ETV Bharat / health

సైట్​ పెరుగుతుందా? ఈ కూరగాయలతో కంటి చూపును కాపాడుకోండిలా! - Eyesight Imporving Vegetables

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 30, 2024, 8:44 AM IST

Eyesight Improving Vegetables : కంటి చూపు బాగుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. కళ్లు కనిపించకపోతే చిన్న చిన్న విషయాలకు కూడా ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా కంటి ఆరోగ్యాన్ని సహజంగా కాపాడుకోవడం ఎలాగో తెలుసుకుందాం.

Eyesight Imporving Vegetables
Eyesight Imporving Vegetables (Getty Images)

Eyesight Improving Vegetables : సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు పెద్దలు. అందుకే మనం అన్ని రకాలుగా బాగుండాలంటే కంటి చూపును కాపాడుకోవడం చాలా అవసరం. పోషకాలతో నిండిన ఆహారపు అలవాట్లు కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల కొన్ని కూరగాయలు కంటి చూపును చురుగ్గా మారుస్తాయి. రెటీనా సమస్యలు, రేచీకటి, కంటి శుక్లాలు వంటి దీర్థకాలిక కంట సమస్యలు రాకుండా ఉండేందుకు కొన్ని ఆహారాలను మనం తరచుగా తప్పక తీసుకోవాల్సి ఉంటుందని కంటి వైద్య నిపుణులు చెబుతున్నారు. అలా సహజంగా మీ కంటి చూపును పెంచే కూరగాయలు ఏంటో చూసేద్దామా.

క్యారెట్ : క్యారెట్​లో బీటా కెరోటిన్, విటమిన్-ఏ పుష్కలంగా ఉంటాయి. కంటి చూపును మెరుగుపరచడంలో విటమిన్-ఏ కీలక పాత్ర పోషిస్తుంది. రేచీకటి సమస్య నుంచి దూరంగా ఉంచుతుంది. వీటిలోని బీటా కెరోటిన్ మొత్తం కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది.

బచ్చలికూర : రెటీనాలో సాంద్రతను పెంచే లుటీన్, జియాక్సింతిన్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు బచ్చలికూరలో మెండుగా లభిస్తాయి. ఈ హానికరమైన కాంతి నుంచి కళ్లను రక్షించడంలో, మాక్యులర్, డీజెనరేషన్, కంటి శుక్లం వంటి దీర్థకాలిక కంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో బచ్చలికూర చక్కగా ఉపయోగపడుతుంది.

కాలే : కాలేలో విటమిన్-ఏ, విటమిన్-సీ, విటమిన్-కేలతో పాటు లుటీన్, జియాంక్సంతిన్ అధికంగా ఉంటాయి. రెటీనా ఆరోగ్యానికి ఇవి చాలా బాగా సహాయపడతాయి. కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే హానికరమైన నీలి కాంతిని ఫిల్లర్ చేయడంలో, మచ్చల క్షీణిత ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కంటిశుక్లంతో పాటు వయస్సుతో పాటు వచ్చే దృష్టి సమస్యలను నయం చేస్తుంది.

చిలకడదుంప : తియ్యటి రుచి కలిగిన చిలకడదుంపల్లో బీటా కెరోటిన్, విటమిన్-ఏ అధికంగా ఉంటాయి. ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కళ్లను కాపాడేందుకు ఇవి చక్కగా సహాయపడతాయి. చిలకడ దుంపలను మీ డైట్ ప్లాన్​లో చేర్చుకోవడం వల్ల సహజమైన కంటి ఆరోగ్యాన్ని పొందండమే కాకుండా రేచీకటి సమస్యకు దూరంగా ఉండచ్చు.

రెడ్ క్యాప్సికమ్ : విటమిన్-ఏ, విటమిన్-సీ రెడ్ క్యాప్సికమ్​లో అధికంగా ఉంటాయి. కళ్లలోని రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడటంలో, కంటి శుక్లాల ప్రమాదాన్ని తగ్గించడంలోనూ విటమిన్-సీ చక్కగా సహాయపడుతుంది. వీటిలోని విటమిన్-ఏ మొత్తం కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

బ్రోకలీ : బ్రోకలీలో విటమిన్-సీ, బీటా కెరోటిన్, లుటీన్, జియాంక్సంతిన్ ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. కంటిని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించేందుకు, వయసు సంబంధిత కంటి సమస్యల నుంచి కాపాడేందుకు ఈ పోషకాలు చక్కగా ఉపయోగపడతాయి.

బ్రస్సెల్స్ మొలకలు : విటమిన్-సీ, విటమిన్-కేతో పాటు లుటీన్, జియాంక్సంతిన్ లాంటివి​ బ్రస్సెల్స్ మొలకల్లో అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ వల్ల కంటి ఆరోగ్యానికి జరిగే నష్టాన్ని తగ్గిస్తాయి. వీటిని తరచూ తినడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగవుతుంది.

గుమ్మడికాయ : ఇందులో కంటి ఆరోగ్యాన్ని కాపాడే బీటా కెరోటీన్, విటమిన్-సీ, విటమిన్-ఈ పుష్కలంగా లభిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిండెంట్ లక్షణాలు కంటి చూపును చురుగ్గా మారుస్తుంది. అంతే కాకుండా వయసుతో పాటు వచ్చే కంటి నయం చేయడంలోనూ సహాయపడతాయి.

చిక్కుళ్లు : రెటీనా ఆరోగ్యాన్ని కాపాడి కంటి శుక్లాలు, మాక్యులర్ డీజెనరేషన్ వంటి కంటి వ్యాధులు రాకుండా చేసేందుకు సహాయపడే లుటీన్, విటమిన్-సీ, జింక్​లు ఈ చిక్కుళ్లలో పుష్కలంగా ఉంటాయి.

సమ్మర్​లో కళ్ల కింద డార్క్ సర్కిల్స్ వేధిస్తున్నాయా? - ఈ టిప్స్​తో తొలగించుకోవడం వెరీ ఈజీ! - Dark Circles Under Eyes Remove Tips

సరిగ్గా నిద్రపోకపోతే కంటి ఆరోగ్యం షెడ్డుకే? ఇవి పాటిస్తే బిగ్​ రిలీఫ్! - Impact Of Sleep On Eye Health

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.