ETV Bharat / health

వీగన్​ డైట్​తో నిజంగానే యవ్వనంగా కనిపించొచ్చా? నిపుణుల సమాధానమిదే! - Vegan Diet Benefits

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 13, 2024, 11:21 AM IST

Vegan Diet Benefits : అందంగా, ఆరోగ్యంగా ఉండాలనుకునే చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. అందుకు కొంతమంది శాకాహారమని, మరికొంతమంది మాంసాహారం మంచిదని అంటారు. అసలు ఈ రెండింటిలో ఏది మంచిది? నిపుణులు ఏమి చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Vegan Diet Benefits
Vegan Diet Benefits (Getty Images)

Vegan Diet Benefits : నేటి సమాజంలో ఆరోగ్యంగా ఉండటం ఎంత ముఖ్యమో అందంగా కనిపించడం కూడా అంతే ముఖ్యం. అయితే ఫిట్​గా, అందంగా కనిపించేందుకు శాకాహారం మాత్రమే తినాలని కొందరంటే, నాన్ వెజ్ లేనిదే హెల్తీగా ఉండలేమని మరికొందరు వాదన. ఈ విషయంపై తాజాగా ఎనిమిది వారాల పాటు సర్వే నిర్వహించారు.

సర్వేలో ఎనిమిది వారాల పాటు శాకాహారం తీసుకున్న వారి రక్త నమూనాలను పరీక్షించారు. అందులో ఎర్గోథియోనీన్ అనే న్యూట్రియంట్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించే యాంటీ ఆక్సిడెంట్ల స్థాయిలు తగ్గాయని నిపుణులు చెబుతున్నారు. మాంసాహారం తీసుకునే వారితో పోలిస్తే వెజిటేరియన్ ఫుడ్‌లోనూ అది మొక్కల నుంచి ఉత్పత్తి అయిన ఆహారం తీసుకునే వారిలోనే వయస్సు పెరుగుతున్న లక్షణాలు తక్కువగా కనిపించాయట. నాన్ వెజిటేరియన్ డైట్ తీసుకునే వారి కంటే ఎల్​డీఎల్​-సీ కొలెస్ట్రాల్ అనేది తక్కువగా తీసుకోవడం వల్ల వారిలో ఇన్సులిన్ ఉత్పత్తి కూడా తగ్గింది. అలా కెమికల్ రియాక్షన్ తగ్గుముఖం పట్టడం వల్ల వయస్సు పెరిగినట్లు కనిపించలేదని నిపుణులు అంటున్నారు. పైగా వీరిలో నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకునే వారి కంటే వేగవంతంగా బరువు తగ్గుతున్నారని గుర్తించారు.

వారిలో పెద్దగా మార్పులు కనిపించలేదు
షుగర్, రిఫైన్డ్ షుగర్, ఉప్పుతో ఊరబెట్టిన కూరగాయలు అంటే పచ్చళ్ల లాంటి వాటిని తరచుగా తినే వారిలో మాత్రం పెద్దగా మార్పులు కనిపించలేదట. దీంతో బరువు తగ్గేందుకు, యవ్వనంగా కనిపించేందుకు పూర్తిగా వెజిటేరియన్‌గా మారిపోవాల్సిన అవసరం లేదనే విషయాన్ని గుర్తించారు. రోజూ తీసుకునే ఆహారంలో కొద్ది పాటి మార్పులు చేసుకుంటే చాలని నిపుణులు అంటున్నారు. మిక్స్‌డ్ డైట్ తీసుకునే వారిలోనూ కొలెస్ట్రాల్, ఇన్సులిన్ లెవెల్స్ అనేవి నార్మల్‌గానే ఉన్నట్లు గుర్తించారు. ఈ మిక్స్‌డ్ డైట్ తీసుకోవడం అంటే జంతు మాంసాలను పూర్తిగా మానేయకుండా వాటితో పాటుగా మొక్కల ద్వారా ఉత్పత్తి అయిన ఆహారపదార్థాలను ఎక్కువగా తీసుకోవడం. ఇందులో గుడ్లు, పాల పదార్థాలు, మాంసం లాంటివి కూడా ఉన్నాయి.

వెజిటేరియన్ డైట్ అనేది మిడిల్ ఏజ్​లో ఉన్నవారిలో మంచి ఫలితాలనే నమోదు చేసిందని నిపుణులు అంటున్నారు. కార్డియోవాస్క్యూలర్ సమస్యలు, టైప్ 2 డయాబెటిస్ రాకుండా చేసిందని చెబుతున్నారు. కానీ, చాలాకాలం నుంచి వెజిటేరియన్‌గా ఉన్నవారిలో కండరాల్లో శక్తి కోల్పోవడం గమనించినట్లు నిపుణులు అంటున్నారు. ప్రత్యేకించి ఎముకల సాంద్రత తగ్గి, న్యూరోలాజికల్ డిజార్డర్స్‌కు కారణమైందని తెలిసిందని పేర్కొన్నారు. అలా వారి జీవన విధానంపై ప్రభావం చూపిందని తెలిపారు.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మూడ్​ బూస్టింగ్ ఫుడ్స్​తో ఫుల్​ ఖుషీ! ​హ్యాపీగా ఉండాలంటే ఈ ఆహారం మీ డైట్​లో చేర్చుకోవాల్సిందే! - Foods That Improve Mood Happiness

సిక్స్ ప్యాక్ కావాలా? జిమ్​తో పాటు ఈ ఫుడ్ డైట్ తప్పనిసరి! - Diet Food For Six Pack Abs

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.