ETV Bharat / health

ఈ అలవాట్లు మీలో ఉంటే - ఒక్క మొటిమ కూడా మీ ముఖంపై కనపడదు! పైగా గ్లోయింగ్​ స్కిన్​ పక్కా! - Pimples Free Skin Habits

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 11, 2024, 4:56 PM IST

Pimples Free Skin Habits : చర్మం ఆరోగ్యంగా, కోమలంగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. కానీ.. మచ్చలు, మొటిమలతో చర్మం నిర్జీవంగా మారి అందవిహీనంగా కనిపిస్తుంది. మీరు అలాంటి సమస్యతో బాధపడుతున్నారా? అయితే, ఈ అలవాట్లు ఫాలో అయ్యి చూడండి. మొటిమలు లేని గ్లోయింగ్ స్కిన్ మీ సొంతమవుతుందంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Good Habits For Pimples Free Skin
Pimples Free Skin Habits (ETV Bharat)

Good Habits For Pimples Free Skin : చాలా మంది అందంగా కనిపించడానికి, సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి రకరకాల క్రీములను యూజ్ చేస్తుంటారు. ముఖ్యంగా మొహంపై కనిపించే మొటిమలు, నల్ల మచ్చలు తగ్గడానికి వివిధ రకాల సౌందర్య సాధనాలను వాడుతుంటారు. అయినా ఫలితం అంతంతమాత్రమే. అలాంటి వారు ఈ అలవాట్లు ఫాలో అయితే ఎలాంటి బ్యూటీ ప్రొడక్ట్స్​ వాడకుండానే మొటిమలు(Pimples), మచ్చలు లేకుండా న్యాచురల్ బ్యూటీస్​గా కనిపించవచ్చని నిపుణులు అంటున్నారు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఫేస్ వాష్ : చాలా తక్కువ మంది రోజుకు రెండు సార్లు ఫేస్​వాష్​ చేసుకుంటారు. అది మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే, నైట్ పడుకునే ముందు. అయితే, ముఖంపై మొటిమలు రావడానికి ఇలా రెండు సార్లు ముఖం కడుక్కోకపోవడమూ ఓ కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి.. ఈ రెండు సందర్భాలతో పాటు.. చెమట ఎక్కువగా వచ్చినప్పుడు తప్పనిసరిగా ఫేస్ వాష్ చేసుకోవాలంటున్నారు. దాంతో ముఖంపై దుమ్ము, జిడ్డుదనం తొలగిపోయి చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా ఉంటాయి. అలాగే మొటిమలూ ఏర్పడవట! అయితే, ఈ క్రమంలో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. చర్మతత్వానికి సరిపడే ఫేస్‌వాష్‌ను సెలెక్ట్ చేసుకోవడమూ ఇంపార్టెంట్​ అంటున్నారు నిపుణులు!

తరచూ వీటిని శుభ్రం చేసుకోవాలి : సాధారణంగా మనం మొబైల్, ల్యాప్‌టాప్.. వంటి గ్యాడ్జెట్స్‌ని ఉపయోగిస్తున్నప్పుడు వాటిపై పేరుకున్న దుమ్ము, ధూళిని అంతగా పట్టించుకోం. కానీ, వాటిపై చేరే బ్యాక్టీరియా చేతికి అంటుకొని.. దాంతో ముఖంపై తుడుచుకున్నప్పుడు అది స్కిన్ పైకి చేరుతుంది. ఇది కూడా మొటిమలు రావడానికి ఓ కారణమే అంటున్నారు నిపుణులు. అంతేకాదు.. కొన్ని అధ్యయనాల్లో పబ్లిక్ టాయిలెట్ కంటే మొబైల్‌ స్క్రీన్‌ ఎక్కువ అపరిశుభ్రంగా ఉంటుందని తేలింది! కాబట్టి, ఫోన్ స్క్రీన్​తో పాటు ఇతర గ్యాడ్జెట్స్​ని ఎప్పటికప్పుడు క్లీన్​ చేసుకోవడం మంచిదంటున్నారు.

2015లో 'జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. మొబైల్ స్క్రీన్ తాకి చేతులు శుభ్రం చేసుకోకుండా ముఖాన్ని తాకే వ్యక్తులకు మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో న్యూయార్క్‌లోని మౌంట్ సినాయ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ డేవిడ్ డే పాల్గొన్నారు. తరచుగా ఫోన్ స్క్రీన్ తాకి చర్మాన్ని తాకడం మొటిమల సమస్యను పెంచే ఛాన్స్ ఉందని ఆయన పేర్కొన్నారు.

ఎంతటి మొటిమలైనా ఈ టిప్స్​ పాటిస్తే క్లియర్​​! మీరూ ట్రై చేస్తారా?

ఇలా అస్సలు చేయవద్దు : కొంతమందికి పదే పదే ముఖానికి చేతుల్ని తాకించే హ్యాబిట్ ఉంటుంది. ఫలితంగా చేతులకున్న క్రిములు, మురికి ముఖం పైకి చేరి మొటిమలకు కారణమవుతాయంటున్నారు నిపుణులు. కాబట్టి, ముఖం కడుక్కునేటప్పుడు తప్ప మిగతా సమయాల్లో వీలైనంత వరకు చేతుల్ని ఫేస్​కి తాకించకుండా చూసుకోవాలంటున్నారు.

దిండ్ల విషయంలో ఈ జాగ్రత్తలు : మనం దిండ్లను డైలీ వాడే క్రమంలో స్కిన్, జుట్టు కుదుళ్లలో ఉన్న జిడ్డు వాటి కవర్ల పైకి చేరుతుంది. ఈ అపరిశుభ్రమైన దిండ్లనే ఎక్కువ రోజులు వాడడం, ఇతరులు వీటిని యూజ్ చేయడం వల్ల ముఖంపై మొటిమలొస్తాయంటున్నారు నిపుణులు. అందుకే.. వారానికోసారైనా దిండ్ల కవర్లను మార్చుకోవడం, ఎవరి దిండు వారే వాడుకోవడం మంచిదంటున్నారు.

ఆహారపు అలవాట్లు : ముఖం శుభ్రంగా ఉండాలనుకునేవారు డైలీ తీసుకునే ఆహారం విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా డైట్​లో కాయగూరలు, ఆలివ్‌ నూనె, తృణ ధాన్యాలు, తక్కువ మొత్తంలో మాంసం.. వంటివి ఉండేలా చూసుకోవాలంటున్నారు. వీటి ద్వారా చర్మానికి కావాల్సిన పోషకాలన్నీ అంది ఆరోగ్యంగా, అందంగా కనిపిస్తారంటున్నారు నిపుణులు. అంతేకాదు.. మొటిమల సమస్య రాకుండా ఉండాలంటే బరువు అదుపులో ఉండేలా చూసుకోవాలంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

నిద్రపోయేప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా? జాగ్రత్త- మొటిమల సమస్య అధికమవుతుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.