America Cellular Outage : అమెరికాలో టెలికాం సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఏటీ&టీ, వెరిజోన్, టీ-మొబైల్‌తో పాటు ఇతర మొబైల్ నెట్‌వర్క్‌లలో కనెక్టివిటీ సమస్య తలెత్తినట్లు డౌన్‌డిటెక్టర్ అనే నెట్‌వర్క్ ట్రాకింగ్ సైట్ వెల్లడించింది. అనేక గంటల పాటు ఈ సమస్య కొనసాగింది. షికాగో, లాస్ ఏంజిల్స్, న్యూయార్క్ సిటీ, శాన్‌ఫ్రాన్సిస్కో, హూస్టన్, బ్రూక్లిన్ ప్రాంతాల్లోని వినియోగదారులు గురువారం తెల్లవారుజామున సిగ్నల్ సమస్య ఎదుర్కొన్నట్లు సమాచారం. ఒకే సమయంలో ఈ నెట్‌వర్క్‌లన్నింటిలో సమస్య తలెత్తడం చర్చనీయాంశంగా మారింది. గురువారం మధ్యాహ్నానికి సమస్యను పరిష్కరించినట్లు ఏటీ&టీ తన వెబ్సైట్ ద్వారా ప్రకటించింది. సేవల్లో అంతరాయానికి చింతిస్తున్నట్లు తెలిపింది.
ఒక్క ఏటీ&టీ కస్టమర్ల నుంచే 31వేల ఫిర్యాదులు వచ్చినట్లు డౌన్‌డిటెక్టర్ వెల్లడించింది. వెరిజోన్‌కు వెయ్యికి పైగా ఫిర్యాదులు రాగా, టీ-మొబైల్‌కు చెందిన వినియోగదారుల నుంచి భారీ సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది. ఒక్క ఏటీ&టీ కస్టమర్ల నుంచే 73వేల ఫిర్యాదులు వచ్చినట్లు డౌన్‌డిటెక్టర్ వెల్లడించింది. వెరిజోన్‌కు నాలుగువేలకు పైగా ఫిర్యాదులు రాగా టీ-మొబైల్‌కు చెందిన వినియోగదారుల నుంచి 1,800 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది. బూస్ట్ మొబైల్ 700 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొంది. అత్యవసర సేవల కోసం (911) ప్రయత్నించే వారిపైనా దీని ప్రభావం పడినట్లు శాన్‌ఫ్రాన్సిస్కో ఫైర్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. అయితే, ఈ భారీ అంతరాయానికి గల కారణాలు మాత్రం వెల్లడి కావాల్సి ఉంది. సైబర్ దాడిపై అనుమానం వ్యక్తంచేస్తూ అనేకమంది సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
పాకిస్థాన్‌లో టెలికాం సేవలకు అంతరాయం
కొంతకాలం క్రితం పాకిస్థాన్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. పాకిస్థాన్‌లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగింది. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌తో సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ఆప్టిక్ ఫైబర్ నెట్‌వర్క్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. ఆప్టిక్ ఫైబర్ నెట్‌వర్క్‌లో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయని, వాటిని పరిష్కరించామని అధికారులు పేర్కొన్నారు. ఇస్లామాబాద్, లాహోర్ పట్టణాల్లో ఇంటర్నెట్ ఆగిపోవడం వల్ల బ్యాంక్‌లు, ఆన్లైన్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పాకిస్థాన్‌లో 3జీ నెట్‌వర్క్‌లో 116 మిలియన్ల వినియోగదారులు, 4జీ నెట్‌వర్క్‌కు 119 మిలియన్ల వినియోగదారులు ఉన్నారని పాకిస్థాన్ టెలికాం అథారిటీ తెలిపింది. పూర్తి వార్తను చదివేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
మాల్దీవుల్లోకి ప్రవేశించిన చైనా పరిశోధక నౌక- ఆందోళన వ్యక్తం చేసిన ఇండియన్ నేవీ