ETV Bharat / health

విటమిన్స్ డెఫిషియన్సీతో ఇబ్బంది పడుతున్నారా?- అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..! - IMMUNITY BOOSTING VITAMINS - IMMUNITY BOOSTING VITAMINS

Vitamins : విటమిన్లు మన శరీరానికి అత్యంత ఆవశ్యకమైన పోషకాలను అందిస్తాయి. వీటిని తక్కువ మోతాదులో తీసుకున్నప్పటికీ ఎక్కువ ప్రయోజనాలు అందిస్తాయంటున్నారు నిపుణులు. జీవక్రియలు సక్రమంగా జరగడానికి తోడ్పడటమే కాకుండా, పలు రకాల వ్యాధుల బారి నుంచి కూడా కాపాడతాయంటున్నారు. ఆ వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Vitamins
Vitamins (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : Sep 25, 2024, 2:49 PM IST

Vitamins : రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వ్యక్తి వివిధ రకాల వ్యాధులు, అనారోగ్యాల బారిన పడకుండా ఉంటాడు. మన శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటే వైరస్‌, బ్యాక్టీరియాలు మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపలేవంటున్నారు నిపుణులు. అయితే రోగనిరోధక శక్తి దృఢంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం చాలా కీలకమని చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని విటమిన్లు ఉండే ఆహార పదార్థాల్ని రోజూ తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఆయా విటమిన్ల లోపం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

విటమిన్‌ 'సి'
మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్‌ 'సి' కీలక పాత్ర పోషిస్తుందటున్నారు నిపుణులు. ఈ విటమిన్‌ లోపం ఉన్న వాళ్లు త్వరగా జబ్బు పడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అందుకే మనం రోజూ తినే ఆహారంలో విటమిన్‌ 'సి' పుష్కలంగా లభించే కమలాఫలంతో పాటుగా నిమ్మకాయ వంటి నిమ్మజాతి పండ్లను భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే క్యాప్సికం, పాలకూర వంటివి కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు.

విటమిన్‌ 'సి' లోపం వల్ల కనిపించే లక్షణాలు : విటమిన్ 'సీ'లోపం వల్ల శరీరం అలసటగా ఉంటం, శ్వాస ఆడకపోవటం, పాలిపోయిన చర్మం, ఐరన్‌ లోపం ఉండటం, కీళ్లనొప్పులు లాంటి సమస్యలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు. అలాగే దంత సమస్యలు, చిగుళ్ల వాపు, రక్తస్రావం లాంటి సమస్యలు కొన్ని సార్లు కనిపిస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు.

Vitamin C
Vitamin C (Getty Images)

విటమిన్‌ 'బి6'
రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో విటమిన్‌ 'బి6' సహకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎదైనా ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే విటమిన్‌ 'బి6' అధికంగా లభించే అరటిపండ్లు, చేపలు, చికెన్‌, బంగాళాదుంపలు, శెనగలు లాంటి ఆహార పదార్థాల్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

విటమిన్‌ ‘బి6’ లోపం వల్ల కనిపించే లక్షణాలు : ఫిట్సు లాంటి వ్యాధులు, అజీర్తి, రక్తహీనత, కోపం ఎక్కువగా రావడం, చర్మ వ్యాధులు, అనీమియా, మొటిమలు లాంటి సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

Vitamin B6
Vitamin B6 (Getty Images)

విటమిన్ 'ఇ'విటమిన్‌ 'ఇ'
మన శరీరంలో ఒక శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దీనిని 'బ్యూటీ విటమిన్' అని కూడా వ్యవహరిస్తారు. ఇది బ్యాక్టీరియా, వైరస్, ఇతర ఇన్ఫెక్షన్లతో సమర్థంగా పోరాడి అవి మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఆపుతుంది. అలాగే ఈ విటమిన్‌ రోగనిరోధక వ్యవస్థను పటిష్ట పరచడంలోనూ సహకరిస్తుంది. కాబట్టి ఈ విటమిన్‌ ఎక్కువగా లభించే పొద్దుతిరుగుడు గింజలు, పల్లీలు, బాదంపప్పులు, పాలకూర, నట్స్.. వంటివి రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

విటమిన్ 'ఇ' లోపం వల్ల కనిపించే లక్షణాలు : కండరాల క్షీణత, ఎర్ర రక్తకణాలు విచ్ఛిన్నమవడం, పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలల్లో రుతుస్రావం, గర్భస్రావం వంటి సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.

Vitamin E
Vitamin E (Getty Images)

విటమిన్ 'ఎ'
ఈ విటమిన్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. అలాగే విటమిన్‌ 'ఎ' కంటి ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి క్యారట్స్, తర్బూజా, గుమ్మడికాయ, సొరకాయ.. వంటి విటమిన్‌ 'ఎ' ఎక్కువగా లభించే ఆహార పదార్థాల్ని తీసుకోవడం ఉత్తమం.

విటమిన్ 'ఎ' లోపం వల్ల కనిపించే లక్షణాలు : విటమిన్ 'ఎ' లోపించడం వల్ల చర్మం పొడిబారుతుంది. కనుగుడ్లు ఎండిపోవడాన్ని 'జెరాఫ్తాల్మియా' అంటారు. కన్ను తెల్ల గుడ్డు మీద తెల్లని చారలు మచ్చల్లా కనిపిస్తాయి. వీటిని బైటాల్ చుక్కలు అంటారు. ఇవి విటమిన్ A లోపం వల్ల ఏర్పడతాయని నిపుణులు తెలుపుతున్నారు. జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ప్రతి 6 నెలలకు ఒకసారి పాఠశాల పిల్లలకు విటమిన్ Aను అందించడం ద్వారా అంధత్వాన్ని నివారించవచ్చని సిఫార్సు చేసింది. ఆ వివరాలను National Institute of Nutritionలో చూడండి

Vitamin A
Vitamin A (Getty Images)

విటమిన్‌ 'డి'
ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, ఇమ్యునోరెగ్యులేటరీ గుణాలు రోగనిరోధక వ్యవస్థ చురుగ్గా పనిచేయడానికి, దాని రక్షణకు తోడ్పడతాయి. కాబట్టి ఈ విటమిన్‌ను పొందడానికి ఉదయాన్నే లేలేత ఎండలో ఓ అరగంట పాటు ఉండాలి. అలాగే ఈ విటమిన్‌ అధికంగా లభించే చేపలు, పాలు, పప్పులు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్‌ ‘డి’ వల్ల ఎముకలు కూడా దృఢంగా మారతాయి. ప్రపంచంలో 80% మంది డి-విటమిన్ లోపంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించిన నివేదిక తెలియజేస్తుంది.

విటమిన్ 'డి' లోపం వల్ల కనిపించే లక్షణాలు : చిన్న పిల్లల్లో విటమిన్ లోపం వల్ల రికెట్స్, పక్షి లాంటి ఛాతీ, రాకిటిక్ రోజరీ అనే వ్యాధులు వస్తాయి. పెద్దవారిలో ఆస్టియోమలేసియా, ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధులు వస్తాయని పరిశోధనల్లో వెల్లడైంది.

Vitamin D
Vitamin D (Getty Images)

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

గ్రహణం మొర్రి అంటే ఏంటి?- ఎందుకు వస్తుంది?- ఎప్పుడు శస్త్రచికిత్స చేస్తే బెటర్! - Cleft Lip And Cleft Palate

నెల రోజులు సరిగ్గా నిద్రలేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయంటే! - Health Risks of Poor Sleep

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.