ETV Bharat / health

ప్రీ డయాబెటిస్ గురించి తెలిస్తే - షుగర్ రాకుండా అడ్డుకోవచ్చట! - What is Prediabetes - WHAT IS PREDIABETES

Prediabetes Diet Plan : మధుమేహం బారిన పడకుండా ఉండాలంటే ముందుగా ప్రీ డయాబెటిస్​ గురించి తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఎక్కువ మంది ఈ ప్రీ డయాబెటిస్​తో పోరాడుతున్నట్లు తెలుసుకోకపోవడంతోనే టైప్ 2 డయాబెటిస్​ బారినపడుతున్నారంటున్నారు. అసలేంటీ ప్రీ డయాబెటిస్? ఎలా గుర్తించాలి? ఎలాంటి డైట్ ప్లాన్ ఫాలో అవ్వాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

Prediabetes Diet Plan
PreDiabetes (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 12, 2024, 3:22 PM IST

What is Prediabetes in Telugu : ఈ రోజుల్లో చాలా మందిని ఇబ్బందిపెడుతున్న ఆరోగ్య సమస్య.. మధుమేహం(Diabetes). ఇది ఒక్కసారి వచ్చిందంటే లైఫ్ లాంగ్ దానితో పోరాడుతూనే ఉండాలి. అయితే 'ప్రీ డయాబెటిస్' గురించి తెలుసుకుంటే మాత్రం షుగర్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా.. ప్రీ డయాబెటిస్​ను(Prediabetes) ముందుగా గుర్తించి జీవనశైలి, ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే మధుమేహం రాకుండా అడ్డుకోవచ్చంటున్నారు. అసలు, ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి? దాన్ని ఎలా గుర్తించాలి? ఒకవేళ వస్తే ఎలాంటి డైట్ పాటించడం ద్వారా మధుమేహం రాకుండా జాగ్రత్త పడొచ్చు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటంటే?: ప్రీ డయాబెటిస్ అనేది డయాబెటిస్‌‌కి ముందు వచ్చే దశ. అంటే.. మీరు ఇంకొన్ని రోజుల్లో మధుమేహం బారిన పడబోతున్నారని తెలిపే సంకేతం. ఇది వస్తే రక్తంలో షుగర్ లెవల్స్ సాధారణం కంటే ఎక్కువ ఉంటాయంటున్నారు నిపుణులు. అలాగే.. ఈ స్టేజ్​లో ఉన్నప్పుడు డయాబెటిస్ వచ్చిందని నిర్ధారించేంతగా లక్షణాలు కనిపించవట.

ఎలా గుర్తించాలంటే?: బాడీలో ఏదైనా మార్పులు కనిపించినప్పుడు రక్త పరీక్ష చేయించుకోవడం ద్వారా ప్రీ డయాబెటిస్​ గురించి తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఎలాగంటే.. సాధారణంగా శరీరంలో Hb1ac స్థాయిలు 4% నుంచి 5.6% వరకు ఉండాలి. కానీ, అవి 5.7% నుంచి 6.4% మధ్య ఉంటే మీకు ప్రీ డయాబెటిస్ ఉందని అర్థం చేసుకోవాలంటున్నారు. అలాగే మధుమేహం వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందని గ్రహించాలంటున్నారు. అదే.. Hb1ac స్థాయిలు 6.5% లేదా అంతకంటే ఉంటే మీరు ఇప్పటికే డయాబెటిస్​ బారిన పడిపోయారని తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. అయితే.. ప్రీ డయాబెటిస్ ఉందని తెలిశాక జీవనశైలి, ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా డయాబెటిస్ బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చంటున్నారు. ఆ మార్పులేంటో ఇప్పుడు చూద్దాం.

ప్రీ డయాబెటిస్ డైట్ ప్లాన్ ఇదే..!

