ETV Bharat / international

ట్రంప్‌ గెలుపు కోసం ఎలాన్‌ మస్క్‌ తెగింపు! 5 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశమున్నా డోంట్‌ కేర్‌! - ELON MUSK SUPPORT TO TRUMP

రసవత్తరంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు - ట్రంప్ గెలుపు కోసం మస్క్ ఆరాటం - ప్రతి రోజూ లక్కీ డ్రాలో ఎంపికైన ఓటర్‌కు ఒక మిలియన్‌ డాలర్లు

Elon Musk and Trump
Elon Musk and Trump (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 26, 2024, 8:57 PM IST

Elon Musk Support To Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం కోసం న్యాయశాఖ హెచ్చరికలను సైతం టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ లెక్కచేయడం లేదు. ట్రంప్‌నకు అనుకూలంగా ఓటర్లను మార్చేందుకు మస్క్ ఇస్తున్న తాయిలాలు, ఫెడరల్ ఎన్నికల చట్టాల ఉల్లంఘనల కిందకు వస్తాయని న్యాయశాఖ హెచ్చరించింది. అయినా పట్టించుకోని మస్క్‌ మరికొందరు ఓటర్లకు మిలియన్‌ డాలర్ల సొమ్ము అందించారు. ఈ నేపథ్యంలో న్యాయశాఖ తదుపరి చర్యలేమిటనేది ఆసక్తి కలిగిస్తోంది.

ట్రంప్ గెలుపు కోసం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ పేరు మార్మోగుతోంది. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ గెలుపు కోసం మస్క్‌ తీవ్రంగా కష్టపడుతున్నారు. కేవలం మద్దతుకే పరిమితం కాకుండా ప్రచారాలు నిర్వహిస్తూ, క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రచారాలతో పాటు ట్రంప్ విజయం కోసం పెద్ద మొత్తంలో విరాళాలు అందజేస్తున్నారు. స్వింగ్‌ రాష్ట్రాల్లో ప్రతి రోజూ లక్కీ డ్రాలో ఎంపికైన నమోదిత ఓటర్‌కు ఒక మిలియన్‌ డాలర్లు మేర అందిస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. నగదు ప్రోత్సహకాలు ఇవ్వడంపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించినా అమెరికా న్యాయశాఖ, ఇవి ఫెడరల్ ఎన్నికల చట్టాల ఉల్లంఘనల కిందకు వస్తాయని హెచ్చరించింది. న్యాయశాఖ మాటలను పెడచెవిన పెట్టిన మస్క్‌, మళ్లీ డబ్బు పంచినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. న్యాయశాఖ హెచ్చరికలతో బుధవారం నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడాన్ని మస్క్‌ ప్రచార బృందం అమెరికా పీఏసీ తాత్కాలికంగా నిలివేసింది. కానీ మళ్లీ గురువారం నుంచి తిరిగి నగదు ప్రోత్సహకాలు ఇవ్వడం ప్రారంభించినట్లు అంతర్జాతీయ కథనాలు రాసుకొచ్చాయి. గురువారం విస్కాన్ సిన్‌, మిషిగన్‌ రాష్ట్రాల్లో తీసిన లక్కీడ్రాలో ఎంపికైన ఇద్దరు ఓటర్లకు చెరో మిలియన్‌ డాలర్ల చెక్కును అమెరికా పీఏసీ అందించినట్లు సదరు కథనాలు వెల్లడించాయి.

5 ఏళ్లు జైలు శిక్ష
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ను గెలిపించేందుకు మస్క్‌ అమెరికా పీఏసీ ప్రచార బృందాన్ని ఏర్పాటు చేశారు. అమెరికాలో వాక్‌ స్వాతంత్య్రం, తుపాకీ హక్కులపై అమెరికా పీఏసీ ఓ పిటిషన్‌ను రూపొందించింది. స్వింగ్‌ రాష్ట్రాల్లో ఈ పిటిషన్‌పై సంతకం చేసిన ప్రతి నమోదిత ఓటరుకు 47 డాలర్లను ఇవ్వనున్నట్లు పీఏసీ ప్రచార బృందం తెలిపింది. అంతేకాకుండా స్వింగ్‌ రాష్ట్రాల్లో నమోదిత ఓటర్ల నుంచి ప్రతి రోజూ లక్కీ డ్రా తీసి ఎంపికైన ఓటర్‌కు ఒక మిలియన్‌ డాలర్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. శనివారం నుంచి ఈ లక్కీ డ్రా ప్రారంభమైంది. ఇప్పటివరకు పెన్సిల్వేనియా రాష్ట్రంలో ముగ్గురికి, నార్త్‌ కరోలినా రాష్ట్రంలో ఒక ఓటర్‌కు మిలియన్‌ డాలర్ల చొప్పున చెక్కులను అందజేశారు. ప్రస్తుతం మస్క్‌ ఇస్తోన్న నగదు ప్రోత్సహకాలపై అమెరికా న్యాయ శాఖ విభాగం దర్యాప్తు చేస్తోంది. డబ్బులు ఇవ్వడం ఫెడరల్ ఎన్నికల చట్టాల ఉల్లంఘనల కిందకు వస్తాయని, ఇప్పటికే మస్క్‌ ప్రచార బృందం అమెరికా పీఏసీకి న్యాయశాఖ హెచ్చరిక లేఖ పంపింది. ఇది చట్టవిరుద్ధమని తేలితే మస్క్‌కు ఐదేళ్లు జైలు శిక్ష పడొచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

కమల హారిస్‌కు విరాళాల వెల్లువ
ట్రంప్ తరఫున ప్రచార కార్యక్రమాల నిర్వహణ కోసం మస్క్‌ ఇప్పటి వరకు రూ.1100 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. అటు డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమల హారిస్‌కు కూడా ప్రముఖల నుంచి భారీ మొత్తంలో విరాళాలు అందుతున్నాయి. కమలకు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ రహస్యంగా మద్దతిస్తున్నట్టు తెలుస్తోంది. కమల హారిస్‌ కోసం నిధులు సేకరిస్తున్న ఫ్యూచర్‌ ఫార్వర్డ్ ఎన్జీవో సంస్థకు బిల్‌ గేట్స్‌ 50 మిలియన్‌ డాలర్లు అంటే రూ.420 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు న్యూయార్క్ టైమ్స్ సహా పలు వార్తా పత్రికలు పేర్కొన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.