Trans Fats Heart Health Effects : మనం ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా మనం తీసుకునే ఆహారం బాగుండాలి. మనకు హాని చేసే ఆహారం తీసుకుంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయితే.. ప్రస్తుత కాలంలో మనం తెలిసో తెలియకో తీసుకునే కొన్ని ఆహార పదార్థాలలో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటున్నాయి. వీటిని తినడం వల్ల మనకు గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ట్రాన్స్‌ఫ్యాట్స్ ఉండే ఆహార పదార్థాలు ఏంటో మీకు తెలుసా ? ఇప్పుడు చూద్దాం.
మనం తినే జంక్‌ఫుడ్‌లో ట్రాన్స్ ఫ్యాట్స్ (National library of medicine రీపోర్ట్) అధికంగా ఉంటాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి వంట నూనెలను బాగా వేడి చేయడం ద్వారా ఏర్పడతాయి. సాధారణంగా ఫ్యాట్స్ రెండు రకాలు. శాచురేటెడ్, అన్‌శాచురేటెడ్. ఈ ట్రాన్స్‌ఫ్యాట్స్ అన్‌శాచురేటెడ్ కిందకు వస్తాయి. వంట నూనెలను హైడ్రోజనీకరణం చేసినప్పుడు ట్రాన్స్ ఫ్యాట్స్ ఏర్పడతాయి.
- మనం తినే ఫ్రెంచ్‌ఫ్రైస్, చిప్స్, బర్గర్లు, పిజ్జాలు, కుకీలు, మంచూరియా, బిస్కెట్లలలో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి.
- ఇంకా మైదాతో చేసే పఫ్‌లు, డోనట్స్ వంటి చాలా రకాల పదార్థాలలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి.
- అలాగే కేకులు, బేకరీ ఐటమ్స్, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్, రెడీ టు ఈట్ ఆహార పదార్థాల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి.
- అయితే.. మన రోజువారీ ఆహారంలో ఇవి సున్న శాతం ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కానీ, చాలా మంది పైన తెలిపిన ఆహార పదార్థాలు నోటికి రుచిగా ఉంటాయని ఎక్కువగా తింటుంటారు.
- కానీ, వీటి ఫలితంగా చిన్నవయసులోనే గుండె జబ్బులు, మధుమేహం, అధిక బరువు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ (hdl) తగ్గిపోతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ (ldl) పెరిగిపోతుంది.
2015లో "న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్" (NEJM) జర్నల్లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ట్రాన్స్ ఫ్యాట్ తీసుకోవడం గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో ప్రొఫెసర్ 'డాక్టర్ దరియుష్ మొజాఫరియన్' పాల్గొన్నారు.
ఇలా చేయండి :
- వీలైనంత వరకు తీపి పదార్థాలకు దూరంగా ఉండండి.
- అలాగే నూనెలో వేయించిన పదార్థాలను తినడం తగ్గించండి.
- ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలను తీసుకునేటప్పుడు దాని వెనక ఉన్న లేబుల్‌ని చదవాలి.
- క్యాలరీలు, ఉప్పు, కొవ్వు శాతం ఎంత ఉన్నాయో చూసుకోవాలి. వీలైతే వాటికి బదులుగా వేరే ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవి కూడా చదవండి :
బిగ్ అలర్ట్ : కాళ్లలో నొప్పికీ.. గుండెపోటుకు లింకు! - ఇలా చేయకపోతే ముప్పు తప్పదు!
ఈ 5 రకాల బాడీ పెయిన్స్లో ఏది కనిపించినా అలర్ట్ కావాల్సిందే - గుండెపోటు సంకేతం కావొచ్చట!