ETV Bharat / health

వానొస్తే "ఉసిళ్లు" ఇబ్బందిపెడుతున్నాయా? ఈ టిప్స్​ పాటిస్తే మళ్లీ కనిపించవు కూడా! - Tips to Avoid Usillu in Rains - TIPS TO AVOID USILLU IN RAINS

Tips To Prevent Insects : వర్షాకాలంలో సాయంత్రం అవ్వగానే వివిధ రకాల పురుగులు, కీటకాలు ఇంట్లోకి వస్తుంటాయి. ముఖ్యంగా ఉసిళ్లు ఇంట్లోకి వచ్చి చాలా ఇబ్బంది పెడుతుంటాయి. అయితే, కొన్ని టిప్స్‌ పాటించడం వల్ల వీటిని ఈజీగా తరిమికొట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Rainy Season Insects
Tips To Prevent Rainy Season Insects (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 26, 2024, 3:19 PM IST

Tips to Avoid Usillu in Rainy Season: వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండి ఎంతో హాయిగా అనిపించినా.. కొన్ని ఇబ్బందులు మాత్రం తప్పవు. వర్షాలు కురవడం వల్ల నేలలో ఉండే వివిధ రకాల క్రిమి కీటకాలు, పురుగులు భూమిలో నుంచి బయటకు వస్తుంటాయి. ఇందులో కొన్ని నేలపైన తిరిగితే.. మరికొన్ని రాత్రి సమయంలో దీపాల చుట్టూ ఎగురుతుంటాయి. చినుకు పడితే చాలు.. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ.. లైట్‌ల చుట్టూ కొన్ని వందల సంఖ్యలో ఉసిళ్లు ఎగురుతుంటాయి. అప్పుడు ఏం చేయాలో తెలియక చాలా మంది లైట్‌లు ఆఫ్‌ చేస్తుంటారు. అయితే, ఈ ఉసిళ్లను తరిమికొట్టడానికి కొన్ని మార్గాలు ఉన్నాయని నిపుణులంటున్నారు. ఈ టిప్స్‌ పాటించడం వల్ల ఈజీగా వాటిని తరిమికొట్టవచ్చని చెబుతున్నారు. మరి ఆ టిప్స్‌ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..

నిమ్మకాయ, బేకింగ్ సోడా ద్రావణం : ఉసిళ్లు(Flying Termites) ఇంట్లోకి వస్తే.. వీటిని తరిమికొట్టడానికి నిమ్మకాయ, బేకింగ్​ సోడా మిశ్రమం పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. అందుకోసం ఒక స్ప్రే బాటిల్‌లో నిమ్మకాయ రసం, బేకింగ్‌ సోడా, కొద్దిగా నీళ్లను కలిపి పురుగుల మీద స్ప్రే చేస్తే.. ఉసిళ్లు పారిపోతాయంటున్నారు.

నల్ల మిరియాల పొడి : నల్ల మిరియాల పొడి కూడా ఉసిళ్లను తరిమికొట్టడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. అందుకోసం ఒక స్ప్రే బాటిల్లో నల్ల మిరియాల పొడి, నీళ్లు కలిపి వాటి మీద పిచికారీ చేయాలి. దీంతో ఆ ఘాటు వాసనకు పురుగులు పారిపోతాయని నిపుణులు చెబుతున్నారు. 2014లో Entomology జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో నల్ల మిరియాల పొడి ఉసిళ్లను తరిమికొట్టడంలో సమర్థవంతంగా ఉందని కనుగొన్నారు.

వేప నూనెతో : వేపనూనె కూడా ఉసిళ్లను తరిమికొట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి స్ప్రే బాటిల్‌లో కొన్ని నీళ్లను పోసుకుని.. అందులో కొన్ని చుక్కల వేప నూనెను కలిపి.. ఉసిళ్లపై స్ప్రే చేస్తే అవి ఇంటి నుంచి పారిపోతాయంటున్నారు. అయితే వేపనూనెల ప్లేస్​లో లావెండర్‌, పిప్పర్​మెంట్​ నూనెలను కూడా ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు. ఇవే కాకుండా మరికొన్ని టిప్స్​ కూడా పాటించాలని చెబుతున్నారు.

  • వర్షాకాలంలో సాయంత్రం పూట ఇంట్లోని కిటికీలు, తలుపులను తప్పకుండా మూసేయాలంటున్నారు. ఇవి కొద్దిగా తెరిచి ఉన్నా కూడా ఇంట్లోకి పురుగులు వచ్చే అవకాశం ఉందంటున్నారు.
  • అలాగే వర్షాకాలంలో ఉసిళ్లతో పాటు, దోమల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఇవి ఇంట్లోకి రాకుండా ఉండటానికి తలుపులు, కిటికీలకు మెష్‌ డోర్స్‌ను ఏర్పాటు చేసుకోమని సలహా ఇస్తున్నారు.
  • ఇంటిని శుభ్రంగా ఉంచడం, ఆహార పదార్థాలను మూసి వేయడం ద్వారా వీటిని రాకుండా అడ్డుకోవచ్చని చెబుతున్నారు. అలాగే ఇంటి చుట్టూ చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోమని సలహా ఇస్తున్నారు. అలాగే ఇంట్లోని చెట్ల కింద ఉండే ఆకులను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు.

ఎన్ని చేసినా ఇంటి నుంచి బల్లులు పోవడం లేదా - ఈ టిప్స్​ పాటిస్తే వాటిని తరిమికొట్టడం వెరీ ఈజీ!

దోమలతో నిద్రలేని రాత్రులా? - ఈ 4 మొక్కలు పెంచితే చాలు - అన్నీ ఔట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.