ETV Bharat / health

మద్యపానం కాకుండా కాలేయం దెబ్బతినడానికి కారణాలేంటి? లివర్ పాడైతే ఏం జరుగుతుంది? - Liver Damage Reasons - LIVER DAMAGE REASONS

World Liver Day 2024 : కాలేయం దెబ్బతినడానికి మద్యపానం, ధూమపానం కారణం! ఇవే కాకుండా లివర్ ఆరోగ్యాన్ని పాడు చేసేవి ఏంటి? కాలేయ ఆరోగ్యం దెబ్బతింటే ఏం అవుతుంది?

World Liver Day 2024
World Liver Day 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 19, 2024, 5:06 AM IST

World Liver Day 2024 : మానవ శరీరంలో చర్మం తర్వాత అతి పెద్ద అవయవం కాలేయం. ప్రొటీన్ల జీర్ణక్రియ, ఖనిజాల నిల్వ, పిత్త ఉత్పత్తి, రక్తాన్ని వడకట్టడం లాంటి దాదాపు 500 కంటే ఎక్కువ విధులను లివర్ నిర్వహిస్తుంది. అంటే మనిషి పూర్తి ఆరోగ్యంగా ఉండాలంటే కాలేయం ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. అలాంటి లివర్ పనితీరు ఎలా ఉంది? ఆరోగ్యంగానే ఉందా? అనే విషయాలను మనం అంత సులభంగా గుర్తించలేకపోవడం దురదృష్టకరమనే చెప్పుకోవాలి. నిజానికి లివర్ పాడవటానికి కేవలం మద్యపానం, ధూమపానం మాత్రమే అనుకుంటే మనం పొరపాటు పడ్డట్లేనట. ఇవి కాకుండా కాలేయాన్ని దెబ్బతీసే అంశాలేంటి? లివర్ ఆరోగ్యం దెబ్బతింటే ఏం జరుగుతుంది? ఏప్రిల్ 19వ తేదీ ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా మీకోసం ప్రత్యేక కథనం.

కాలేయం దెబ్బతినడానికి కారణాలు ఏంటి?
సాధారణంగా కాలేయం దెబ్బతినడానికి మద్యపానం, ధూమపానం కారణమవుతాయి. నిజమే కానీ ఈ అలవాట్లు లేని వారిలో కూడా లివర్ సమస్యలు వస్తుంటాయి. మరి దీనికి కారణమేంటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు తినే ఆహారం, తాగే నీరే! మీరు నమ్మలేకపోయినా ఇది వాస్తవం. మనం తినే ఆహార పదార్థాలు, తాగే నీరు కూడా కాలేయం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని చాలా అధ్యయనాలు నిరూపించాయి. ప్రస్తుత జీవన విధానంలో ఏది పడితే అది తింటూ పొట్టను చెత్త కుప్పలా మార్చుకుంటున్నాం. కలుషితమైన నీటిని తాగుతున్నాం. ఇలా మనకు తెలియకుండానే మన కాలేయ ఆరోగ్యం దెబ్బతింటుంది.

ఇవే కాకుండా హెపటైటిస్ ఎ, హెపటైటిస్ బి, పటైటిస్ సి వైరల్ ఇన్ఫెక్షన్లు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, జన్యుపరమైన సమస్యలతో వారసత్వంగా వచ్చే ల్సన్ వ్యాధి, హిమోక్రోమాటోసిస్ వంటి వాటి వల్ల కూడా కాలేయ వ్యాధులు వస్తాయి. అంతేకాదు కొన్నిసందర్భాల్లో కాలేయంలో అసాధారణ కణాలు పెరిగి కణితులుగా మారి లివర్ క్యాన్సర్ రావచ్చు. శరీరంలో ఊబకాయం, మధుమేహం పెరిగితే కూడా కాలేయ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతుంటారు.

లివర్ పాడైపోతే ఏం జరుగుతుంది?

  • కాలేయం దెబ్బతింటే పొత్తి కడపులో నొప్పి కలుగుతుంది. ముఖ్యంగా కుడి వైపున ఈ నొప్పి వస్తుంది.
  • మూత్రం, మలం రంగు మారుతుంది
  • ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం
  • అలసట, బలహీనత
  • లిబిడో స్థాయిలు తగ్గడం
  • చర్మం, కళ్లు పచ్చ రంగులోకి మారడం
  • రక్తపు వాంతులు, వికారం
  • కాలేయం క్యాన్సర్
  • టైప్-2 డయాబెటీస్
  • చీలమండలం వాపు

ఇన్ని రకాల సమస్యలు దారితీసేది, మనకు ప్రాణాధారమైనది లివర్. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, అవసరం మనకు ఉన్నాయి. ఇందుకు మనం చేయాల్సిందల్లా మద్యపానం, ధూమపానంతో పాటుగా కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం. ముఖ్యంగా బయట తినడం తగ్గించాల్సి ఉంటుంది. పాస్తా, పిజ్జా, బిస్కెట్లు, బ్రెడ్ వంటి పిండితో చేసిన ఆహార పదార్థాలు రక్తంలో చర్కెర స్థాయిని పెంచుతాయి. అలాగే మిఠాయిలు, కుకీస్, సోడాలు వంటి శుద్ధ చేసిన చక్కెర పదార్థాలు, ఫ్రక్టోస్ అధికంగా ఉండే సిరప్ లకు దూరంగా ఉంటాయి. ఇవి కాలేయ వ్యాధికి దారితీసే కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతాయి. రెడ్ మీట్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కూడా కాలేయానికి మంచివి కాదు. ఇవి జీర్ణం కావడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంతేకాదు శరీరంలో చెడు కొవ్వు పెరిగి కాలేయంతో పాటు గుండె ఆరోగ్యం దెబ్బతినడానికి ఇవి కారణమవుతాయి. వీటికి బదులుగా ఖనిజాలు, ఫైబర్, విటమిన్లు, ఆరోగ్యకరమైన ప్రొటీన్లు కలిగిన ఆహారాలను తినాలి. రోజూ కాసేపు నడక, వ్యాయామం, యోగా లాంటివి అలవాటు చేసుకోవాలి.

మీ లివర్ ప్రమాదంలో పడిందా? - ఈ ఫుడ్స్ తినండి - వెంటనే క్లీన్ అవుతుంది!

అతిగా మద్యం సేవిస్తున్నారా? అయితే మీ లివర్ డేంజర్​లో​ ఉన్నట్లే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.