ETV Bharat / health

మద్యం తాగితే జలుబు తగ్గుతుందా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే? - ALCOHOL SIDE EFFECTS ON BODY

-ఆల్కహాల్​తో రోగనిరోధక వ్యవస్థ పనితీరు తగ్గుతుందట! -ఇంకా ఇతర రోగాలు వచ్చేందుకు ఎక్కువ ఛాన్స్!

Does Alcohol Cure Cold
Does Alcohol Cure Cold (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : Dec 31, 2024, 10:24 AM IST

Does Alcohol Cure Cold: మనలో చాలా మందికి సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, పండగొచ్చినా, పబ్బమొచ్చినా ఆల్కహాల్ పార్టీ ఉండాల్సిందే. ఇంకా ఉద్యోగం, ప్రమోషన్‌ వచ్చినా.. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికినా, కొత్త ఏడాదికి స్వాగతం చెప్పినా పార్టీ చేసుకోవాల్సిందే. ఇంకా ఈ మద్యం ఎంతోమంది జేబులతో పాటు ఆరోగ్యాన్నీ గుల్లబారుస్తోందని నిపుణులు అంటున్నారు. కాలేయం, నాడులు, మెదడు దెబ్బతినటమే కాకుండా.. జబ్బుల బారినపడకుండా కాపాడే రోగనిరోధకశక్తినీ తగ్గిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇవే కాకుండా ఇన్‌ఫెక్షన్లు త్వరగా రావటానికి, ఒకపట్టాన తగ్గకపోవటానికి.. చివరికి కొన్నిరకాల క్యాన్సర్లకూ దారితీస్తోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మద్యానికీ రోగనిరోధకశక్తికీ ఉన్న సంబంధం ఏంటో ప్రముఖ ప్రముఖ ఫిజిషియన్ డాక్టర్ ఎంవీ రావు వివరిస్తున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వివిధ వ్యాధులు సోకకుండా రోగనిరోధకశక్తి నిరంతరం మనల్ని కాపాడటానికి ప్రయత్నిస్తుంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా బ్యాక్టీరియా, వైరస్‌ల వంటివి దాడి చేసినప్పుడు ఇది వాటిని గుర్తించడమే కాకుండా వాటిని ఎదుర్కొని సమర్థంగా తిప్పికొడుతుందని అంటున్నారు. ఇది మన శరీరంలో మెదడు తర్వాత రోగనిరోధక వ్యవస్థే అత్యంత సంక్లిష్టమైందని వివరిస్తున్నారు. దీన్ని ప్రధానంగా రెండు రకాలుగా చెప్పుకోవచ్చని వెల్లడిస్తున్నారు.

1. సహజ వ్యవస్థ (ఇన్నేట్‌). ఇది స్వతహాగానే మనకు లభిస్తుందని.. హానికారకాలను ఎదుర్కోవటంలో ముందువరుసలో నిలుస్తుందని అంటున్నారు. ఇది తక్షణమే స్పందించడమే కాకుండా.. బ్యాక్టీరియా, వైరస్‌ల వంటి సూక్ష్మక్రిములు ఒంట్లోకి ప్రవేశించగానే దీనిలో భాగమైన సహజ హంతక (ఎన్‌కే) కణాలు, మోనోసైట్స్, న్యూట్రోఫిల్స్, మాక్రోఫేజస్, డెండ్రిటిక్‌ కణాల వంటి తెల్ల రక్తకణాలు వెంటనే స్పందించి, చంపటానికి ప్రయత్నిస్తాయని వివరిస్తున్నారు. ఇవి వ్యాధికారక క్రిముల అణువుల తీరుతెన్నులనూ గుర్తించడమే కాకుండా.. వాటిని మింగేస్తాయని చెబుతున్నారు. ఈ సహజ రోగనిరోధక కణాలు సైటోకైన్లు, కీమోకైన్ల వంటి వాటినీ విడుదల చేసి వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) తగ్గించడానికి సహాయ పడతాయని అంటున్నారు.

