ETV Bharat / international

అమెజాన్‌ ప్రాంతంలో తీవ్రమైన కరవు- బిక్కుబిక్కుమంటూ ప్రజల జీవనం! - Drought Impact In Brazil - DROUGHT IMPACT IN BRAZIL

Drought Impact In Brazil : బ్రెజిల్‌లోని అమెజాన్‌ అటవీ పరిసర ప్రాంతాల్లో ఎన్నడూ లేనంత కరవు పరిస్థితులను అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్నారు. దేశంలోని సుమారు 59శాతం మంది ప్రజలు ఒత్తిడితో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. అమెజాన్ నదీ తీర ప్రాంతంలో కరవు తీవ్రత మరీ ఎక్కువుగా ఉంది. అక్కడ ప్రజలు నిత్యవసర సరుకులు , ఔషధాలకోసం ఎండిపోయి నదిలో గంటలకొద్దీ ఎదురీదుతూ జీవన ప్రయాణం సాగిస్తున్నారు.

Drought Impact In Brazil
Drought Impact In Brazil (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2024, 9:03 PM IST

Drought Impact In Brazil : బ్రెజిల్‌లోని అమెజాన్ నదీ తీర ప్రాంతంలో తీవ్రమైన కరవు నెలకొంది. పెద్దగా రోడ్డు కనెక్టివిటీ లేని కోరి నగర ప్రాంతానికి సమీపంలో డజన్లకొద్ది తెగల ప్రజలు కరవులో చిక్కుకున్నారు. ఈ నగర ప్రజలు త్రాగునీరు, ఆహారం, ఔషదాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు కారణంగా నదిలోని నీటి మట్టం ప్రమాదకర స్థాయిలో తగ్గినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. నది ఎండిపోవడంతో ప్రజలు నిత్యవసర సరుకులను తెచ్చుకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వేగవంతమైన అమెజాన్‌ అటవీ నిర్మూలన కారణంగా వాతావరణ మార్పులు చెంది ఉష్ణోగ్రతలు పెరిగి మరింత హాని కలిగిస్తుందని తెలిపారు.

అమెజన్‌ అటవీ పరిసర ప్రాంత రైతులు వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టే క్రమంలో అవి అడవులకు వ్యాపించి వేల ఎకరాలు కాలిపోతున్నాయి. మానవ సంబంధిత చర్యల కారణంగా ఒక్క 2010 ఏడాదిలోనే లక్షా 60 వేల ఫైర్స్‌ బ్రెజిల్‌లో రిజిష్టర్‌ అయ్యాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా అప్పటి నుంచి బ్రెజిల్‌లో ఇటలీదేశ విస్తీర్ణమంత ప్రాంతం కాలిబుడిదైంది. నదుల్లో నీరు ఎండి, బురదలో ప్రయాణించడం చాలా కష్టమవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండించిన కూరగాయలు, ఇతర సరుకులను నగర ప్రాంతాలకు తరలించేందుకు వేకవజామున లేచి వెళ్లాల్సిన పరిస్థితి వస్తోందని రైతులు చెబుతున్నారు.

వాయు కాలుష్యంతో అల్లాడుతున్న నగరం
బ్రెజిల్‌లో అతిపెద్ద నగరమైన సావో పాలోలో పిన్‌హీరోస్ నది రంగు అకస్మాత్తుగా మారిపోయింది. నీలి రంగు నుంచి బూడిద రంగు సంతరించుకుంది. తీవ్రమైన కరువు నేఫథ్యంలో నీటి మట్టాలు క్షీణిస్తున్నాయి. అడవుల్లో మంటలు చెలరేగుతున్న కారణంగా పొగలు నగరవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. దీంతో నగరంలో గాలి కలుషితంగా మారింది. వాయు కాలుష్యంపై పౌరుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

స్విస్ ఎయిర్ టెక్నాలజీ కంపెనీ 'ఐక్యూ ఎయిర్' కీలక విషయాలు వెల్లడించింది. సావో పాలో రాష్ట్రం ప్రపంచంలోనే రెండో కలుషిత రాష్ట్రంగా రికార్డుల్లోకి ఎక్కిందని తెలిపింది. పొగ కారణంగా 2 కోట్లమందిపై ప్రభావం పడిందని వెల్లడించింది. గాలి కాలుష్యం నేపథ్యంలో ప్రజలు బయటకు రావద్దని ప్రభుత్వం కోరింది. ఇంటి తలుపులు, కిటికీలు మూసేయాలని సూచించింది.

బ్రెజిల్​లో​ కార్చిచ్చుల బీభత్సం- వేలాది ఎకరాల అమెజాన్​ అటవీప్రాంతం అగ్నికి ఆహుతి

Brazil Floods 2023 : భారీ వరదలు.. 31 మంది మృతి.. జలదిగ్బంధంలో 60 నగరాలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.