ETV Bharat / health

కళ్ల కింద డార్క్​ సర్కిల్స్​ ఎందుకొస్తాయి? వాటిని ఎలా తగ్గించుకోవాలి? - under eyes dark circles treatment

Tips For Remove Dark Circles Under Eyes In Telugu : అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరి కోరిక. అయితే చాలామందిలో కళ్ల కింద క్యారీబ్యాగులు కనిపించడం లేదంటే నల్లటి మచ్చలు ఏర్పడటం చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అసలు ఇలా క్యారీబ్యాగులు ఏర్పడడానికి కారణం ఏంటి? వీటిని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం.

Dark Circles Under Eyes Removal In Telugu

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 18, 2024, 6:53 AM IST

Updated : Feb 18, 2024, 7:19 AM IST

Tips For Remove Dark Circles Under Eyes In Telugu : అందరి కన్నా అందంగా కనిపించాలి- అందరిలోకి ఆకర్షణీయంగా ఉండాలనేది చాలా మంది కోరిక. అందుకోసం చర్మాన్ని, ముఖాన్ని, శిరోజాలను ఎంతో బాగా చూసుకుంటూ ఉంటారు. అయితే అందాన్ని రెట్టింపు చేసేది మన ముఖమే. ముఖం అందంగా కనిపిస్తే ఆ ఆకర్షణే వేరుగా ఉంటుంది. అందుకే ముఖాన్ని మెరిసేలా, ఎలాంటి మొటిమలు, మచ్చలు లేకుండా చూసుకోవడానికి చాలామంది కష్టపడుతుంటారు.

కానీ చాలామందిలో కళ్ల కింద నల్లటి సర్కిల్స్ లేదా మచ్చలు కనిపిస్తుంటాయి. కొంతమందిలో కళ్ల కింద బ్యాగులు, వాడుక భాషలో చెప్పాలంటే కళ్ల కింద క్యారీ బ్యాగులు కనిపిస్తుంటాయి. అసలు నల్లమచ్చలు, క్యారీ బ్యాగులు ఎందుకు వస్తాయి? వాటిని ఎలా దూరం చెయ్యవచ్చు? నిపుణులు ఏం చెబుతున్నారు?

వయసు:
వయసును బట్టి కూడా కొంతమందిలో డార్క్ సర్కిల్స్, క్యారీ బ్యాగులు వస్తుంటాయి.

అలర్జీ, గజ్జి:
చాలామందిలో గజ్జి, తామర లేదా అలర్జీ వంటి సమస్యల కారణంగా కళ్ల కింద సర్కిల్స్ లేదా బ్యాగులు ఏర్పడటం జరుగుతుంది.

జన్యువులు:
తండ్రులు, తాతల ద్వారా కూడా కొన్నిసార్లు ఈ లక్షణాలు సంక్రమించే అవకాశాలు ఉంటాయి.

కళ్లను రుద్దడం:
చాలామందికి చిరాకు వల్ల లేదా ఇతర కారణాల వల్ల కళ్లను రుద్దే అలవాటు ఉండవచ్చు. దీని వల్ల కూడా నల్లటి సర్కిల్స్ లేదా బ్యాగులు ఏర్పడే అవకాశం ఉంది.

డీహైడ్రేషన్:
శరీరానికి తగిన మోతాదులో నీటిని అందించకపోవడం కూడా ఇందుకు కారణం కావచ్చు.

తక్కువ నిద్ర:
శరీరానికి తగినంత నిద్ర లేకపోవడం కూడా దీనికి కారణం కావచ్చు. వయసుకు తగ్గట్టుగా నిద్రపోకపోవడం అనేది ఇలాంటి ఇబ్బందులకు దారి తీయవచ్చు.

అతిగా ఎండలో ఉండటం:
చాలామంది పనుల వల్ల లేదా ఇతర కారణాల చేత ఎక్కువగా ఎండలో ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారిలో ఈ సమస్య తలెత్తే అవకాశం కనిపిస్తుంది.

రక్తహీనత:
శరీరంలో ఉండాల్సిన మోతాదులో రక్తం లేని సందర్భంలో కూడా ఇలా జరిగే అవకాశం లేకపోలేదు.
ఇక కళ్ల కింద నల్లటి మచ్చలను ఎలా నివారించాలో ఇక్కడ తెలుసుకుందాం

తగినంత నిద్ర:
మన ఆరోగ్యం, అందం మీద నిద్ర ఎక్కువ ప్రభావం చూపుతుంది. కాబట్టి శరీరానికి తగినంత విశ్రాంతిని నిద్ర రూపంలో ఇవ్వాలని గుర్తించుకోండి.

అతిగా స్క్రీన్లు చూడవద్దు:
చాలామంది రాత్రి, పగలు తేడా లేకుండా స్క్రీన్లకు అతుక్కుపోతుంటారు. ల్యాప్​ట్యాప్​లు, ఫోన్లు ఇలా రకరకాల స్క్రీన్ల మీద ఎక్కువ టైం గడపడం వల్ల నల్లటి సర్కిల్స్, క్యారీ బ్యాగులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి స్క్రీన్ టైమింగ్ తగ్గించండి.

సన్ స్క్రీన్ వాడటం అలవాటు చేసుకోండి:
బయటకు వెళ్తున్నప్పుడు సన్ స్క్రీన్ ముఖానికి రాసుకుని బయటకు రావడం ఎంతో ఉత్తమం. దీని వల్ల సూర్యుడి ఎండతాపం నుంచి మన చర్మానికి రక్షణ లభిస్తుంది.

కీరా లేదా గ్రీన్ టీ బ్యాగులు వాడండి:
కంటి చుట్టూ నల్లటి వలయాలు లేదా బ్యాగులు ఏర్పడితే వంట గదిలో ఉండే కీరా లేదా గ్రీన్ టీ బ్యాగులను కళ్ల మీద ఉంచుకోవడం ఉత్తమం. దీని వల్ల కళ్లకు విశ్రాంతి లభించి సర్కిల్స్ ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి.

పొగతాగడం ఆపేయండి:
అందాన్ని కాపాడుకోవాలంటే కొన్నిసార్లు మన అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. పొగతాగడం ఆపేయాలి. మద్యం సేవించడాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

కండలు పెంచుకోవాలా? - అయితే ఈ ఫుడ్స్ మీ డైట్‌లో ఉండాల్సిందే!

అలర్ట్ : మహిళలు, పురుషుల్లో వేర్వేరుగా - గుండెపోటు లక్షణాలు!

Last Updated : Feb 18, 2024, 7:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.