ETV Bharat / health

కంటికి కూడా స్ట్రోక్​ ముప్పు - ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ కళ్లు సేఫ్​! - Eye Stroke Symptoms - EYE STROKE SYMPTOMS

Eye Stroke: ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఏదో ఒక హెల్త్‌ ప్రాబ్లెమ్​తో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా యువత స్ట్రోక్స్‌ బారిన పడుతున్నారు. అయితే స్ట్రోక్​ అంటే హార్ట్‌ స్ట్రోక్‌, బ్రెయిన్ స్ట్రోక్‌ మాత్రమే గుర్తొస్తాయి. కాగా వీటిలాగానే ఐ స్ట్రోక్‌ కూడా ఉందంటున్నారు నిపుణులు. ఇంతకీ ఐ స్ట్రోక్‌ అంటే ఏమిటి? లక్షణాలు? తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటివి చూద్దాం..

Eye Stroke
What is Eye Stroke (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 7, 2024, 12:26 PM IST

What is Eye Stroke and its Symptoms: మన శరీర భాగాలలో కళ్లు ముఖ్యమైనవి. వీటిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయితే చాలా మంది కళ్ల విషయంలో అజాగ్రత్తగా ఉంటారు. ఇది ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. కళ్ల సమస్యల్లో ఐ స్ట్రోక్ ఒకటని.. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ఇంతకీ ఐ స్ట్రోక్‌ అంటే ఏమిటి? లక్షణాలు? తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటివి చూద్దాం..

ఐ స్ట్రోక్​ అంటే ఏమిటి: ఐ స్ట్రోక్.. దీనిని రెటినా ఇస్కీమియా లేదా రెటినా వ్యాధి అని కూడా పిలుస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఆప్టిక్ నరాల ముందు భాగంలో కణజాలాలకు తగినంత రక్త సరఫరా లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఆప్టిక్ నాడి అనేది బ్రెయిన్, కంటిని అనుసంధానించే కేబుల్. ఇది మిలియన్ల కొద్దీ నరాల ఫైబర్స్, రక్తనాళాలను తీసుకెళ్తుంది. అయితే, ముందుగానే దీనిని గుర్తించడం చాలా మంచిదని.. దీనిని గుర్తించి ట్రీట్‌మెంట్ చేస్తే.. స్ట్రోక్ రాకుండా సమస్యని తగ్గించుకోవచ్చని హార్వర్డ్ హెల్త్ చెబుతోంది.

ఐ స్ట్రోక్ లక్షణాలు: ఈ సమస్య వస్తే నల్లగా కనిపించడం, సరిగ్గా కనిపించకపోవడం, నీడల్లా కనిపించడం వంటి సమస్యలు వస్తుంటాయి. ఇది ఒక కంటిలో మాత్రమే ఉంటుంది. కంటి స్ట్రోక్‌తో బాధపడుతున్న చాలా మంది వ్యక్తులు ఉదయం నిద్రలేవగానే ఒక కంటి చూపు కోల్పోవడాన్ని గమనిస్తారు. ఈ సమస్యలో నొప్పిలాంటిది ఏమీ ఉండదు. కంటిలో ఎరుపు లేదా వాపు కనిపించవచ్చు. ఎక్కువ కాంతిని చూడలేకపోవడం.. జ్వరం, తలనొప్పి, దవడ నొప్పి, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, అలసట వంటి లక్షణాలు ఉంటాయి.

అలర్ట్ : ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తింటున్నారా? - "ఫ్రైడ్‌ రైస్‌ సిండ్రోమ్‌" ముప్పు తప్పదు! - What is Fried Rice Syndrome

ఐ స్ట్రోక్​కి కారణాలు:

  • డయాబెటిస్ ఉన్న వ్యక్తులకు ఐ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువ.
  • అధిక రక్తపోటు కూడా ఐ స్ట్రోక్​కి ఒక ప్రమాద కారకమని నిపుణులు అంటున్నారు.
  • అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఐ స్ట్రోక్​కి దారితీస్తాయి.
  • స్మోకింగ్​ కూడా ఐ స్ట్రోక్ కి ఒక ప్రమాద కారకం.
  • గ్లాకోమా కూడా ఐ స్ట్రోక్ కి దారితీస్తుంది. గ్లాకోమా అనేది ఆప్టిక్ నరాలకు నష్టం కలిగించే ఒక కంటి వ్యాధి.
  • పెన్ మెడిసిన్ ప్రకారం.. కార్డియో వాస్క్యులర్ సమస్య ఉన్నవారికి, వయగ్రా వంటి మందులు తీసుకునేవారికి ఈ సమస్య ఎక్కువగా వస్తుందని చెబుతున్నారు.

ఐ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి నివారణ చర్యలు:

  • పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్‌లతో సహా పోషకాలతో నిండిన ఆహారం ఐ స్ట్రోక్​ ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. అలాగే సంతృప్త కొవ్వు, ట్రాన్స్ కొవ్వు, కొలెస్ట్రాల్, సోడియం తక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలంటున్నారు.
  • 2017లో "న్యూరోలజీ"జర్నల్​లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్‌లతో సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తినే వ్యక్తులకు ఐ స్ట్రోక్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో షాంఘైలోని ఫుడాన్ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ హెల్త్ స్కూల్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్​ ఎమ్. ఎస్. జాంగ్ పాల్గొన్నారు.
  • వారానికి కనీసం 30 నిమిషాల మితమైన వ్యాయామాలు చేయాలని చెబుతున్నారు.
  • మీరు అధిక బరువు లేదా స్థూలకాయంతో ఉంటే.. ఆరోగ్యకరమైన బరువును కోల్పోవడం ఐ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు.
  • అధిక రక్తపోటు ఉంటే.. దాన్ని నియంత్రణలో ఉంచడానికి మందులు తీసుకోవడం, జీవనశైలి మార్పులు ప్రయోజనకరమని అంటున్నారు..
  • రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచడం అవసరమని, ఇది స్ట్రోక్​ ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు.
  • ఎక్కువ మద్యం తాగడం వల్ల స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి ఈ అలవాటును కూడా మానుకోవాలని అంటున్నారు. అలాగే స్మోకింగ్​ కూడా మానుకోవాలని చెబుతున్నారు.
  • బయటికి వెళ్లినప్పుడు సూర్యరశ్మి నుంచి రక్షించుకునేందుకు UV ప్రొటెక్షన్​ అందించే సన్​ గ్లాసెస్​ ధరించమని సలహా ఇస్తున్నారు.
  • ఎల్లప్పుడూ హైడ్రేట్​గా ఉండేందుకు రోజుకు తగినన్ని వాటర్​ తీసుకోవాలని చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీ చర్మంపై తెల్ల మచ్చలకు కారణాలు ఇవే! - మీకు తెలుసా? - Causes For White Patches on Skin

కిడ్నీల్లో చెత్త క్లియర్ చేస్తుంది, షుగర్ తగ్గిస్తుంది! - ఒక్క గ్లాసు వాటర్​తో సూపర్ హెల్త్ బెనిఫిట్స్! - Coriander Water Benefits

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.