  • ప్రీ డయాబెటిస్ స్టేజ్​లో ఉన్నప్పుడు ప్రకృతి సిద్ధ సహజ ఆహారం తీసుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. ఇవి బాడీలోని ఇన్​ఫ్లమేషన్​ను తగ్గించడంలో సహాపడతాయట.
  • ముఖ్యంగా విటమిన్-డి తక్కువ మోతాదులోనే అవసరమైనా అది అందేలా చూసుకోవడం చాలా అవరమంటున్నారు. ఇందుకోసం ఉదయపు ఎండలో ఉండడం, చీజ్, చేపలు వంటి వాటిని డైట్​లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
  • 2013లో 'డయాబెటిస్ కేర్' అనే జర్నల్​లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. ప్రీ డయాబెటిస్ ఉన్న వ్యక్తులలో తక్కువ విటమిన్ డి స్థాయిలు ఉంటే వారిలో టైప్ 2 డయాబెటిస్‌ వేగంగా అభివృద్ధి చెందే ప్రమాదం ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో సియోల్‌లోని సెవోల్ యూనివర్సిటీకి చెందిన 'డాక్టర్. ఎం. జోహన్స్' పాల్గొన్నారు. ప్రీ డయాబెటిస్ ఉన్నప్పుడు విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉంటే మధుమేహం త్వరగా రావొచ్చని ఆయన పేర్కొన్నారు.
  • అలాగే.. కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు కూడా డయాబెటిస్ త్వరగా రాకుండా అడ్డుకోవడంలో సహాయపడతాయంటున్నారు నిపుణులు. ఇందుకోసం.. పాలు, పెరుగు, సీ ఫుడ్, కాల్షియం ఫోర్టిఫైడ్ ఫుడ్స్, నువ్వులు, బెల్లం వంటివి డైట్​లో ఉండేలా చూసుకోవాలంటున్నారు.
  • డైలీ డైట్​లో పండ్లు, కూరగాయల్లాంటి సహజ ఆహారానికి చోటివ్వాలంటున్నారు నిపుణులు. అదేవిధంగా.. వారానికి మూడుసార్లు ఆకుకూరలు తీసుకోవాలని చెబుతున్నారు.

షుగర్‌ వ్యాధికి రోజూ మందులు వాడొద్దంటే - ఇలా చేస్తే సరిపోతుంది! - How To Control Diabetes

  • అలాగే.. రాత్రి భోజనం త్వరగా పూర్తి అయ్యేలా చూసుకోవాలంటున్నారు. ఆహారానికి ఆహారానికి మధ్య ఎక్కువ గ్యాప్ ఉండకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు నిపుణులు.
  • విటమిన్‌-సి కలిగిన నారింజ, నిమ్మ, బత్తాయిలాంటి పండ్ల రసాలు, ఇతర పండ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే.. ఇవి విటమిన్ డి శోషణకు కొంతవరకు సహాయపడతాయంటున్నారు.
  • వీటితో పాటు పీచులు అధికంగా ఉండే చిరుధాన్యాలు, గోధుమలు వంటివి డైట్​లో ఉండేలా ప్లాన్ చేసుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే.. వాల్‌నట్‌, బాదం, అవిసెల్లాంటి గింజలు కూడా మేలు చేస్తాయంటున్నారు. పన్నీర్, సోయా, మొలకలు వంటి ప్రొటీన్ ఫుడ్స్ తీసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు.
  • ప్రీ డయాబెటిస్ స్టేజ్​లో ఉన్నవారు తీసుకోవాల్సిన ఫుడ్​ను నిష్పత్తుల్లో చెప్పాలంటే.. "50 శాతం ఉడికించిన లేదా పచ్చి కూరగాయలు లేదా పండ్లు, 25 శాతం ప్రొటీన్‌, 25 శాతం కార్బోహైడ్రేట్ల"ను తీసుకోవాలన్నమాట.

వీటికి దూరంగా ఉండాలి : మైదా, పంచదారలాంటి ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ తీసుకోవడం మానేయాలని చెబుతున్నారు. ముఖ్యంగా మద్యపానం, ధూమపానం వంటికి వీలైనంత దూరంగా ఉండాలంటున్నారు. అలాగే ప్రీ డయాబెటిస్ నుంచి బయట పడేందుకు ఆహార విధానం మార్చుకోవడమే కాదు శారీరక శ్రమ కూడా ముఖ్యమంటున్నారు. అందుకోసం డైలీ శరీరానికి కాస్త చెమట పట్టే విధంగా పనిచేయాలంటున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

అలర్ట్ : మందు తాగితే షుగర్‌ పెరుగుతుందా? - నిపుణుల సమాధానమిదే! - problems of diabetes drink alcohol

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.