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.