Walking According To Age : మనం ఆరోగ్యంగా ఉండటానికి సమతుల ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, వ్యాయామం చేయడం కూడా అంతే ముఖ్యం. కానీ, ప్రస్తుత కాలంలో పలు కారణాల వల్ల చాలా మంది శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారు. దీంతో అనేక రకాల అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. కాబట్టి, జిమ్‌లకు వెళ్లి వ్యాయామాలు చేయలేని వారు రోజూ ఒక అరగంట సేపు నడవాలని నిపుణులు చెబుతున్నారు. వాకింగ్ చేయడం వల్ల ఫిట్‌గా ఉండటంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని పేర్కొన్నారు. అయితే, హెల్దీగా ఉండటానికి ఏ వయసు వారు ఎన్ని అడుగులు వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వాకింగ్ వల్ల లాభాలు :
- రోజూ వాకింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే గుండెపోటు రాకుండా ఉంటుందని అంటున్నారు. 2019లో "The Lancet" జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం, వారానికి ఐదు రోజులు 30 నిమిషాలు నడవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం 27 శాతం తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో టెక్సాస్ A&M హెల్త్ సైన్సెస్ సెంటర్‌లో ప్రొఫెసర్‌గా పనిచేసే డాక్టర్ స్టీవెన్ జె. బ్లెయిర్ పాల్గొన్నారు. వారంలో అరగంట సేపు 5 రోజులు నడవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.
- వాకింగ్ చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల అనేక రకాల జబ్బులు రాకుండా ఉంటాయి.
- నడవడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. చెమట ద్వారా రక్తంలోని మలినాలు బయటకుపోతాయని నిపుణులంటున్నారు.
- అధిక రక్తపోటుతో బాధపడేవారు వాకింగ్ చేయడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
- షుగర్ వ్యాధి ఉన్నవారు రోజూ వాకింగ్ చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
ఈ లక్షణాలు మీలో కనిపించాయా? అయితే మీకు కాల్షియం తక్కువున్నట్టే! - symptoms of calcium Deficiency
- ఇంకా రోజూ వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
- మానసిక కుంగుబాటు, ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడేవారు డైలీ వాకింగ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఏ వయసు వారు రోజూ ఎన్ని అడుగులు నడవాలి ?
- మనిషి ఆరోగ్యంగా ఉండటానికి రోజూ కనీసం అరగంట సేపు నడవాలి. ఇలా అరగంట పాటు నడవడం వల్ల సుమారు 10 వేల అడుగులు వేసినట్లని నిపుణులు అంటున్నారు.
- అయితే, 5 నుంచి 7 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలు రోజూ 12 వేల నుంచి 15 వేల అడుగులు నడిస్తే మంచిదట.
- ఇంకా 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న వారు ప్రతిరోజు 12వేల అడుగులు నడిస్తే మంచిదని నిపుణులంటున్నారు.
- 40 సంవత్సరాల పైబడిన వారు 11వేల అడుగులు నడవాలని సూచిస్తున్నారు.
- 50 సంవత్సరాల పైబడిన వారు 10వేల అడుగులు నడిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని నిపుణులంటున్నారు.
- 60 సంవత్సరాల పైబడిన వారు డైలీ 8 వేల అడుగులు నడిస్తే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
డిప్రెషన్ సమస్య స్త్రీలలోనే ఎక్కువట- ఎందుకంటే? - Women Depression Reasons