ETV Bharat / health

మైదాతో ఆరోగ్యానికి ముప్పు - బదులుగా ఈ 6 రకాల పిండి ట్రై చేయండి - సూపర్​ టేస్టీ ఇంకా హెల్దీ! - Alternative Flours of Refined Flour - ALTERNATIVE FLOURS OF REFINED FLOUR

Alternative Flours of Refined Flour: మైదాతో తయారు చేసే ఫుడ్ ఐటమ్స్​ చాలా రుచిగా ఉంటాయి. కానీ.. దానివల్ల ఆరోగ్యం పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతూనే ఉంటారు. అయితే​.. మైదాకు బదులుగా​ 6 రకాల పిండిని వాడుకోవచ్చని సలహా ఇస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Alternative Flours Instead of Refined Flour
Alternative Flours Instead of Refined Flour (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 16, 2024, 1:10 PM IST

Alternative Flours Instead of Refined Flour for Baking Purpose: చాలా మందికి బేకరీ ఐటెమ్స్​ అంటే ఇష్టం. కేక్స్​, కుకీలు, మఫెన్స్​ అంటూ రకరకాల పదార్థాలు తింటుంటారు. కేవలం బేకరీలో మాత్రమే కొనుకుండా.. ఇంట్లో కూడా వీటిని తయారు చేసుకుంటారు. అయితే బేకరీ పదార్థాల్లో చాలా వరకు మైదానే వాడుతుంటారు. కానీ.. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతుంటారు. అదేసమయంలో మైదా పిండికి బదులుగా మరికొన్ని వాడుకోవచ్చని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

గోధుమ పిండి​: బేక్​ చేసేందుకు మైదా బదులు గోధుమ పిండి వాడమని సలహా ఇస్తున్నారు నిపుణులు. ఎందుకంటే మైదాతో పోలిస్తే ఇందులో ఫైబర్​ అధికంగా ఉంటుంది. అలాగే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ కారణంగా మధుమేహం తగ్గించడంలో సహాయపడతాయని అంటున్నారు. అంతేకాకుండా మైదాతో పోలిస్తే వీటితో చేసిన వంటలు రుచికరంగా కూడా ఉంటాయట.

బాదం పిండి: బాదం పప్పుల నుంచి తయారు చేసిన పిండి కూడా మైదాకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చుంటున్నారు నిపుణులు. ఇది గ్లూటెన్​ రహితమే కాకుండా.. ఇందులో ఫైబర్​, ప్రొటీన్​, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 2017లో జర్నల్​ ఆఫ్​ ఫుడ్​ సైన్స్​(Journal of Food Science)లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం బేకింగ్​ కోసం మైదా పిండికి బదులుగా బాదం పిండిని ఉపయోగించడం వల్ల వాటి రుచి మరింత పెరిగిందని.. ఆరోగ్యపరంగా కూడా పలు ప్రయోజనాలు ఉన్నాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో యునైటెడ్ స్టేట్స్‌లోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో ఫుడ్ సైన్స్ అండ్ హ్యూమన్ న్యూట్రిషన్ ప్రొఫెసర్ డాక్టర్ మార్గరెట్ డి. ఓ'కానర్ పాల్గొన్నారు.

ఈ ఆహారాలు కలిపి తింటున్నారా? - ఆరోగ్యాన్ని చేజేతులా ప్రమాదంలో పడేసుకున్నట్టే! - Avoid These Food Combinations

ఓట్స్ పిండి​: మైదా ప్లేస్​లో ఓట్స్​ పిండిని కూడా చేర్చుకోవచ్చని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇది గ్లూటెన్​ రహితంగా ఉంటుంది. అలాగే ఇందులో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదంటున్నారు.

కొబ్బరి పిండి: మైదాకు బదులుగా కొబ్బరి పిండి బెస్ట్​ ఆప్షన్​ అంటున్నారు నిపుణులు. ఇందులోని ఫైబర్​, ప్రొటీన్​, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఐరన్​, మెగ్నీషియం వంటి పోషకాలు.. బరువు తగ్గడం, గుండెం ఆరోగ్యాన్ని మెరుగుపరచడం సహా పలు ప్రయోజనాలు అందిస్తాయని అంటున్నారు. పైగా ఇది గ్లూటెన్​ ఫ్రీ ఆహారం. 2018లో జర్నల్​ ఆఫ్​ ఫుడ్​ సైన్స్​ టెక్నాలజీ(Journal of Food Science and Technology)లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం మైదాకు బదులుగా కొబ్బరి పిండి వాడటం మంచిదని కనుగొన్నారు. ఈ పరిశోధనలో పుణె విశ్వవిద్యాలయంలో ఫుడ్ టెక్నాలజీ ప్రొఫెసర్​ డా. షీలా సింగ్ పాల్గొన్నారు.

స్పెల్డ్​ ఫ్లోర్​: స్పెల్లింగ్​ బెర్రీస్​ నుంచి లభించే పిండిని స్పెల్డ్​ ఫ్లోర్​ అంటారు. ఇవి పురాతన కాలానికి చెందిన గోధుమలు. ఈ పిండిలో ప్రొటీన్​, ఫైబర్​ పుష్కలంగా ఉంటుంది. మైదాకు ప్రత్యామ్నాయంగా చెబుతున్నారు నిపుణులు.

శనగపిండి: శనగపిండి కూడా మైదా ప్లేస్​లో రిప్లేస్ చేసుకోవచ్చంటున్నారు. ఇందులోని ప్రొటీన్​, ఫైబర్​ పలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని అంటున్నారు. పైగా ఇది గ్లూటెన్​ రహిత ఆహారం.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

నూడుల్స్​ తినడం నిజంగా ప్రమాదమా? - నిపుణులు చెబుతున్న నిజాలివి! - Side Effects of Instant Noodles

'డబుల్ చిన్​'తో ఇబ్బందిపడుతున్నారా? - ఇలా సింపుల్​గా​ మాయం చేయండి!! - Double Chin Reduce Exercises

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.