ETV Bharat / health

అలర్ట్ : మద్యంలో సోడా మిక్స్​ చేస్తే జరిగేది ఇదే! - వైద్యుల హెచ్చరిక! - Effects of Drinking Alcohol Soda

Drinking Alcohol With Soda: "ఆల్కహాల్​ డ్రింకింగ్​ ఈజ్​ ఇన్​జ్యూరియస్​ టు హెల్త్​" అని సినిమాలు, టీవీల నుంచి మన వెల్​ విషర్స్​ దాకా అందరూ చెప్తుంటారు. కానీ.. "సోడా ఆరోగ్యానికి హానికరం" అని ఎవరైనా చెప్పారా? మందులో సోడా మిక్స్​ చేసుకోవడం ఎంత ప్రమాదకరమో మీరు ఎప్పుడైనా విన్నారా??

Drinking Alcohol With Soda
Side Effects of Drinking Alcohol With Soda (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 17, 2024, 10:12 AM IST

Side Effects of Drinking Alcohol With Soda: మద్యపానం ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలుసు. కానీ.. సోడా ప్రమాదకరమని కొందరికే తెలుసు. ఈ రెండిటినీ మిక్స్​ చేసి తాగడం చాలా డేంజర్​ అని మాత్రం పెద్దగా తెలియదు. మరి.. మందులో సోడా కలుపుకుని తాగితే ఏమవుతంది? వైద్య నిపుణులు ఏమంటున్నారు? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

ఎముకలు బలహీనం: ఆల్కాహాల్‌లో సోడా కలుపుకుని తాగడం ఎంతమాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోడాలో ఉండే పాస్పరిక్ యాసిడ్ శరీరంలో కాల్షియాన్ని తగ్గిస్తుంది. ఇది ఎముకలకు చాలా ప్రమాదకరం. ఒంట్లోని బోన్స్ బలహీనమైపోతాయి. చాలా కాలం సోడా తాగితే ఎముకల్లో పగుళ్లు కూడా ఏర్పడుతాయి. చిన్న దెబ్బ తగిలినా విరిగిపోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చూయింగ్ గమ్ నోట్లో ఎంతసేపు ఉంచుతున్నారు? - ఎక్కువ సేపు నమిలితే ఏమవుతుందో తెలుసా? - Chewing Gum Side Effects

బరువు పెరగడం: సోడాలో కేలరీలు ఉంటాయి. క్రమం తప్పకుండా ఆల్కహాల్​లో సోడా కలుపుకోవడం వల్ల బరువు పెరుగుతారని అంటున్నారు. సోడాలోని అధిక చక్కెర రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందని.. దీనివల్ల మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుందని కూడా హెచ్చరిస్తున్నారు. అలాగే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.

క్యాన్సర్: సోడాలోని కొన్ని రసాయనాలు క్యాన్సర్ కారకాలుగా ఉంటాయని.. క్రమం తప్పకుండా ఆల్కహాల్​లో సోడా కలుపుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 2019లో BMC పబ్లిక్​ హెల్త్​ జర్నల్​లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. మందులో సోడా కలుపుకుని తాగడం వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్​లో ప్రొఫెసర్​ డాక్టర్ డానా బోస్ పాల్గొన్నారు. క్రమం తప్పకుండా ఆల్కహాల్​లో సోడా కలిపి తాగే వ్యక్తులకు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 20% ఎక్కువగా ఉందని వారు పేర్కొన్నారు.

కిడ్నీలో రాళ్లు: అల్కహాల్​లో సోడా కలుపుకుని తాగడం వల్ల కిడ్నీల సమస్య వేధిస్తుందని నిపుణులు అంటున్నారు. సోడాలోని ఫ్రక్టోజ్ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుందని చెబుతున్నారు.

తలనొప్పి: ఆల్కహాల్​, సోడాలోని చక్కెర రెండూ తలనొప్పికి కారణమవుతాయని నిపుణులు అంటున్నారు. ఈ రెండింటి కలయిక తలనొప్పిని మరింత తీవ్రతరం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.

మానసిక సమస్యలు: మందు, సోడా కాంబినేషన్​ కేవలం శారీరక సమస్యలకే కాకుండా మానసిక సమస్యలకు కూడా కారణమవుతుందని అంటున్నారు. ఆల్కహాల్​, సోడాలోని కెఫెన్ ఆందోళన, నిరాశ, నిద్రలేమి వంటి మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని చెబుతున్నారు.

ఈ ఆహారాలు కలిపి తింటున్నారా? - ఆరోగ్యాన్ని చేజేతులా ప్రమాదంలో పడేసుకున్నట్టే! - Avoid These Food Combinations

అసలు పైల్స్​ ఎందుకొస్తాయి? - రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? - Piles Symptoms and How to Cure

బీ అలర్ట్​: భోజనానికి ముందు, తర్వాత చాయ్​ తాగుతున్నారా? - ICMR Instruction to Avoid Tea

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.