ETV Bharat / health

అధిక వ్యాయామంతో గుండెపోటు!- ఈ లక్షణాలు కనిపిస్తే డేంజరే - HEART ATTACK SYMPTOMS

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 30, 2024, 3:23 PM IST

HEART ATTACK SYMPTOMS : వ్యాయామంతో గుండె సంబంధిత వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చు. కానీ, అదే వ్యాయామం గుండెపోటుకు దారితీసే అవకాశాలు కూడా లేకపోలేదని నిపుణులు పేర్కొంటున్నారు. అధిక వ్యాయామం, అలవాటు లేని వ్యక్తులు ప్రారంభంలోనే అధిక వ్యాయామం చేస్తే ప్రమాదం ముప్పు పొంచి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఆ లక్షణాలు ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే.

heart_attack_symptoms
heart_attack_symptoms (ETV Bharat)

HEART ATTACK SYMPTOMS : వ్యాయామంతో గుండె సంబంధిత వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చు. కానీ, అదే వ్యాయామం గుండెపోటుకు దారితీసే అవకాశాలు కూడా లేకపోలేదని నిపుణులు పేర్కొంటున్నారు. అధిక వ్యాయామం లేదా అలవాటు లేని వ్యక్తులు ప్రారంభంలోనే అధిక వ్యాయామం చేస్తే ప్రమాదం ముప్పు పొంచి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఆ లక్షణాలు ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే.

ఇటీవల గుండె సంబంధిత మరణాలు అధికంగా కనిపిస్తున్నాయి. చిన్నవయసు వారితో పాటు మహిళలు సైతం గుండెపోటుతో కన్నుమూయడం ఆందోళన కలిగిస్తోంది. చాలా మంది ఏదైనా పని చేస్తున్న సమయంలో గుండెపోటుకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో కన్నడ సినీ హీరో పునీత్ రాజ్​కుమార్, ఆంధ్రప్రదేశ్​ ఎంపీ మేకపాటి గౌతమ్.. వీరిద్దరూ వ్యాయామం చేస్తున్న సమయంలో కార్డియాక్​ అరెస్టు కారణంగా కన్నుమూశారు. ఆటల సమయంలోనో లేదంటే డాన్స్​ చేస్తూనో మరికొందరు హఠాత్తుగా గుండెపోటుకు గురై మృతిచెందడం విదితమే.

ఆరోగ్యవంతమైన శరీరానికి శ్రమ తప్పనిసరి. అదేపనిగా తింటూ కూర్చుంటే గుండె పనితీరు మందగిస్తుంది. వ్యాయామం లేని జీవనశైలి గుండె సమస్యలకు ప్రధాన ప్రమాద కారణంగా వైద్యులు చెప్తున్నారు. ఏ రూపంలోనైనా వర్కవుట్‌లు, శారీరక శ్రమలు ఆరోగ్యకరమైన హృదయానికి అవసరం. అయితే, శరీరాన్ని ఎక్కువ ఒత్తిడికి గురిచేయడం, అధిక వ్యాయామం దీర్ఘకాలంలో సమస్యాత్మకం కావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

డయాబెటీస్ రోగులు డ్రై ఫ్రూట్స్ తింటున్నారా? - ఆ రంగు పదార్థాలకు దూరంగా ఉండాల్సిందే! - healthy food for diabetes

ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడుతున్న వారు వ్యాయామం చేయడం అంత మంచిది కాదని వైద్యులు చెప్తున్నారు. కొత్తగా వ్యాయామం చేస్తుంటే ప్రతికూల ప్రభావాలను నివారించడానికి నెమ్మదిగా ప్రారంభించాలని సూచిస్తున్నారు.

తేలికపాటి అసౌకర్యం, ఒత్తిడి, ఛాతీ మధ్యలో నొప్పిగా ఉన్నట్లు అనిపిస్తే వెంటనే వ్యాయామం, లేదా చేస్తున్న పనికి దూరంగా ఉండాలి. అసాధారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్నా, ఛాతీలో అసౌకర్యంగా ఉన్నా అది గుండెపోటుకు దారితీసే ప్రమాదం ఉంటుంది. ఛాతీ నొప్పికి ముందుగానే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని గమనించవచ్చు.

వ్యాయామం చేస్తున్నప్పుడు తల తిరగడం తీవ్రమైన హెచ్చరికగా భావించాలి. వెంటనే వ్యాయామం చేయడం మానేయాలి

గుండె వేగంగా కొట్టుకోవడం, దడ గుండె సంబంధిత సమస్యను సూచిస్తుంది. వ్యాయామ సమయంలో గుండె ప్రతిస్పందనకు అనుగుణంగా వ్యవహరించాలి. వ్యాయామం చేస్తున్నపుడు చెమట రావడం సర్వ సాధారణం. కానీ, వికారంగా అనిపించడం, చల్లని చెమటలు గుండె ప్రమాదంలో ఉందని హెచ్చరికలు జారీ చేస్తాయి. వ్యాయామంలో శ్వాస, గుండె సంబంధ సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అత్యవసర ఫోన్ నంబర్లకు కాల్ చేయాలి. నిమిషాల వ్యవధి (గరిష్టంగా 5 నిమిషాలు) లోనే అత్యవసర సేవలకు కాల్ చేయాలని "అమెరికన్ హార్ట్ అసోసియేషన్" సూచించింది.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

సంపూర్ణ ఆరోగ్యానికి ఇదొక్కటి చాలు- అత్యంత చవకైన దివ్యౌషధం - Perfect medicine for health

షుగర్ బాధితులకు - ఈ పండ్లు అమృతంతో సమానం! - Best Fruits for Diabetic Patients

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.