ETV Bharat / health

కనుబొమల వెంట్రుకలు రాలిపోతున్నాయా? - ఈ సమస్య నుంచి ఇలా బయటపడండి! - How To Prevent Eyebrow Hair Loss

Tips For Eyebrow Hair Loss : తల వెంట్రుకలు రాలిపోయినట్టే.. కొందరికి కనుబొమల వెంట్రుకలు కూడా రాలిపోతుంటాయి. మరి.. ఇలా కనుబొమల వెంట్రుకలు రాలిపోవడానికి కారణాలు ఏంటీ? ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలి? అనే విషయాలు ఈ స్టోరీలో చూద్దాం.

Eyebrow Hair Loss
Tips For Eyebrow Hair Loss (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 26, 2024, 11:07 AM IST

Tips For Eyebrow Hair Loss : ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యలలో జుట్టు రాలడం ఒకటి. ఇలా హెయిర్‌లాస్‌ అవ్వడానికి మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం వంటివి ప్రధాన కారణాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చిన్నవయసు నుంచే జుట్టు రాలడం వల్ల ఎక్కువ మంది తమ మూడవ వంతు జుట్టును 30 ఏళ్లలోపే కోల్పోతున్నారు. అయితే.. తల వెంట్రుకలు రాలినట్టే.. కొందరిలో కనుబొమల వెంట్రుకలు కూడా రాలిపోతున్నాయి!

కనుబొమ్మలు ఒత్తుగా లేని వారు ఆత్మన్యూనతకు గురవుతుంటారు. అందంగా కనిపించట్లేదంటూ.. నలుగురిలో కలవడానికి మోహమాటపడుతుంటారు. మరి.. కనుబొమల వెంట్రుకలు (Eyebrow Hair Loss ) ఇలా ఎందుకు రాలిపోతాయి? వెంట్రుకలు రాలిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే ప్రశ్నలకు సౌందర్య నిపుణురాలు డాక్టర్‌ శైలజ సూరపనేని సమాధానం చెబుతున్నారు.

ప్రధాన కారణాలివే!
కనుబొమల వెంట్రుకలు రాలిపోవడానికి.. ఇన్ఫెక్షన్లు, హార్మోనుల్లో మార్పులు, థైరాయిడ్‌ వంటివి కొన్ని కారణమవుతాయి. అలాగే కొంత మంది పని ఒత్తిడి కారణంగా టైమ్‌కు భోజనం చేయకుండా ఉంటారు. అలాగే కఠినమైన డైట్‌ను పాటిస్తుంటారు. ఈ కారణాల వల్ల కూడా కనుబొమల వెంట్రుకలు రాలిపోతాయని శైలజ సూరపనేని తెలియజేస్తున్నారు. అలాగే ఒత్తిడి, ఆందోళన, మేకప్‌ ప్రాడక్ట్స్‌ ఎక్కువగా వాడటం, తరచూ ఐబ్రోస్‌ తీయించుకోవడం కూడా కనుబొమ్మల వెంట్రుకలు రాలిపోవడానికి కారణమవుతాయని ఆమె పేర్కొన్నారు.

అలర్ట్ : చీర అలా కట్టుకుంటే క్యాన్సర్ ఖాయం! - దేవుడా ఇంకా ఎన్ని చూడాలో! - What is Saree Cancer

కారణాలు తెలుసుకోవాలి..
కనుబొమల దగ్గర గుండ్రని ప్యాచ్‌లు వస్తే 'అలోపేషియా ఏరియేటా' అయ్యుండొచ్చు. మన శరీరంలో ఇమ్యూన్‌సిస్టమ్‌ సరిగా పనిచేయకపోవడం వల్ల ఇది వస్తుంది. ఈ సమస్య వల్ల రెప్పలపై ఉన్న వెంట్రుకలు కూడా పోతాయట. దురద, చర్మం పొట్టులా రాలడం వంటి లక్షణాలు కనిపిస్తే అది ఎగ్జిమా కావొచ్చు. సొరియాసిస్, కాంటాక్ట్‌ డెర్మటైటిస్, సెబోరిక్‌ డెర్మటైటిస్‌ వంటి సమస్యల వల్ల కూడా కనుబొమల వెంట్రుకలు రాలిపోతాయి. కాబట్టి, ఈ సమస్యతో బాధపడేవారు ముందుగా కనుబొమలు రాలడానికి అసలు కారణమేంటో వైద్యులను సంప్రదించి తెలుసుకోవాలని డాక్టర్‌ శైలజ సూరపనేని అంటున్నారు.

ఇలా చేయండి :
కనుబొమల వెంట్రుకలు ఎక్కువగా రాలిపోయే వారు కొన్ని టిప్స్‌ పాటించడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చని శైలజ చెబుతున్నారు. మినాక్సిడల్‌ 5% ద్రావణం, కార్టికో స్టిరాయిడ్‌ క్రీములు వాడటం వల్ల కొన్ని రోజుల్లోనే ఈ పరిస్థితి అదుపులోకి వస్తుంది. అలాగే సమస్య పెద్దగా ఉన్నవారు మందులు, ఇంజెక్షన్లనూ తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్‌ శైలజ సూరపనేని చెబుతున్నారు. అయితే.. వీటితోపాటు మస్కారా, ఐబ్రో పెన్సిల్‌ వాడకాన్ని తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. అలాగే రోజూ విటమిన్లు, మినరల్స్‌ ఎక్కువగా ఆహార పదార్థాలు తీసుకోవాలి. చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవ్వకుండా కూల్‌గా ఉండాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా సమస్య తగ్గకపోతే చివరకి.. ఐబ్రో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకోవచ్చని ఆమె పేర్కొన్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీ ముఖం ముద్ద మందారంలా మెరిసిపోవాలంటే - రాత్రి వేళ ఇలా చేయండి! - How to Cleanse Face Every Night

యువకులు స్మోకింగ్​కు ఎందుకు అలవాటు పడతారు? - దాన్ని ఎలా అడ్డుకోవాలి? - Causes of Nicotine Addiction

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.