2. సంచిత వ్యవస్థ (అడాప్టివ్‌). ఇది ఆయా రకాల బ్యాక్టీరియా, వైరస్‌లను తుదముట్టించటానికి దోహదం చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇది రకరకాల ఇన్‌ఫెక్షన్లను గుర్తించి, వాటిని ఎదుర్కోవటానికి రోగనిరోధక వ్యవస్థ ప్రత్యేకమైన యాంటీబాడీలను సృష్టిస్తుందని వివరిస్తున్నారు. చికున్‌గన్యా యాంటీబాడీ, డెంగీ యాంటీబాడీల వంటివన్నీ ఇలాంటివేనని చెబుతున్నారు. ఇంకా ఇవి అప్పటికప్పుడు ఇన్‌ఫెక్షన్‌ పనిపట్టటమే కాకుండా దాన్ని గుర్తుపెట్టుకుంటాయని తెలిపారు. ఫలితంగా తిరిగి ఎప్పుడైనా ఆ ఇన్‌ఫెక్షన్‌ దాడిచేసినప్పుడు విడుదలై, దాన్ని కట్టడి చేస్తాయని పేర్కొన్నారు. దీంతో పాటు సంచిత నిరోధక వ్యవస్థలోనూ సెల్‌-మీడియేటరీ, హ్యూమోరల్‌ అని మళ్లీ రెండు రకాలు కనిపిస్తాయని వెల్లడిస్తున్నారు. ఇవి సెల్‌-మీడియేటరీ రకంలో టి కణాలు.. హ్యూమోరల్‌ రకంలో బి కణాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని అంటున్నారు. టి కణాలు బ్యాక్టీరియాను తినేస్తుంటే.. బి కణాల నుంచి పుట్టుకొచ్చే యాంటీబాడీలు బ్యాక్టీరియా వృద్ధిని నిలువరిస్తాయని చెబుతున్నారు.

"మద్యం ముందుగా జీర్ణకోశ వ్యవస్థ మీదే ప్రభావం చూపుతుంది. ఇది జీర్ణాశయం, చిన్నపేగు, పెద్దపేగు గోడల్లో పైపొరను.. అక్కడ ఉండే టి కణాలు, న్యూట్రోఫిల్స్‌ను దెబ్బతీస్తుంది. ఫలితంగా జీర్ణకోశం, రక్తం మధ్య ఆడ్డుగా ఉండే పొర దెబ్బతిని.. పేగుల్లోని సూక్ష్మక్రిములు రక్తంలోకి చేరతాయి. ఫలితంగా ఇతర అవయవాల్లోనూ వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) ప్రేరేపితం అవుతుంది. ఇంకా మద్యం అలవాటు గలవారికి రక్తంలోకి ఇన్‌ఫెక్షన్‌ వ్యాపించే (సెప్సిస్‌) ముప్పూ ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య నుంచి కోలుకోవటానికీ ఎక్కువ సమయమే పట్టడమే కాకుండా.. మరణాలూ ఎక్కువగా సంభవిస్తుంటాయి. ఇంకా మద్యంతో పేగుల్లోని మంచి బ్యాక్టీరియా సైతం అస్తవ్యస్తం అవుతుంది. ఇవి రోగనిరోధక వ్యవస్థ పరిపక్వం కావటానికి, తగు విధంగా మారటానికి ట్రైనింగ్ ఇస్తాయి. శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా అస్తవ్యస్తమైతే రోగనిరోధక వ్యవస్థ కూడా దారి తప్పుతుంది. మంచి బ్యాక్టీరియాకూ రోగనిరోధక వ్యవస్థకూ మధ్య సమాచార వ్యవస్థ కూడా దెబ్బ తింటుంది."

--డాక్టర్ ఎం.వి రావు, కన్సల్టెంట్ ఫిజిషియన్

ఇన్‌ఫెక్షన్ల ముప్పు
మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినటం వల్ల మద్యం తాగేవారికి బ్యాక్టీరియా, వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీరికి శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు.. ముఖ్యంగా న్యుమోనియా, క్షయ ఎక్కువగా వస్తుంటాయని చెబుతున్నారు. మన ఊపిరితిత్తుల్లో సూక్ష్మ కేశాలు (సీలియా) ఉంటాయని.. ఇవి కదలటం మూలంగానే లోపలున్న ద్రవాలు, హాని కారకాలు బయటకు వస్తాయని వివరిస్తున్నారు. మద్యం తాగితే వీటి కదలికలు నెమ్మదిస్తాయని అంటున్నారు. మరోవైపు న్యూట్రోఫిల్స్, మ్యాక్రోఫేజస్‌ వంటి నిరోధక కణాల సంఖ్యా తగ్గుతుందని పేర్కొన్నారు. దీంతో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లను తట్టుకునే శక్తి సన్నగిల్లుతుందని.. ఇన్‌ఫెక్షన్ల నుంచి కోలుకోవటం ఆలస్యమవుతుందని తెలిపారు. ఇంకా దీర్ఘకాలంగా మద్యం అలవాటు గలవారికి మామూలు జలుబు, ఫ్లూ వంటివీ అంత త్వరగా తగ్గవని అంటున్నారు. ఇంకా చాలామంది మద్యం తాగితే జలుబు తగ్గుతుందని భావిస్తుంటారు గానీ ఇది నిజం కాదని తేల్చి చెప్పారు. మద్యం మత్తులో ముక్కుదిబ్బడ వంటి లక్షణాలు తగ్గినట్టు అనిపించొచ్చని.. కానీ నిజానికి జలుబు తగ్గదని వివరిస్తున్నారు. హెపటైటిస్‌ సి, హెచ్‌ఐవీ వంటి దీర్ఘకాల ఇన్‌ఫెక్షన్లు త్వరగా ముదురుతాయని.. కాలేయంలో చీము గడ్డలు ఏర్పడొచ్చని చెబుతున్నారు. ఇంకా మధుమేహుల్లో మాదిరిగానే పుండ్లు త్వరగా మానకపోవటం, తరచూ మూత్రకోశ సమస్యల వంటి ఇతరత్రా ఇన్‌ఫెక్షన్లు దాడిచేయటమూ వీరిలో ఎక్కువేనని అంటున్నారు.

