ETV Bharat / health

మీ పిల్లలు హైట్​ పెరగాలంటే ఎనర్జీ డ్రింక్స్ తాగించడం కాదు - ఇలా చేయండి వెంటనే గ్రోత్​ మొదలైద్ది! - Height Increase Exercises For Kids

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 2, 2024, 3:12 PM IST

Easy Exercises To Increase Kids Height : కొద్దిమంది పిల్లలు వయసుకు మించిన ఎత్తు ఉంటారు. మరికొద్దిమంది వయసు పెరిగినా హైట్​ పెరగరు. దీంతో తల్లిదండ్రులు పిల్లల ఎత్తు విషయంలో ఆందోళన చెందుతుంటారు. ఈ క్రమంలోనే పలు డ్రింక్స్​ తాగిస్తుంటారు. అయితే పిల్లల ఎత్తు పెరగాలంటే ఎనర్జీ డ్రింక్​ తాగించడం కాదని.. వారితో ఇవి చేయించమని సలహా ఇస్తున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Kids Height
Easy Exercises To Increase Kids Height (ETV Bharat)

Exercises To Increase Kids Height : తమ పిల్లలు వయసుకు తగ్గట్టుగా ఎత్తు లేరని చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతుంటారు. అయితే ఇలా ఎత్తు పెరగకపోవడానికి మెజార్టీ జనాలు.. పేరెంట్స్​ జీన్స్‌ ఒక్కటే కారణమని అభిప్రాయపడుతుంటారు. కానీ, ఇది ఒక్కటే కాకుండా.. పోషకాహార లోపం, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం, వాతావరణం.. వంటివి కూడా ఎత్తుపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, పిల్లలు ఎత్తు పెరగడానికి కొన్ని వ్యాయామాలు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుందని అంటున్నారు. ఆ ఎక్సర్‌సైజ్‌లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజ్‌లు: పిల్లలు హైట్‌ పెరగడానికి స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజ్‌లు ఎంతో ప్రభావవంతంగా పని చేస్తాయని నిపుణులు అంటున్నారు. అవి చూస్తే.. నిటారుగా నిల్చొని కిందికి వంగుతూ కాలి వేళ్లను అందుకోవడం, కాళ్లు ముందుకు చాపి కూర్చొని చేతి వేళ్లతో కాళ్లను అందుకోవడం, శరీర పైభాగాన్ని ఇరువైపులా వంచుతూ చేసే ఎక్సర్‌సైజ్‌ల వల్ల వెన్నెముకకు ఫ్లెక్సిబులిటీ అందుతుందని.. దీనివల్ల ఎత్తు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

హ్యాంగింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు: బార్‌ హ్యాంగింగ్స్‌, హ్యాంగింగ్‌ రాడ్‌, పులప్స్‌, చిన్‌-అప్స్‌.. వంటి ఎక్సర్​సైజ్​లు వెన్నెముకను సులభంగా సాగేలా చేస్తాయిని.. ఈ ఎక్సర్‌సైజ్‌ల ద్వారా వయసు పెరిగే కొద్దీ పిల్లలు ఎత్తు కూడా పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ ఎక్సర్‌సైజ్‌లు వెన్ను, భుజాల కండరాలకు దృఢత్వాన్ని అందించి ఫిట్‌గా మార్చుతాయని అంటున్నారు.

మీ పిల్లలు కార్టూన్లు చూస్తున్నారా? పేరెంట్స్​గా మీరు ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్​!

యోగాసనాలు : కొన్ని రకాల యోగాసనాలు శారీరక దృఢత్వాన్ని పెంచడమే కాదు.. పిల్లలు హైట్‌ పెరగడానికి కూడా సహాయం చేస్తాయని నిపుణులంటున్నారు. సూర్య నమస్కారాలు చేయడం వల్ల మన బాడీకి చక్కటి వ్యాయామం అందుతుందని.. భుజాలు, వీపు, కాళ్లలోని కండరాలను బలంగా మార్చి సులభంగా సాగేలా చేస్తుందని చెబుతున్నారు. అలాగే చక్రాసనం వల్ల భుజాలు, పాదాలపై ఒత్తిడి పడుతుందని.. దీనివల్ల అక్కడి కండరాలు దృఢమవడంతో పాటు సాగుతాయిని.. ఫలితంగా హైట్‌ పెరిగే ప్రక్రియ వేగవంతమవుతుందని పేర్కొన్నారు.

స్కిప్పింగ్‌ : చాలా మంది పిల్లలు ఎంతో సరదా స్కిప్పింగ్‌ చేస్తుంటారు. ఈ వ్యాయామం శరీరానికి దృఢత్వాన్ని అందించడమే కాదు.. గుండె ఆరోగ్యాన్ని సైతం మెరుగుపరుస్తుందని నిపుణులంటున్నారు. స్కిప్పింగ్‌ చేసేటప్పుడు.. ఎగిరి దూకే క్రమంలో వెన్నెముక, భుజాలు, కాళ్లలోని కండరాలు ఫ్లెక్సిబుల్‌గా మారతాయి.. సులభంగా సాగేలా తయారవుతాయి. దీనివల్ల ఈజీగా ఎత్తు పెరుగుతారని నిపుణులు పేర్కొన్నారు.

స్విమ్మింగ్‌ : ఈత కొట్టే క్రమంలో మనం శరీరాన్ని ముందుకు సాగదీస్తాం. దీనివల్ల వెన్నెముకకు చక్కటి వ్యాయామం అందుతుంది. ఇది కూడా హైట్‌ పెరిగేందుకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

2017లో "జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్ & మెడిసిన్‌" జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ఈత కొట్టడం వల్ల పిల్లలు ఎత్తు పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో 7 నుంచి 17 సంవత్సరాలలోపు పిల్లలను పరిశీలించారు. వారానికి మూడుసార్లు ఈత కొట్టే వారు ఎత్తు పెరిగినట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ప్రొఫెసర్‌ 'డాక్టర్ ఐ.యల్. డేవిడ్' పాల్గొన్నారు. ఈత కొట్టేవారిలో ఎత్తు పెరుగుదల రేటు.. ఈత కొట్టనివారి కంటే కొంచెం ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.

పైన చెప్పిన వాటితో పాటు చక్కటి నిద్ర, సీజనల్‌ పండ్లు, అన్ని రకాల కాయగూరలు-దుంపలు, ఆకుకూరల వంటివి కూడా క్రమం తప్పకుండా తీసుకోవడం ఎత్తు పెరిగేలా చేస్తాయని నిపుణులంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీ పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడట్లేదా? - ఇలా ఇచ్చారంటే గ్లాస్ ఖాళీ చేసేస్తారు!

మీ పిల్లలు జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలంటే - అయితే మీరు ఇలా చేయాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.