ETV Bharat / international

అమెరికా 9/11 దాడుల కీలక సూత్రధారి నేరాంగీకారం- జీవిత ఖైదు పడే అవకాశం - September 11 attacks

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 1, 2024, 9:45 AM IST

America 9/11 Attacks : అమెరికాలో విషాదం నింపిన 9/11 దాడుల కేసులో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉగ్రవాది ఖలీద్ షేక్ మహ్మద్‌ తన నేరాన్ని ఒప్పుకునేందుకు అంగీకరించినట్లు ఆ దేశ రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ ప్రకటించింది. అలాగే అతడి ఇద్దరు సహచరులు నేరాంగీకారానికి ఒప్పుకున్నట్లు తెలిపింది.

America 9/11 Attacks
America 9/11 Attacks (ANI)

America 9/11 Attacks : అమెరికాలో 2001 సెప్టెంబరు 11న జంట భవనాలపై దాడులకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక ఉగ్రవాది ఖలీద్ షేక్ మహ్మద్‌ తన నేరాన్ని ఒప్పుకునేందుకు అంగీకరించినట్లు అమెరికా రక్షణశాఖ కార్యాలయం పెంటగాన్‌ వెల్లడించింది. ఖలీద్ షేక్ మహ్మద్ మరో ఇద్దరు సహచరులు వాలిద్ బిన్ అట్టాశ్, ముస్తఫా అల్-హవ్సావి కూడా నేరాంగీకారానికి ముందుకు వచ్చినట్లు ప్రకటించింది. ప్రస్తుతం వీరంతా క్యూబాలోని గ్వాంటనామో అమెరికా సైనిక జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

జీవిత ఖైదు పడే అవకాశం
ఇరు పక్షాల మధ్య కుదిరిన ఒప్పంద వివరాలను మాత్రం పెంటగాన్‌ వెల్లడించలేదు. అయితే, నిందితులు సుదీర్ఘకాలంగా మరణశిక్ష ముప్పును తప్పించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. దానికి సమ్మతిస్తేనే నేరాంగీకారానికి ముందుకు వస్తామని వారు షరతు విధించినట్లు సమాచారం. దీనికి అమెరికా అంగీకరించిన తర్వాతే తప్పును ఒప్పుకునేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. వారికి జీవితఖైదు పడే అవకాశం ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కీలక అధికారి ఒకరు తెలిపారు.

జంట దాడులకు 3000 మంది బలి
అగ్రరాజ్యం అమెరికాలో 2001 సెప్టెంబరు 11న జంట భవనాలపై అల్‌ ఖైదా ఉగ్రదాడికి పాల్పడింది. మ్యాన్‌హాటన్​లో ట్విన్‌ టవర్స్​గా పిలుచుకునే ప్రపంచ వాణిజ్య సంస్థ భవంతులను నిమిషాల వ్యవధిలో కూల్చేశారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో దాదాపు 3,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే వేలాది మంది గాయపడ్డారు. ఈ దాడి అగ్రరాజ్యం అమెరికాను కుదిపేసింది. ఒక్క అమెరికాయే కాదు ప్ర‌పంచ దేశాల‌న్నీ ఒక్క‌సారిగా ఈ ఘ‌ట‌న‌తో ఉలిక్కిప‌డ్డాయి. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఉగ్రచర్యగా పేర్కొనే ఈ దాడులు ప్రపంచాన్నే విస్మయానికి గురిచేశాయి.

ఖలీద్ షేక్​ను కీలక సూత్రదారిగా తేల్చిన అమెరికా
జంట భవనాలపై జరిపిన దాడుల్లో ఖలీద్ షేక్ మహ్మద్​ను కీలక సూత్రధారిగా అమెరికా తేల్చింది. ఆ తర్వాత పశ్చిమాసియాలో ఉన్న అనేక తీవ్రవాద సంస్థలపై అమెరికా దాడులు చేసింది. ఈ పరిణామం పశ్చిమాసియా దేశాల స్థితినే మార్చేసింది. అమెరికా సైతం అనేక విషయాల్లో కీలక మార్పులు, సంస్కరణలు చేపట్టింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.