"మద్యం కారణంగా సహజ, సంచిత నిరోధకశక్తులు రెండూ తగ్గుతాయి. ఒక్కసారి అతిగా తాగినా మర్నాటికి తెల్లరక్తకణాల సంఖ్య తగ్గిపోతుంది. మద్యం వ్యసనం గలవారిలో సహజ నిరోధక వ్యవస్థ కణాలు హానికారక సూక్ష్మక్రిములను గుర్తించటం, వాటికి అడ్డుకునే సామర్థ్యం కోల్పోతున్నట్టు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇంకా వాపు ప్రక్రియ ప్రతిస్పందనను ప్రేరేపించే సైటోకైన్ల ఉత్పత్తీ పడిపోతున్నట్టు బయట పడింది. సంచిత నిరోధక వ్యవస్థ విషయానికి వస్తే హ్యూమోరల్‌, సెల్‌-మీడియేటెడ్ రెండు రకాల మీదా మద్యం ప్రభావం చూపుతుంది. టి కణాల్లో భాగమైన సీడీ4, సీడీ8 కణాల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్టు తేలింది. అతిగా మద్యం తాగేవారిలో బి కణాలూ తగ్గుతున్నట్టు బయటపడింది. చాలా పరిశోధనలు అతిగా తాగేవారి మీద నిర్వహించినప్పటికీ.. ఒక మాదిరిగా మద్యం తాగినా రోగనిరోధక వ్యవస్థ మీద గణనీయ ప్రభావం పడుతుందని.. ఇది ఇమ్యునోగ్లోబులిన్లనూ మారుస్తున్నట్టూ పరిశోధనలు చెబుతున్నాయి."

క్యాన్సర్లూ ఎక్కువే
మద్యం తీసుకోవడం వల్ల రకరకాలుగా క్యాన్సర్లు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది క్యాన్సర్లలో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) కీలక పాత్ర పోషిస్తుంటుందని వివరిస్తున్నారు. ఇంకా రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవటమే దీర్ఘకాల వాపు ప్రక్రియకు మూలం అని అంటున్నారు. మద్యం తాగినప్పుడు మన శరీరం దాన్ని అసిటల్‌డిహైడ్‌ అనే రసాయనంగా మారుస్తుందని.. ఇది కణాలను దెబ్బ తీయటమే కాకుండా అవి మరమ్మతు కాకుండానూ అడ్డుకుంటుందని చెబుతున్నారు. మద్యం మూలంగా ఈస్ట్రోజన్, ఇన్సులిన్‌ వంటి హార్మోన్ల మోతాదులు పెరుగుతాయని అంటున్నారు. ఫలితంగా కణాలు మరింత త్వరగా విభజన చెంది.. చివరికి క్యాన్సర్‌కూ బీజం పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఇంకా మద్యం తాగటం వల్ల నోరు, గొంతులోని కణాల నుంచి హానికర రసాయనాలు తేలికగా శరీరంలోకి వెళ్తాయని పేర్కొన్నారు. ఇవీ క్యాన్సర్‌ ముప్పు పెరిగేలా చేస్తాయని తెలిపారు. మద్యం మూలంగా రొమ్ము, పేగుల క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువేనని.. నోరు, గొంతు, అన్నవాహిక, స్వరపేటిక, మూత్రాశయ, కాలేయ, ప్రోస్టేట్‌ క్యాన్సర్ల ముప్పూ పెరుగుతుందని అంటున్నారు. మద్యాన్ని కొద్దిమొత్తంలో తాగినా, ఏ రూపంలో తీసుకున్నా చేటేనని గుర్తించాలని సలహా ఇస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

'వాకింగ్ ఇలా చేస్తేనే బీపీ, షుగర్, బరువు తగ్గుతుంది'- మరి ఎలా చేయాలో మీకు తెలుసా?

'ఈ చిన్న మార్పులతో బెల్లీ ఫ్యాట్ సమస్యకు గుడ్​ బై'- మీరు ట్రై చేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.