ETV Bharat / international

పాక్​ ఎన్నికల బరిలో ముంబయి ఉగ్రదాడి సూత్రధారి!- కొత్త పార్టీ ప్రకటన - పాకిస్థాన్​ సార్వత్రిక ఎన్నికలు

Hafiz Saeed Political Party : దాయాది దేశం పాకిస్థాన్​లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కొత్త రాజకీయ పార్టీ పోటీ చేయనుంది. మర‌్కజీ ముస్లిం లీగ్‌ పేరుతో బరిలోకి దిగనున్న ఈ పార్టీ ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ సారథ్యంలోని నిషేధిత గ్రూప్‌లకు చెందినదిగా భావిస్తున్నారు.

New Party In Pakistan To Contest In General Elections 2024
New Party In Pakistan Markazi Muslim League
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 5, 2024, 6:52 AM IST

Updated : Feb 5, 2024, 7:41 AM IST

Hafiz Saeed Political Party : ఈనెల 8న పాకిస్థాన్‌లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కొత్త రాజకీయ పార్టీ మర‌్కజీ ముస్లిం లీగ్‌ పోటీ చేయనుంది. దీనిని ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ సారథ్యంలోని నిషేధిత గ్రూప్‌లకు చెందిన కొత్త పార్టీగా భావిస్తున్నారు. ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు హఫీజ్‌ సయీద్‌ బంధువులు లేదా నిషేధిత లష్కరే తోయిబా, జమాత్-ఉద్-దవా, మిల్లీ ముస్లిం లీగ్‌తో సంబంధాలు కలిగినవారేనని బీబీసీ ఉర్దూ ఓ కథనం ప్రచురించింది. అయితే ప్రస్తుతం ప్రకటించిన కొత్త పార్టీ- మర‌్కజీ ముస్లిం లీగ్‌ హఫీజ్ సయీద్‌ జేయూడీకి చెందినదిగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీనిని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఖండించారు. సయీద్‌కు చెందిన గ్రూప్​లతో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

బరిలో సయీద్​ కుమారుడు, అల్లుడు!
సయీద్​ కుమారుడు హఫీజ్​ తల్హా సయీద్​ మర్కాజీ ముస్లిం లీగ్ పార్టీ నుంచి లాహోర్‌లోని నేషనల్​ అసెంబ్లీ నియోజకవర్గం NA-122 నుంచి ఎన్నికల బరిలో పాల్గొంటున్నారని మీడియా కథనాలు పేర్కొన్నాయి. కాగా, ఇదే నియోజకవర్గం నుంచి పాకిస్థాన్​ ముస్లిం లీగ్​ పార్టీ నేత, మాజీ మంత్రి నవాజ్ ఖవాజా సాద్​ రఫీక్​ పోటీ చేస్తున్నారు. ఇక ఇదే పార్టీ టికెట్​పై సయీద్​ అల్లుడు హఫీజ్​ నెక్​ గుజ్జర్​ మర్కజీ, ప్రావిన్షియల్ అసెంబ్లీ నియోజకవర్గం PP-162 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

ముంబయి ఉగ్రదాడి ఇలా!
2008, నవంబర్​ 26న పాకిస్థాన్​కు చెందిన మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు సముద్ర మార్గంలో ముంబయిలోకి ప్రవేశించి పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో సుమారు 166 ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గాయపడ్డారు. వీరిలో 18 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు. ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థికసాయం సహా అనేక కేసుల్లో హఫీజ్‌ సయీద్‌ను దోషిగా తేల్చిన ఉగ్రవాద వ్యతిరేక కోర్టులు, ఆయనకు 31ఏళ్ల జైలుశిక్ష విధించాయి. ప్రస్తుతం లాహోర్‌ జైల్లో ఉన్నాడు. ఐక్యరాజ్యసమితి 2008 డిసెంబర్ 10న హఫీజ్ సయీద్ పేరును అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది.

ఈసీ ఆఫీస్​ బయట బాంబ్​ బ్లాస్ట్​!
మరోవైపు బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌ నుష్కీ జిల్లాలోని పాకిస్థాన్​ ఎన్నికల సంఘం-ఈసీ కార్యాలయం ఎదుట ఆదివారం పేలుడు సంభవించింది. కార్యాలయం గేటు ఎదుట పేలుడు పదార్థం పేలినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. దీనిపై విచారణ కొనసాగుతోంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశంలో ఎక్కడోఒక్క దగ్గర తరచూ ఇలాంటి ఉదంతాలు వెలుగుచూస్తునే ఉండడం గమనార్హం.

రష్యా ఆక్రమిత ప్రాంతంలో భీకర దాడి - 28 మంది మృతి

'ట్రంప్‌నకు ఓటమి తప్పదు'- అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో బైడెన్‌కు తొలి విజయం

Last Updated : Feb 5, 2024, 7:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.