ETV Bharat / health

మధుమేహం​తో తీవ్రంగా బాధపడుతున్నారా? - పరిశోధకులు సూచిస్తున్న డైట్ ఇదే! - DIET FOR DIABETES - DIET FOR DIABETES

Diet For Diabetes : మధుమేహం ఓ దీర్ఘకాలిక వ్యాధి. డయాబెటిస్​... ఒకసారి వచ్చిందంటే పూర్తిగా నయమయ్యే సమస్య కాదు. జీవనశైలి మార్పులు, మందులతో దీన్ని నియంత్రణలో ఉంచుకోవటం తప్పించి మరో అవకాశం లేదు. కాబట్టి.. కొన్ని ఆహార నియమాలు పాటించి దీనిని అదుపులో ఉంచుకోవచ్చని చెబుతున్నారు వైద్యులు. ఆ వివరాలు మీ కోసం..

Diabetes Control Food In Telugu
Diabetes Control Food In Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 12, 2024, 5:31 PM IST

Diet For Diabetes : ప్రస్తుత ఉరుకుల పరుగులతో కూడిన జీవితం కారణంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరికీ మధుమేహం వ్యాధి వచ్చేస్తోంది. అయితే, షుగర్​ ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతుంటే ఆ సమస్య ఎదురుకాకుండా కొన్ని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు. లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు. మధుమేహం సమస్య ఉన్న వారు ఫైబర్​, కార్బోహైడ్రేట్స్‌ని తగ్గించడం, వ్యాయామం చేయడం వల్ల చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని డాక్టర్​ డెవిడ్​ జెన్​కిన్స్​, డాక్టర్​ రిచర్డ్​ బెర్న్​స్టీన్​ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? ఎలాంటి జీవన శైలిని అవలంభిస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

తినే ముందు నీరు తాగాలి..
ప్రతిరోజు తగినంతగా నీరు తాగకపోతే డీహైడ్రేషన్ పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల శరీరం ఇన్సులిన్ వినియోగించుకోవడంలో తేడాలు వస్తాయి. అప్పుడు రక్తంలోని గ్లూకోజ్​ స్థాయుల్లో హెచ్చు తగ్గులు నమోదయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల.. షుగర్ బాధితులు తప్పకుండా తగినన్ని నీళ్లు తాగాలి.

కార్బోహైడ్రేట్స్‌ను తగ్గించాలి..
కార్బోహైడ్రేట్స్‌ను ఎక్కువగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని వైద్యులు చెప్పారు. ఈ పిండి పదార్థాలు చక్కెరగా విడిపోయి రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తాయని తెలిపారు. కార్బోహైడ్రేట్స్​ను తగ్గించడం వల్ల బ్లడ్​లో షుగర్​ లెవల్​ తగ్గుతుందని వివరించారు. అంతేకాకుండా కార్బోహైడ్రేట్స్​ను తక్కువ చేస్తే బరువు కూడా తగ్గుతారని.. అందుకే వీటి వాడకాన్ని తగ్గించాలని చెబుతున్నారు.

ప్రాసెస్​ చేసిన ఆహారాన్ని తగ్గించాలి..
ఈ మధ్య కాలంలో దాదాపు ప్రతి ఒక్కరూ ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తింటున్నారు. అయితే, మధుమేహం అదుపులో ఉండాలంటే చక్కెర, వైట్​ రైస్, బ్రెడ్​, స్వీట్స్, బ్రేక్​ఫాస్ట్ సెరల్స్​, సోడా, డిజర్ట్స్​ కూడా తగ్గించాలని తెలిపారు. ఇవన్నీ కూడా త్వరగా జీర్ణమై రక్తంలో చక్కెర శాతాన్ని పెంచుతాయని.. అందుకే వీటిని ఎక్కువగా తీసుకోకూడదని చెప్పారు.

ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవాలి..
మధుమేహం ఉన్నవారు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు అధికంగా తీసుకోవాలని చెప్పారు. ఫైబర్​ అధికంగా ఉన్న ఆహారం జీర్ణమవడానికి ఎక్కువ సమయం పడుతుందని.. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు మెల్లగా పెరుగుతాయన్నారు. ఆలస్యంగా జీర్ణం కావడం వల్ల కడుపు నిండినట్లుగా ఉండి తక్కువగా తింటారని వివరించారు. దీంతో తక్కువగా ఆహారం తీసుకుని బరువు కూడా ఎక్కువ పెరగరని తెలిపారు.

వ్యాయామం చేయాలి..
వ్యాయామం చేయడం వల్ల ఇన్సులిన్​ హర్మోన్​ పెరిగి రక్తంలో చక్కెర పెరుగుదలను అదుపులో ఉంచుతుందని చెప్పారు. వ్యాయామం చేయడం కుదరని వాళ్లు కాసేపు వాకింగ్ చేసినా.. సరిపోతుందని చెబుతున్నారు.

షుగర్ వ్యాధి​ వచ్చే ముందు శరీరంలో కనిపించే లక్షణాలేంటో - మీకు తెలుసా ? - Prediabetes Symptoms

షుగర్ బాధితులకు - ఈ పండ్లు అమృతంతో సమానం! - Best Fruits for Diabetic Patients

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.