Which Fruits Contains the Most Sugar? : భోజనం తక్కువగా తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. అనారోగ్యం పాలవుతారు. అలాగని ఎక్కువ తీసుకుంటే కొలెస్ట్రాల్ నుంచి గుండెజబ్బుల వరకు ఎన్నో చుట్టు ముడతాయి. అనారోగ్యం పాలవుతారు. హద్దు మీరితే ఏదైనా ఇబ్బందే! ఇది పండ్లకు సైతం వర్తిస్తుందని చెబుతున్నారు నిపుణులు. షుగర్ కంటెంట్ ఎక్కువగా ఫ్రూట్స్ తింటే.. ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. అందుకే.. ఏ పండ్లలో ఎంత షుగర్ ఉంటుందో చూద్దాం.
అవకాడో : ఈ పండు 100 గ్రాములకు 0.7 గ్రాముల చక్కెరను కలిగి ఉంటుంది. ఇది తక్కువ మొత్తంలో చక్కెర కలిగిన పండు.
బ్లూ బెర్రీస్ : ఈ పండ్లలో కూడా షుగర్ పర్సంటేజ్ తక్కువ. 100 గ్రాముల బ్లూ బెర్రీస్‌లలో 4 గ్రాముల చక్కెర ఉంటుంది.
బెర్రీలు : వీటిని రెడ్ ఫ్రూట్స్ అని కూడా అంటారు. ఈ పండ్లలో స్ట్రాబెర్రీలు 100 గ్రాములకి 7 గ్రాముల చక్కెర, రాస్బెర్రీస్ 5 గ్రాములను కలిగి ఉంటాయి.
జామ : షుగర్ లెవల్స్ తక్కువగా ఉండే మరో పండు జామ. ఈ పండ్లు 100 గ్రాముల బరువునకు 5 గ్రాముల చక్కెరను అందిస్తాయి.
నిమ్మకాయ : ఈ సిట్రస్ పండులో 100 గ్రాములకు 2.5 గ్రాముల చక్కెర ఉంటుంది.
మాండరిన్ : ఇది ఒక రకమైన నారింజ పండు. ఇవి 100 గ్రాములకి సుమారు 10 గ్రాముల చక్కెరను కలిగి ఉంటాయి.
పుచ్చకాయ : దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే. ఈ పండును 100 గ్రాములు తీసుకుంటే 6 గ్రాముల చక్కెర లభిస్తుంది.
నీరసం తగ్గి రోజంతా యాక్టివ్‌గా ఉండాలా? - అయితే ఈ ఫ్రూట్స్ తినాల్సిందే!
ఎక్కువ షుగర్ కంటెంట్ ఉన్న పండ్లు :
మామిడి : పండ్లలో రారాజు అయిన మామిడిలో షుగర్ లెవల్స్ ఎక్కువే. 100 గ్రాముల మామిడి పండులో 14.8 గ్రాముల చక్కెర ఉంటుంది. జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అనే అధ్యయనంలో కూడా 100 గ్రాముల మామిడిలో 13.9 గ్రాముల చక్కెర ఉందని కనుగొన్నారు.
అరటి : ఈ పండులో చక్కెర లెవల్స్ దాని జీవితకాలం ప్రకారం మారుతుంది. ఒక సాధారణ అరటిపండులో 17 గ్రాముల చక్కెర ఉంటుంది. అదే పండిన పండు అయితే 20 గ్రాముల చక్కెరకు సమానం.
ద్రాక్ష : ఈ క్లస్టర్డ్ ఫ్రూట్‌ను 100 గ్రాములు తీసుకుంటే 20 గ్రాముల చక్కెర లభిస్తుంది.
చెర్రీస్ : వీటిలో 100 గ్రాములకు 12.82 గ్రాముల చక్కెర ఉంటుంది.
డేట్స్ : చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. కానీ, వీటిలో షుగర్ లెవల్స్ ఎక్కువ. ప్రతి 100 గ్రాములకు 63.35 గ్రాముల చక్కెర లభిస్తుంది.
అంజీర్ : ఈ పండులో 100 గ్రాములకి 16.26 గ్రాముల చక్కెర ఉంటుంది.
ఆరెంజ్ : 100 గ్రాముల నారింజలో సుమారు 9.35 గ్రాముల చక్కెర ఉంటుంది.
పైనాపిల్ : ఇందులో చక్కెర శాతం 100 గ్రాములకి 10 గ్రాములు ఉంటుంది.
అమెరికన్ డైటెటిక్ అసోసియేషన్ అనే జర్నల్ 2002లో 38 రకాల పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్(GI)ను అంచనా వేసింది. GI అంటే.. రక్తంలో చక్కెర స్థాయిలను మనం తినే ఆహారం ఎంత వేగంగా పెంచుతుందో కొలిచే ఒక సూచిక. ఈ అధ్యయనం ప్రకారం.. ద్రాక్ష, అరటి వంటి పండ్లలో ఎక్కువ GI ఉందని, బెర్రీలు, ఆపిల్, నారింజ వంటి పండ్లలో తక్కువ GI ఉందని కనుగొంది.
How to Remove Pesticides from Fruits : పండ్లు, కూరగాయలపై ఉన్న పురుగు మందులు ఇలా తొలగించండి!